*ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్ళి ఘనంగా జరుగుతోంది.*
*అదే దారిలో వెళుతున్న ఓ ముసలాయన,*
*అక్కడ భోజనాలు పెడుతున్న ఒక వరుస చివరిలోకి వెళ్ళి కూర్చున్నాడు.*
*పెళ్ళి కొడుకు తండ్రి* *సుబ్బరామయ్య అక్కడ అందరినీ పలకరిస్తూ వస్తున్నాడు.*
*ఆ ముసలాయనకు అరిటాకు వేసి,*
*ఖచ్చితంగా వడ్డించే టైం లో* *సుబ్బరామయ్య అక్కడికొచ్చి,*
*ముసలాయనను భోజనాల దగ్గర నుండి లేచి పొమ్మని గట్టిగా అరుస్తూ ......... మెడపట్టి బయటకు గెంటాడు.*
*గట్టిగా విసురుగా తోయడంతో, ఆ ముసలాయనకు పక్కనే ఉన్న కిటికీ తగలడంతో ముక్కు నుండి రక్తం కారింది.*
*ప్రక్క వరుసలో భోజనాలు వడ్డిస్తున్న సుబ్బరామయ్య బావమరిది నరసయ్య వెంటనే ఆ ముసలాయనను బయటకు తీసుకెళ్ళి..............*
*ఖర్చీప్ ను తడిపి ముక్కు వద్ద ఉంచి ,*
*పక్కనే ఉన్న ఒక వ్యక్తికి ఒక కవర్లో స్వీట్లు తెమ్మని చెప్పి,*
*ఆ కవర్ ను ముసలాయనకు ఇచ్చి పంపాడు.*
*పెళ్ళి అయిపోయాక,*
*సాయంత్రం సుబ్బరామయ్య ఖర్చుల పట్టీలన్నీ చూసుకుంటూ ఓ గదిలో కూర్చుని ఉండగా,*
*నరసయ్య అక్కడికెళ్ళి , “* *బావా....! అందరూ నిన్ను గొప్పగా అనుకోవాలని*
*లక్షలు ఖర్చుపెట్టి పెళ్ళి చేసావు.బాగానే ఉందిగానీ,*
*ఆ ముసలాయన భోజనం చేస్తూ ఉంటే, ఎందుకలా..... మెడపట్టి గెంటావు.*
*అది చూసి, అక్కడ భోజనాలు చేస్తున్న వారంతా*
*నిన్ను ఎంతగా అసహ్యించుకున్నారో.......,*
*ఎంతగా విమర్శించారో.............తెలుసా...... అని బాధగా కోపంగా ఉన్నాడు.*
*దానికి సుబ్బరామయ్య, “ ఆ ముసలాయన మాసిన బట్టలతో వచ్చి,*
*అందరిలో భోజనాల ప్రక్కన కూర్చునే సరికి,*
*అక్కడందరూ* *ఏమనుకుంటారేమోనని అలా చేసాను “ అని చెప్పాడు.*
*“ నువ్వు అతని మాసిన బట్టలనే చూసావుగానీ,*
*ఆ బట్టల వెనుక ఉన్న అతని కడుపులోని ఆకలిని అర్థం చేసుకోలేకపోయావు.*
*ఎంత ఆకలిగా లేనిది , అలా వచ్చి భోజనాల దగ్గర కూర్చుంటాడా....!*
*అని ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే,*
*పెళ్ళికి వచ్చిన వారంతా నిన్ను తప్పుబట్టే వారు కాదు కదా....!* *కనీస మానవత్వం లేకుంటే మనం మనుషులమని ఎలా* *అనిపించుకుంటాం బావా....! అని*
*ఒకింత ఆవేదనతో మాట్లాడుతూ నరసయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు.*
*తాను చేసింది తప్పేనని అర్థం చేసుకొని.............*
*సుబ్బరామయ్య అక్కడే కూర్చుని ఆలోచనలో పడిపోయాడు.*
*ఎంతటి కోటీశ్వరుడివైనా, లక్షలు ఖర్చు పెట్టగల స్థోమత ఉన్నా ..........*
*మానవత్వం మరిచి నిర్దయగా ప్రవర్తిస్తే అందరూ అసహ్యించుకుంటారు.*
No comments:
Post a Comment