💦 *ఎందుకు? ఏమిటి? ఎలా?* 🤔
✍️ *ప్రశ్న: గొట్టం మాత్రల లోపల మందు కడుపులో బయటెకెలా వస్తుంది?*
*🐥మందులు బాగా చేదుగా ఉన్నా, అభ్యంతరకర రసాయనిక లక్షణాలతో ఉన్నా వాటిని బుల్లి గొట్టంలాంటి దాంట్లో అమరుస్తారు. వీటినే క్యాప్స్యూల్స్ అంటారు. పరిశీలించి చూస్తే ఇది రెండు సగాలను కలిపినదని అర్థం అవుతుంది. ఈ గొట్టాల్ని లోహంతోనో, మరేదైనా ప్లాస్టిక్ పదార్థాలతోనో చేయరు. అలా చేస్తే గొట్టం విడివడి మందు బయటపడదు. వీటిని సాధారణంగా గ్త్లెనో ప్రోటీన్లు అనే అపాయం లేని సేంద్రీయ పదార్థాలతో తయారుచేస్తారు. మింగిన తరువాత వీటి పైపొరంతా పొట్టలో జీర్ణం అవుతుంది. పొర లోపల ఉంచిన మందు విడుదలై వ్యాధి నివారణ ప్రక్రియలో పాల్గొంటుంది.*
💦🐋🐥🐬💦
No comments:
Post a Comment