*నెమలి పించం*
చాలాకలర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేసే నెమలి పించం చాలా పవిత్రమైనదిగా గుర్తింపు పొందింది. హిందూ పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. చూడటానికి నెమలి పించం ఓ పక్షి ఈక అయినప్పటికీ... మన రోజు వారీ జీవితంలో ఇది చాలా సమస్యల్ని పోగొడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోతే... నెమలి పించం ఆ సంబంధాల్ని తిరిగి కలుపుతుంది. పిల్లలు సరిగా చదవకపోయినా, చురుగ్గా ఉండకపోయినా... వారికి నెమలి పించం ఇస్తే చాలు... మార్పు వస్తుంది. చేపట్టిన ప్రాజెక్టులు ఆలస్యమవుతుంటే నెమలి పించాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. మార్పు కనిపిస్తుంది. నెమలి పించంను ఎలా వాడాలో తెలుసుకుందాం.
రాహు దశలో ఉంటే
కొంతమందికి రాహు దశ నడుస్తూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నీ ఇబ్బందులే ఉంటాయి. అలాంటి వారు రాత్రి పడుకునేటప్పుడు నెమలి పించంను తలగడ (Pillow) కింద పెట్టుకోవాలి. ఆ పించం వ్యతిరేక ప్రభావాల్ని దూరం చేస్తుంది.
పనులు ఆలస్యమవుతుంటే : గ్రహాలు కలిసిరాకపోతే ఎవరికైనా కష్టాలు తప్పవు. ఐతే, ఇంట్లోని బెడ్‌రూంలో తూర్పువైపున లేదా ఈశాన్యం మూలలో నెమలి ఈకను ఉంచితే... అది పనుల్లో వేగం పెరిగేలా చేస్తుంది. ప్రాజెక్టులు కూడా సమయానికి పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
ఏకాగ్రత పెరగడానికి : పిల్లలకు నెమలిపించం ఇస్తుంటారు. ఇది మంచి పని. ఎందుకంటే... పుస్తకాల్లో నెమలి పించంను ఉంచడం వల్ల పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. చదువుల్లో వెనకబడే చిన్నారులు, చదివింది వెంటనే తలకెక్కని పిల్లలు తమ పుస్తకాల్లో చిన్న చిన్న నెమలి పించాలు ఉంచుకుంటే... అవి వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయి.
వాస్తు దోష నివారణకు : నెమలి పించం వాస్తు దోషాన్ని కూడా పోగొడుతుంది. ఇంటి సింహ ద్వారం ముందు ఓ నెమలి ఈకను ఉంచాలి. ఇది వాస్తు దోషాన్ని పోగొట్టడమే కాదు... ఇంటి చుట్టుపక్కల నెగెటివ్ ఎనర్జీ (దుష్ట శక్తులు)ని కూడా తరిమికొడుతుంది.
🙏🕉️🙏
No comments:
Post a Comment