*అరటిపండును తొక్క తీసే తింటాం.*
*సపోటాను తొక్క తీసిన గింజ ఊసేసి తింటాం.*
*సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తింటాం,పై తొక్కు,*
*లోపలి గింజలు వదిలేస్తాం.*
*ఆపిల్, జామ పళ్ళని మొత్తం తినేస్తాం.*
*ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం.*
*ఒక్కోటి ఒక్కో రుచి.తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు. అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.*
*అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు.*
*మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తమంతే.*
*అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు.*
**కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు ,ఒక్కోరిది ఒక్కో స్వభావం. అయితే అందరు పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే కానీ మనిషి విషయంలో వాళ్ళు చేసిన మంచి కంటే , వాళ్ళు చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది. పండులో అక్కర్లేని గింజ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా !!*
*పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం.*
*ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం.*
*కుటుంబమనేది - ఏ మిక్సిడ్ భ్యాగ్ అఫ్ ఫ్రూట్స్..!*
No comments:
Post a Comment