మాకు ఇద్దరు పిల్లలు బాబు , పాప . అప్పుడెప్పుడో ఆన్లైన్ లో నాకు బాగా నచ్చి ఒక మాంచి కార్ బొమ్మ కొన్నాను . సెలవుల్లో ఇవ్వొచ్చులే , ఇప్పుడైతే చదువుకోకుండా ఆటల్లో మునిగిపోతారు వీళ్ళు అని . సరే ఇప్పుడు ఎలానో సెలవులే కదా అని దాన్ని బయటకు తీసి , ఇద్దరి పిల్లలనీ దగ్గరకి పిలిచి ..!
‘చూడండి పిల్లలూ! మీ ఇద్దరూ ఈ మధ్య తెగ అల్లరి చేస్తున్నారు. ఒక వారం పాటు ఎవరైతే మీ అమ్మమాటను చక్కగా వింటారో, పేచీ పెట్టకుండా తింటారో, బుద్ధిగా పనిచేసుకుంటారో... వారు ఈ కారు బొమ్మను గెలుచుకుంటారు ’ అన్నాను.
‘ఓ దానికేం భాగ్యం!’ అన్నారు మా ఇద్దరు పిల్లలు.
వారం రోజులు తరువాత.
ఇద్దరూ కలిసి ఆ కారు బొమ్మను నా చేతిలో పెట్టారు.
‘అదేంటీ కారు బొమ్మ నచ్చలేదా!’ అనడిగా నేను ఆశ్చర్యంగా ..!
‘బొమ్మ నచ్చక కాదు. నువ్వు చెప్పిన షరతుల ప్రకారం ఆలోచిస్తే... చక్కగా అమ్మమాటని విన్నదీ, పేచీ పట్టకుండా తిన్నదీ, బుద్ధిగా పనిచేసుకున్నదీ... నువ్వేనని తేలింది. అందుకని ఈ బొమ్మ నీకే దక్కుతుంది’ అనేసి తుర్రుమన్నారు .
ఓరినీ ఇప్పుడు పిల్లలు చాలా ముదర్లండి బాబు 😋😂😆😉😍
No comments:
Post a Comment