Sunday, April 20, 2025

 *మాయ ఎలా అవహిస్తుంది ?* *దాని నుండి ఎలా బయటపడాలి ! ?*
*కోరిక, మోహం రూపంలో మాయ మన మనసును అవహిస్తుంది.*




మనలో పూర్తి జ్ఞాన-వైరాగ్యాలు కలిగే వరకు మాయ మనలను వదిలిపెట్టదు.

మనం లౌకిక విషయాల్లో ఇరుక్కుపోయేందుకు మాయ చేసేందుకు అలవాటు పడ్డాం.

ఇప్పుడు అనుభవిస్తున్న విషయాన్ని మళ్ళీ కావాలనుకోవటం, అప్పటికి లేని విషయాలను కావాలని అడగటం కోరిక అవుతుంది.

లభించింది శాశ్వతంగా ఉండాలన్న ఆశ మోహం అవుతుంది.

కోరిక, మోహం లేని స్థితి వైరాగ్యం.

ఇప్పుడు మనం ఏఏ విషయాల్లో మాయలేకుండా ఉన్నామో ఆయా విషయాల్లో మనం విరాగులమే అవుతాం.

అదే స్థితి అన్ని విషయాల్లోనూ పొందితే సంపూర్ణ విరాగులం అవుతాం.

వైరాగ్యం, ఆత్మసాక్షాత్కారం వేర్వేరు కాదు.

మన యదార్ధస్థితిని తెలుసుకోవటమే రెండింటి ఫలం.

తద్వారా మాయ నుండి బయట పడవచ్చు .

No comments:

Post a Comment