పుస్తకం ఆంటే నాకిష్టం
ఎందుకంటే...
అందులో అక్షరాలుగా,
పదాలుగా,
వాక్యాలుగా
ఒదిగిన నా మిత్రులుంటారు.
వారి జ్ఞానం,
కార్యాలు ఉంటాయి.
నా గత తరాల వేదన ఉంటుంది.
ఆ వేదన బాపే దీప స్థంబాలుంటాయి
పుస్తకంలో అక్షరాలను
నా మునివేళ్ళతో తడిమినప్పుడు...
కన్న తల్లి ఒడిలో కూర్చుని
తన ముంగురులతో ఆడుకున్నట్లనిపిస్తుంది.
నాన్న భుజం తట్టినప్పటి ధైర్యం వస్తుంది.
లోక కళ్యాణం కోసం
మరణించిన సహచరులకు
చివరి సెల్యూట్ చేసినట్లనిపిస్తుంది.
(ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు)
No comments:
Post a Comment