Sunday, April 20, 2025

 🌹 *కుంకుమ* 🌹

*కుంకుమ పెట్టుకోవడం హిందూ సంప్రదాయం అన్ని కులాల హిందువులు, శైవ, వైష్ణవ మతస్తులు అందరూ నొసటిన కుంకుమ ధరించడం గొప్పదనంగా భావిస్తారు.* *కుంకుమ పెట్టుకోవడం ఆచారమే కాకుండా అలంకారం కూడా, అంతేకాదు మనిషికి దృష్టి దోషం తగలకుండా ఉంటుందని కూడా నమ్మకం, మరొకటి ఏమిటంటే కుంకుమను ధరించే వ్యక్తికి ఎదుటివారు మానసికంగా లొంగిపోతారన్న సైకాలజీ వాదన కూడా ఉంది. కుంకుమ ధరించడం పవిత్రతకు ఆస్తికత్వానికి ధార్మికత్వానికి, సౌభాగ్యానికి, స్థిర బుద్ధికి సంకేతం అని చెప్పవచ్చు. భర్తను కోల్పోయిన స్త్రీలు పరులెవరికి అందంగా తాము కనిపించకూడదని ఉద్దేశంతో కుంకుమ ధారణను త్యజించారు. నాడు సమాజంలో వారిని గౌరవప్రదంగా చూసేవారు. కానీ ఈరోజు అందుకు భిన్నంగా సందర్భాలను బట్టి వ్యవహరించడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. సమాజ శ్రేయస్సుకు మన సంప్రదాయాలను విస్మరించకూడదు.* *సంప్రదాయాలు పాటించడం వల్ల సమాజంలో గౌరవం సానుభూతి లభిస్తుంది సంప్రదాయాలు విస్మరిస్తే సమాజపతనం తప్పడు వాటి విలువ దీర్ఘంగా తెలుస్తుంది.*

🙏 *సర్వేజనా సుఖినోభవంతు* 🙏

No comments:

Post a Comment