Tuesday, April 15, 2025

 ప్రతిరోజు మనం నిద్ర లేచిన దగ్గర్నుండి మళ్లీ పడుకునే వరకు చాలామందిని చూస్తూ ఉంటాం...

ఎంతసేపు వాళ్ళకి ఏం కావాలో దానికోసం ఆలోచిస్తారు, తప్ప పక్క వాడికి ఏదైనా సహాయం చేద్దామని ఆలోచన రాదు ఎందుకో.... కానీ మనం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే వర్గానికి చెందినవాళ్ళం....  

ఈ చిన్న జీవితం కోసం వెంపర్లాడడం ఒక విధంగా మంచిదే, తప్పులేదు అయినప్పటికీ పక్క వాడికి సాయం చేసే ఆలోచన లేకపోవడం చాలా దురదృష్టకరం... 

సో మన జీవితంలో ఒక్కరికైనా సహాయ పడదాం, ఏదో విధంగా కనీసం మాట రూపేణా అయినా సరే.... 

ఖచ్చితంగా మనం నమ్మిన భగవంతుడు మనల్ని కరుణిస్తాడు 

మనం కష్టంలో పడకుండా, ఒకవేళ కష్టంలో ఉంటే ఏదో విధంగా సహాయం చేస్తాడు, ఇది నమ్మాలి నేను నమ్మను అంటే ఎవరు ఏం చేయలేరు, ఖచ్చితంగా మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది. 

ఈరోజు నుండి సదా సర్వదా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకోండి, ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి కర్మ అనేది గోడకు విసిరిన బంతి లాంటిది, కొంచెం ఆలస్యమైన వెనక్కి తిరిగి ఖచ్చితంగా వస్తుంది. 

భగవంతుడు అనే సీసీ కెమెరా మనల్ని అనుక్షణం పర్యవేక్షిస్తుంది, మనం నమ్మాలి గాని మన ప్రతి అవసరాన్ని భగవంతుడు ఏదో  ఒక రూపంలో తీరుస్తూ ఉంటాడు, ఎప్పుడూ కూడా పొందడమే కాదు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. 

 *సదా సర్వదా మీ శ్రేయోభిలాషి... వి ఎస్ బి సురేష్*

No comments:

Post a Comment