Friday, April 18, 2025

 *అరుణాచల👋

 *సంతోషం, దుఃఖం ఈ రెండిటికీ అతీతంగా ఉండాలంటే ఏం చేయాలి ?* 

సంతోషం, దుఃఖం ఈ రెండిట్లో ఏది కలుగుతున్నా దానికి ప్రధాన కారణం సంబంధం.

 మనకు సంబంధంలేని విషయాలు మన మనసుని స్పందింప చేయలేవు. 

అందుకే గౌతమ బుద్ధుడు ప్రపంచాన్ని, వస్తువులను లేకుండా చేయలేము కనుక వాటితో మనము ఏర్పరుచుకున్న సంబంధాన్ని తొలగించుకోవాలని బోధించారు.

 మనం పడే ఏ తపన అయినా సంతోషం పొందటం కోసం, దుఃఖాన్ని తగ్గించు కోవడం కోసమే. 

అనునిత్యం మన అనుభవాలు ఈ రెండింటి మిశ్రమంగానే ఉంటున్నాయి. 

మన ఇద్దరు పిల్లల్లో ఒకరికి మంచి మార్కులు వస్తే సంతోషం. మరొకరికి తక్కువ మార్కులు వస్తే బాధ.

 మనకిష్టమైన చిన్ననాటి స్నేహితులు కలిస్తే సంతోషం, అప్పులవాడు ఎదురై అరిచాడన్న బాధ దుఃఖంగా సంభవిస్తుంటాయి

. కారు ఉందన్న సుఖానుభూతితో పాటు అది రిపేర్ కు వచ్చినప్పుడు కలిగే దుఃఖానుభవం కూడా సిద్ధంగా ఉంటుంది. 

పూర్తిగా దుఃఖాన్ని లేదా సంతోషాన్ని మాత్రమే అందించే రోజుఏదీ ఉండదు. 

సంబంధ బాంధవ్యాలే సుఖ-దుఃఖాలను ప్రభావితం చేస్తాయి ! 

ప్రతి అనుభవంలోనూ మనం ఆపాదించుకునే మన ప్రమేయాన్ని తగ్గించుకుంటే క్రమంగా ఆ సంబంధం తగ్గుతుంది. 

అంటే పరిధిచేత ఏర్పడే కర్తృత్వభావన పోతేనే మనం సుఖ-దుఃఖాలు నుండి విముక్తులం కాగలం 

---- శ్రీరమణీయం నుండి

No comments:

Post a Comment