తాతయ్య పలుకులు
ఉత్తి ఉత్తి గా ఉండక
ఉషారుతో
ఉపకారిగా ఉంటూ
ఉజ్వలంగా ఎదగవోయి
చేయక చెడు
చేతనైనంత వరకు
చేయూత నిస్తూ
చలాకీగా ఉండవోయి
అజమాయిషీ వద్దు
అందరిని కలుపుకొని
ఆనందంతో మసలు
అదే మంచి ఆరోగ్యంమోయి
కష్టించే తత్వం
కలుపుకొని పోతూ
కల్మషాలు వీడితే
కుశలతలు మెండోయి
అక్షరం నేర్చుట
అభివృద్ధికి మూలం
అదృత అలజడి చెందక
అవే అందరికి చేటోయి
దేశ మంచికోరు
దైవత్వంతో మసలు
అవే తెస్తాయి
అందరిలో గౌరవం
*మిడిదొడ్డి చంద్రశేఖరరావు 9908413837*
No comments:
Post a Comment