మదన్-మల్లికల పెళ్లి తంతు
******
మదన్ ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగిడుతూ మంచి వ్యక్తిత్వం కలిగి అందునా ఎప్పుడూ నవ్వు మొహం అందరితో కలివిడిగా వుండే మనిషి. దానికి తోడు మంచి హోదా కలిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగం మంచి ప్యాకేజీతో ఎలాంటి దురలవాట్లు లేని మంచి కుర్రాడు అని చెప్పచ్చు. దానికి తోడు మంచి కుటుంబంలో పెరిగినవాడు కావటంతో పెళ్లి అవ్వాల్సిన అమ్మాయిల తండ్రుల దృష్టి మదన్ మీద ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. సంబంధాలు వస్తున్నా ఎలాగో అలా 2 సంవత్సరాలు బెట్టు చేశాడు
కొత్త సంవత్సరం వస్తే గానీ పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చున్నాడు మదన్. కొత్త సంవత్సరం రావటంతో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు పెద్దలు. సరే, కాదనలేక ఒక పెళ్లి చూపులకు తరలి వెళ్లారు. అంతకు ముందు అమ్మాయి బొద్దుగా వుందని చూచాయగా తెలియటంతో అయిష్టంగానే ఎలాగు సంబంధం కుదరదు అనుకుంటునే బయల్దేరాడు మదన్. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, అమ్మాయి తరఫు వారు సాదరంగా ఆహ్వానించి, ఆ తరువాత సౌకర్యంగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. అటు పెద్దలు, ఇటూ పెద్దలు పిచ్చా పాటీ మాట్లాడుకున్న తరువాత అమ్మాయి మల్లికని తీసుకొని వచ్చి కుర్చీలో కూర్చొ పెట్టారు. అప్పటిదాకా అయిష్టంగానే వచ్చిన మదన్ మనసులోనే మెచ్చుకోకుండా వుండలేక పోయాడు.
ఒడ్డుపోడుగు, దానికి తగ్గ సౌష్టవం, ఒంపుసొంపులు కొద్దిగా బొద్దుగా ముగ్దని చూసేసరికి ఆమెని మాటల్లోకి దింపటానికి ప్రేరేపించింది మదన్ మనసు. తొందరగా వచ్చేద్దామనుకున్న వారు చాలసేపు కబుర్లు చెప్పుకుంటూ వుంటే ఒకరికి ఒకరు నచ్చినట్టు పెద్దలకి తెలిసిపోయింది. వెళ్ళిపోతూ ఒకరుని ఒకరు తిరిగి చూసుకుంటూ కనిపించారు.
మరునాడు పెద్దగా ఆలోచించకుండా కొత్త సంవత్సరం కావటంతో గ్రీటింగ్స్ పంపాడు మదన్. మల్లిక ఆశ్చర్యపోయింది ఒకింత. ఎందుకంటే అబ్బాయి అంతగా జోరుగా లేడు అనుకుంది. తిరుగు టపాలో తను కూడా గ్రీటింగ్స్ పంపింది.
ఒక పక్క పెద్దలు కూడా ఒప్పుకోవటంతో అప్పటినుంచి మొదలు అయింది ప్రేమాయణము. అదేదో సినిమాలో అన్నట్టు పార్క్ నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్క్ వగైరా. ఫోన్లో కబుర్లు చెప్పుకుంటుంటే టైం తెలిసేది కాదు. ఉండేది ఒకే వూరు అయినా కొద్దిగా దూరం అవటంతో ప్రేమలేఖలు కూడా ఇటూ అటూ చేరేవి.
(మొబైల్ ఫోన్ లేని కాలం).
పెళ్లి కుదిరిన తరువాత సుమారు 4 నెలల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మదన్, మల్లికా (arranged cum love marriage). పెళ్లి వైభవంగా జరిగిన తరువాత మదన్ వాళ్ళ ఇంట్లో మూడు నిద్రలు దూరం దూరంగానే జరిగి పోయాయి. వూళ్లోనే నాలుగు చోట్ల బండి మీద తిరిగి వచ్చారు. తరువాత ఆడపెళ్లి వాళ్ళ వూరికి బస్ లో ప్రయాణం. బస్సులో మధ్య సీట్లు దొరకటంతో అక్కడ కూర్చున్నారు. రాత్రి పూట ప్రయాణమే కానీ ఏదో నిద్ర పట్టని రాత్రి. వయసుతో కూడిన ఆరాటంతో మదన్ చేతులు వూరుకోక మల్లికా ఎద పైన, నడుముని తడమసాగాడు. తెలిసి తెలియక ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు తల పెట్టుకోవటం పెళ్ళైన కొత్తలో అదొక మధురమైన అనుభవం.
మరునాడు మల్లిక పుట్టింటి వాళ్ళ ఇంట్లో వ్రతం. బంధుమిత్రులను పిలిచి ఘనంగా జరిపించారు. అదో చిన్న వూరు. చాలావరకు పెంకుటిళ్ళు, కొన్ని డాబాలు మాత్రం వున్నాయి. వీళ్లది ఒక పెంకుటిల్లు. చుట్టూ ఖాలీ స్థలం. ముందు వెనుక వసరాలు వున్నాయి. భోజనాలు అయ్యేసరికి మధ్యాన్నం 3 గంటలు అయింది. సాయంత్రానికి అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. దగ్గరి బంధువులు మాత్రం వున్నారు. సాయంత్రం వరకు తెలీదు అదే రోజు ' కార్యం ' ఏర్పాటు చేశారని. ' కార్యం ' అంటే తెలుసుకానీ అదేదో
తెలియనట్టుగానే వుంది. రాత్రి భోజనాలు అయినయ్యి. ఆ ' కార్యం ' కు ఒక గది కేటాయించారు. వున్న కొద్ది మంది బంధువులతో కూర్చొని వున్నాడు మదన్. అదో బెరుకుతో కూడిన ఆనందం. మధ్యలో ఒకసారి అటు ఇటు నడుద్దామని పెరట్లోకి వెళ్ళాడు మదన్. అందరూ ఆడవాళ్ళు ఒకింత ఆశ్చర్యానికి గురి అయ్యారు. అందరూ పెరట్లో మల్లికకు శోభనం ముందు స్నానం చేయిస్తున్నారు. మల్లిక కూడా ఒకింత తడబడి సర్దుకునే లోపల మదన్ చూపులు ఎక్కడో గుచ్చుకున్నాయి. ఆ సిగ్గుతో మరింత అందం సంతరించుకుంది మల్లిక మొహం. ఇక సభ్యత కాదు అనుకొని వెళ్ళి ముందు వసారాలో కూర్చున్నాడు మదన్. కళ్ళ ముందు మెరుపులా మెరిసిన మల్లికా సౌష్టవం పదే పదే గుర్తు వచ్చి గిలిగింతలు పెడుతోంది మదన్ మనస్సు.
మంచి వేసవి కాలం, అందులో రోహిణి కార్తెలో శోభన ముహూర్తం. అసలు ముహూర్తం రాత్రి గ. 12. 50 నిమిషాలకు. ముందు పురోహితుడిని తీసుకో వచ్చి ఇద్దరినీ మంచం మీద కూర్చో పెట్టి మంత్రాలు చదివి అక్కడ ఉన్న దంపతులకి తాంబూలాలు ఇప్పించారు. కొత్త జంట కదా అమ్మాయికి చిలకలు చుట్టి ఎలా తినిపించాలో నేర్పించారు పెద్దలు. అంతా అయ్యేసరికి 12 గ లు దాటింది. ఇంకా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఇద్దరికీ ఆరాటం ఎక్కువ అయింది.
పావు గంట తరువాత మల్లికని ముస్తావు చేసి గదిలోకి పంపి బయట గొళ్ళెం వేశారు. ఒక్కసారి ఇద్దరికీ చెప్పుకోలేని ఆందోళన, బిడియంతో కూడిన భయం. అంతకు ముందు పురోహితుడు మంత్రాలు చదుతువున్నప్పుడు అదే ముస్తాబులో వుంది మల్లిక కానీ అప్పుడు గమనించలేదు మదన్ ఆమె ఒంపుసొంపులు. తెల్లటి చీరెలో ఎగిసి పడుతున్న పరువాలు రెచ్చ కొడుతున్నాయి మదన్ ని.
ఇప్పుడు మల్లిక తలలో బాగా విచ్చుకున్న వేసవి మల్లెపూలు గుప్పుమంటున్నాయి. మల్లిక తలుపుని ఆనుకొని సిగ్గు ఒలక పోస్తూ నిలుచొని వుంది. మదన్ ఇక ఆగలేక మల్లిక చెయ్యి పట్టుకొని మంచం మీద కూర్చోపెట్టాడు. పక్కన బల్లమీద పాలు, పళ్ళు మరియు స్వీట్స్ ఏర్పాటు చేసారు.
మల్లిక దగ్గర కూర్చో పెట్టుకొని కబుర్లు చెబుతూ సుతిమెత్తని పెదాలని తన పెదాలతో స్పృశించాడు. ఒక్కసారి ఇద్దరిలో బిడియంతో కూడిన ఆనందం. అదే ఇద్దరికీ మొదటి ముద్దు కావటంతో బెరుకుతో కూడిన ఆరాటం మొదలు అయింది.
మదన్,మల్లికా శృంగార సయ్యటకు పూలు నలిగి మరింత మత్తెక్కిస్తున్నాయి. ఆ రోజు ఒకరిని మరొకరు అల్లుకొని తమనీ తాము సమర్పించుకున్నారు. బిడియం విడివడంతో వారి శృంగారం పరాకాష్టకు చేరింది. ఆ హడావుడిలో పళ్ళు, స్వీట్స్ తినాలన్న ధ్యాస రాలేదు వారికి. పొద్దున లేచి చూసుకుంటే మల్లికా చేతి మట్టి గాజులు విరిగి పోయినాయి. బొట్టు, కాటుక చెంపలకు అయి మరింత అందం సంతరించుకుంది మల్లిక.
మూడు నిద్రలు కావు, మూడు 'జాగారాలు'గా వేసవి మల్లెలతో ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళు సేద తీరుతూ కొత్త రుచులతో, కొత్త కాపురం మొదలు పెట్టారు మదన్, మల్లికలు.
Giri Kumar Surukuchi *************
No comments:
Post a Comment