Tuesday, April 22, 2025

 *🤠 నేటి సామెత 🌸*


*ముసలితనంలో చింతామణి వేషం వేసినట్లు*


చింతామణి పాత్రను వెయ్యడానికి నవనవలాడుతూ నాజూకుగా ఉండి యవ్వన ప్రారంభ దశలో ఉన్న స్త్రీలే అర్హులౌతారు. అలాకాక వయసు ఉడిగి, ముసలితనం ముఖంలో స్పష్టంగా కనిపించేవారు చింతామణి పాత్ర వేస్తే ప్రేక్షకులకు చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఏ సమయానికి ఏ వయసుకు తగిన పనిని వారుచేయాలికానీ, వేరొకరు చేస్తే బాగుండదు. కొంతమంది ఏ పనికైనా తామేనంటూ ముందుకు వస్తారు. అలా వచ్చేవారు ఆ పనిని తాము చేసినందువల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోవడం అవసరమని ఈ సామెత.

No comments:

Post a Comment