Thursday, April 24, 2025

 🕉️ ఓం నమః శివాయ 🕉️

🙏 శివాయ గురవే నమః 🙏

*మానవ జన్మ అంతిమ లక్ష్యం ఏమిటి???*

మానవ జన్మ ఎత్తి, మానవుడిగా పుట్టిన వారికి, అంతిమ లక్ష్యం మోక్షం పొందడమే!!!

పరమాత్మ తేజస్సు, సృష్టి ప్రారంభమైనపుడు... ప్రకృతి ప్రభావంతో ఆత్మలుగా ప్రతిబింబించాయి. 
   ఇలా ఉన్న ఆత్మలనే జీవాత్మలని అంటాం, వాస్తవానికి పరమాత్మ ప్రతిబింబమే అలా పదార్థంతో ఏకమైన జీవాత్మ తన నిజమైన ఉనికిని మరచి, దేహాన్నే తానని భ్రమించి, దేహాలను మార్చుకుంటూ గమ్యాన్ని మరిచి తిరుగుతుంది...

ఇలా జీవాత్మ గతి తప్పి తిరగడాన్నే సంసారం అంటారు. 
అలాంటి జీవాత్మ మానవ జన్మ ఎత్తి తన నిజతత్వాన్ని గురువుల బోధనలతో అర్థం చేసుకొని, భౌతికమైన మానసికమైన బంధాల నుంచి తపోసాధనలతో తెంచుకొని పరమాత్మలో తన ఉనికిని స్థిరం చేసుకోవడాన్నే మోక్షం. 

ఇలా మోక్షం పొందడము కేవలం వివేకవంతుడైన మనిషికి మాత్రమే సాధ్యం, ఎప్పుడూ ఉనికి కలిగి వుండి తన తత్వమైన పరమ ఆనందాన్ని పొందుతూ ప్రకృతికి అతీతంగా ఉన్నదే పరమాత్మ...

ప్రకృతికి అతీతమైన స్థితిని చేరిన ముక్తిపొందిన ఆత్మ తిరిగి జన్మంచదు. 
కష్టాలపాలు కాదు, నిత్యానందాన్ని శాశ్వతంగా అనుభవిస్తుంది. 

సర్వవిధ భగవత్ సాధనల పరమ లక్ష్యం జీవాత్మ తన నిజస్థితియైన పరమాత్మ స్థానాన్ని పొందడమే...
 
*అహం విడనాడితేనే పరిపూర్ణత సాధ్యం*

దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు. తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది. నారదుడి వీణ మహతి. ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు. ఇంద్రాది దేవతలను తమ గానంతో, వీణానాదంతో అలరించేవారు. మహావిష్ణువును స్తుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు. తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండటంతో ఇద్దరికీ గర్వం పెరిగింది. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికీ స్పర్థలు కూడా మొదలయ్యాయి.  
 
ఎవరు గొప్పో సాక్షాత్తు మహా విష్ణువు వద్దే తేల్చుకోవాలనే పట్టుదలతో తుంబుర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు.

 పోటాపోటీగా గానం చేశారు. నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా, విష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడై, అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. నారదుడు చిన్నబోయాడు. సంగీతంలో విద్వత్తు సాధించడానికి ఏం చేయాలంటూ విష్ణువునే సలహా అడిగాడు. ‘గానబంధు’ అనే గుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు. ‘గానబంధు’ వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుంబురుడిని సవాలు చేసేందుకు అతడి నివాసానికి వెళ్లాడు.

అక్కడ గాయపడ్డ స్త్రీలు విలపిస్తూ కనిపించారు. ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు. ‘నీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా’ అని బదులిచ్చారు వారు. ‘ఇక్కడికెందుకొచ్చారు?’ అని ప్రశ్నించాడు నారదుడు. ‘తుంబురుడు గానం చేస్తే స్వస్థత పొందుదామని వచ్చాం’ అని బదులిచ్చారు. ఆ సమాధానంతో చిన్నబోయిన నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీదేవిని ఆశ్రయించాడు. ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్వత్తును సాధించాడు.
 
ఎవరు గొప్ప విద్వాంసులో సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తేల్చుకుందామంటూ తుంబురుడిని సవాలు చేశాడు నారదుడు. ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు. ఇద్దరి గానాన్నీ విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు. అయితే, ఎవరు గొప్పో తాను తేల్చలేనన్నాడు. ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒక్కడేనని చెప్పాడు. దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబుర నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్లారు.

 హనుమంతుడు న్యాయనిర్ణేతగా రాగా, దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు.  తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడిగి సంగీతంలో లీనమైంది.  
 
తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు. మహతి మీటుతూ గానాన్ని సాగించాడు. నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది. తుంబురుడి గానానికి గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి. నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి. ప్రకృతిలో జీవకళ ఉట్టిపడసాగింది. దేవతలందరూ తన్మయత్వంతో తలలూపసాగారు. నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు.

హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందోనని ఆత్రంగా చూడసాగారు. ‘ఇద్దరూ సమ ఉజ్జీలుగానే ఉన్నారు. ఇంకో పరీక్ష పెడతాను. మీ వీణలు ఇలా ఇవ్వండి’ అడిగాడు హనుమంతుడు. ఇద్దరూ తమ వీణలను అతడి చేతికి అందించారు. హనుమంతుడు రెండు వీణలనూ తీసుకుని, రెండింటిలోని చెరో మెట్టును ఊడదీసి వారికి ఇచ్చాడు. ‘ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి’ అన్నాడు. దీంతో తుంబుర నారదులిద్దరూ అసహనానికి గురయ్యారు.

‘వీణలో అన్ని మెట్లూ ఉంటేనే కదా వాయించగలం. చెరో మెట్టు తీసేసి ఇప్పుడు వాయించమంటే ఎలా?’ అని అడిగారు. హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకుని, దాన్ని చీల్చాడు. దానికి తీగలు తగిలించాడు. ఎలాంటి మెట్లులేని వీణను తయారు చేశాడు. ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలుపెట్టాడు. మంద్రంగా మొదలైన స్వరఝరి క్రమంగా ఉధృతి అందుకుంది.

ఆ గానానికి వైకుంఠం నుంచి మహావిష్ణువే పరుగున అక్కడికి వచ్చినా, అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు. హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత తుంబుర నారదులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించారు. హనుమద్గానంతో తమ కళ్లు తెరుచుకున్నాయని అన్నారు. వారి మాటలతో బాహ్యస్పృహలోకి వచ్చిన దేవతలు అక్కడకు వచ్చిన మహావిష్ణువును గమనించారు. ఆయన అభిప్రాయం కోరారు. తుంబుర నారదులిద్దరూ తన భక్తులే అయినా, ఇద్దరిలోనూ ఇంకా అహం పూర్తిగా నశించలేదని, అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేక పోయారని, అహాన్ని వీడటం వల్లనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు విష్ణువు.

అహం ఉన్నంత కాలం ఏ విద్యలోనూ పరిపూర్ణత లభించదు. . అహం విడనాడితేనే పరిపూర్ణత సాధ్యం

*బ్రహ్మ జ్ఞానమంటే ఏమిటి?* 

అత్యున్నత బ్రహ్మ జ్ఞానమును పొందిన వానికి శాస్త్ర పఠనము వలన ప్రయోజనము లేదు. అలానే శాస్త్ర పఠనము ద్వారా ఎట్టి ఔన్న త్యమును పొందలేము. శాస్త్రాలలోని వివిధ పదాలు కిక్కిరిసిన అరణ్యము లాంటివి. అందులో చిక్కుకొనిన బయటపడుట చాలా కష్టము. వాటి వలన మనస్సు వికలమ గును. అందువలన తెలివి కలిగినవారు ప్రీతితో నిజమైన ఆత్మ స్వభావమును గ్రహించుట అవసరము. అజ్ఞానమనే నాగుపాముచే కాటు వేయ బడిన వ్యక్తికి బ్రహ్మజ్ఞానాన్ని పొందుటయే సరైన వైద్యము. అందుకు వేదాలు, శాస్త్రాలలోని మంత్రాల ద్వారా వైద్యము చేయాలి.

కేవలము మందు పేరు పదేపదే ఉచ్చరించుట వలన రోగము తగ్గదు. ఆ మందును సేవించవలసి ఉంటుంది. అలానే బ్రహ్మమును స్వయముగా తెలుసుకొనుట ద్వారానే వ్యక్తి బ్రహ్మాన్ని పొందగలడు. బ్రహ్మము, బ్రహ్మము అని పదేపదే ఉచ్చరించుట వలన బ్రహ్మ జ్ఞానము లభించదు. 63. బ్రహ్మము, తాను ఒక్కటే అను జ్ఞానము స్వయముగా సమాధి స్థితి ద్వారా పొందకుండా, అలానే తానే చిదా త్మను అని గ్రహించకుండా, బ్రహ్మము వేరు తాము వేరు అని ద్వంద్వ భావముతో ఉన్నప్పుడు అది అజ్ఞానమని పిలవబడుతుంది. ఆ అజ్ఞానమే తన యొక్క చెడు పనులకు కారణమని గ్రహించాలి. అది తొలగినప్పుడే ముక్తి. కేవలము బ్రహ్మము, బ్రహ్మము అని ఎన్ని సార్లు ఉచ్చరించినను బ్రహ్మాన్ని పొందలేముకదా!

ఒక రాజు తన చుట్టూ ఉన్న శత్రువులను జయించకుండా తానే చుట్టుప్రక్కల గొప్పవాడినని, తానే చెప్పుకొనినందువలన అతడు చక్రవర్తి కాలేడు. భూగర్భములో ఉన్న ధనాగారము వెలికితీయా లంటే, తగిన వ్యక్తి యొక్క సలహా సంప్రదింపుల ద్వారా త్రవ్వకాలు జరిపి అడ్డుగా ఉన్న రాళ్ళను, మట్టిని తొలగించి ఆ ధనాగారాన్ని పొందినప్పుడే ఫలితము. అలా కాకుండా బయట నుండి ధనాగా రము, ధనాగారము అని పలుమార్లు పలికినా అది బయటపడదు. అలానే ఆత్మ జ్ఞానము పొందాలంటే దాని చుట్టూ ఆవరించి ఉన్న మాయ మరియు దాని ప్రభావాలను తొలగించకుండా, బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము.

బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి యొక్క సూచనల ప్రకారము సాధన, ధ్యాన మార్గాలను అనుసరించవలసి ఉంటుంది. కేవలము అసంబద్దమైన వాదనల ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము. అందువలన తెలివిగల వ్యక్తి స్వయముగా అన్ని విధములైన పద్ద తుల ద్వారా కృషి చేసినప్పుడే; పుట్టుక, చావులనే బంధనాల నుండి విముక్తిని పొందగలడు. అలా కాక రోగి మందు పేరును మరలమ రల పలుకుట వలన రోగము తగ్గదు. తగిన మందు సేవించినప్పుడే రోగము తగ్గుతుంది.

ఓ జ్ఞానీ శ్రద్ధతో వినుము. నేను ఎవరికైతే ఈ విషయాన్ని చెప్పు చున్నానో, అది విన్నవారు వెంటనే సంసార బంధనాల నుండి విముక్తి పొందగలరు

 *జపం అనేది మంత్రాన్ని లేదా దైవనామాన్ని పదే పదే ధ్యానించడం.*


నిరంతరం ఎంత ఎక్కువగా భగవన్నామాన్ని జపిస్తూ ఉంటామో భగవంతునికి అంత దగ్గరగా జరుగుతూ ఉంటాము. దీని వల్ల ,సర్వసమర్పణబుద్ధి, శరణాగతి అలవడుతుంది. శరణాగతి చేసిన భక్తుని బాగోగులు భగవంతుడే చూసుకుంటాడు. పిల్లి తన పిల్లల బాధ్యత రక్షణ తానే వహించినట్లు. ఇక కోతి పిల్ల, తల్లి ఎక్కడ ఏపరిస్థితిలో ఉన్నా తాను స్వయంగా తల్లిని గట్టిగా పట్టుకొని ఉండాలి. తల్లికి అందులో బాధ్యత ఉండదు. దీనినే శాస్త్రంలో మార్జాల కిశోర న్యాయం—మర్కట కిశోర న్యాయం గా పేర్కొంటారు. ఇది ఒక శక్తివంతమైన సాధనంగా పని చేసి, మనలను పాపాలనుండి రక్షించి,మనసును నిర్మలంగా చేసి,మన శరీరానికి, మనసుకు మరియు ఆత్మకు శ్రేయస్సును అందిస్తుంది జపం మన దుఃఖాలను, కష్టాలను తొలగించి, న్ని కలిగించడమే కాకుండా భగవంతునితో అనుసంధాని స్తుంది. ప్రారంభంలో యాంత్రికముగా అనిపించినా పోస్ట పోను ఈ జపం మనలను భగవంతునికి అత్యంత ఇష్టుని గా చేస్తుంది.ఇది ఎవరికి వారు నిత్యమూ సాధన చేస్తూ ఉంటే వారికి బుద్ధిపూర్వకముగా అనుభవములోకి వస్తుంది

🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏

No comments:

Post a Comment