Sunday, April 20, 2025

 @@@@@@@@@@
 
అంశం: *మంచితనానికి* *విలువ *లేదా* ?

 శీర్షిక :*మంచితనానికి* *మరణం లేదు* 
***************************

మనసులో వెలుగులా మెరుస్తుంది మంచితనం..అది మన జీవితానికి
 అర్థం, పరమార్థం తెస్తుంది..మనిషికి ఉన్న 
మంచి గుణాలే నిజమైన సంపద...!

 పేదవారికి సహాయం చేయడంలో ఆనందం ఉంది..దానితో మన హృదయం సంతోషంతో నిండిపోతుంది...!

 మంచితనం వల్ల మన జీవితం సాఫల్యం పొందుతుంది.. ప్రేమ, శాంతి, స్నేహం పుట్టే వాతావరణం ఏర్పడుతుంది.. ప్రపంచం మంచితనంతోనే ముందుకు సాగుతుంది..మంచితనం
మాయమవుతుందనుకుంటే
 మానవత్వం మిగలదు ఈ లోకంలో...!

ప్రపంచాన్ని మార్చే శక్తి దానిలో ఉంది.. అన్యాయాల అంధకారంలో మంచితనం దీపంలా వెలుగుతుంది.. ప్రతి చిన్న సహాయం ఎదుటివారికి ఆసరాగా మారుతుంది...!

మంచితనం మనకు శాశ్వత సంతోషం ఇస్తుంది.. అందుకే ఈ లోకంలో మంచితనమే మహాధనం.. దాన్ని మనం ఎన్నటికీ మరువకూడదు...!

మంచి చేద్దాం... మానవత్వాన్ని కాపాడుదాం! ఈ లోకాన్ని ప్రేమతో నింపుదాం...!!
_____________
 ✍🏻
భారతీదేవి చేరెడ్డి

No comments:

Post a Comment