Tuesday, April 15, 2025

 మనం సాధారణంగా నిజ జీవితంలో ఎవరో మనల్ని గుర్తించాలని, అభినందించాలని కోరుకుంటాం...

ఎవడో గొట్టం గాడు మనల్ని గుర్తించడం ఏంటి...? 

పైగా మనం అలా అడిగేది కూడా విలువలు తెలియని వాడిని... ఒకవేళ అవతలి వాడికి విలువలు తెలిసి ఉంటే మనం అడగకుండానే మనకి సపోర్ట్ చేస్తారు. 

ఏం... మన విలువ మనకు తెలియదా...? మనల్ని గుర్తించి, మన దగ్గరికి వచ్చి నువ్వు ఈ పని చెయ్యి అంటే చేయండి, మన చుట్టూ ఉండే చాలామంది నేనే సూపర్, నేనే గొప్ప అనుకుంటారు, కానీ వాళ్లకి తెలియని విషయం ఏంటంటే ఎవరికి వాళ్ళే గొప్ప.

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కడు అన్ని నాకే తెలుసు, నేనే గొప్ప అందరికంటే... అనుకుంటూ ఉంటాడు, సరిగా ఆలోచించండి ఎవడి సినిమాకు వాడే హీరో... 

ఈ విధంగా ఆలోచిస్తేనే మనకు విలువ ఉంటుంది, ఏదైనా ఒక పని విషయంలో నీకంటే పలానా వాళ్లు బెటర్ గా చేస్తున్నారు అన్నప్పుడు సూపర్ అని చెప్పండి,వాళ్ళు సంతృప్తి చెందుతారు.

ఇలా కనీసం కొన్ని విషయాల్లో ఆలోచించండి... అప్పుడు ఖచ్చితంగా మీరే హీరో...

సదా సర్వదా మీ శ్రేయోభిలాషి వి ఎస్ బి సురేష్...

No comments:

Post a Comment