*♦️నేటి జాతీయం♦️*
*నక్కను తొక్కటం*
అదృష్టానికి చిహ్నంగా ఈ " మాటను వాడుతుంటారు. జిత్తులమారి అయిన నక్క ఎదురుపడటమే విశేషం. అజాగ్రత్తగా పడివుండటం అంతకన్నా విలక్షణం. ఆ నక్కను తొక్కటమంటే అందరికీ సాధ్యం కానిది. ఎవరో ఒక మహనీయుడు కష్టపడి అంతపనీ చేసివుంటే అతడు మామూలు వ్యక్తికాదు. అంటే అదృష్ట వంతుడనీ, సమర్థుడనీ భావిస్తారు. 'నక్కను తొక్కి 'వచ్చా'డంటే, అదృష్టదేవత వరించినట్టు. అసలు నక్క ఎదురుపడటం అంటే పిల్లిలానే అపశకునం కింద లెక్క. అలా అపశకునమెదురైనా అనుకొన్న పని మానకుండా చేసినవాడు అదృష్టవంతుడైనా కావాలి, అసహాయశూరుడైనా కావాలి. ఈ భావంతో నక్కను తొక్కడం శుభసూచకమనీ, అదృష్ట లక్షణమనీ భావిస్తారు.
No comments:
Post a Comment