Wednesday, April 16, 2025

సెక్స్ కోసమే పెళ్లి చేస్కుంటే ఏం జరుగుతుందో తెలుసా? | CHEATING || ANUKULA VEDAM

 సెక్స్ కోసమే పెళ్లి చేస్కుంటే ఏం జరుగుతుందో తెలుసా? | CHEATING || ANUKULA VEDAM



రిలేషన్షిప్స్ లో చీటింగ్ అనేది ఒక పెద్ద ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది ఈ మధ్య. సరే చీటింగ్ చీటింగ్ అంటున్నారే. అసలు చీటింగ్ అంటే ఏంటి? తెలుగులో మోసం అంటారని నాకు తెలుసు. నేను అడుగుతున్నది దేన్ని పట్టుకొని మీరు చీటింగ్ అంటున్నారు అని. నేను ఎంత ట్రూగా, కమిటెడ్ గా ఉన్నా, నా మొగుడు or పెళ్ళం నన్ను చీట్ చేస్తున్నారు అంటే, ప్రధానంగా ఇంకొకరితో తన కామ కోరికలు తీర్చుకుంటున్నారు అని. ఈ విషయాన్ని స్ట్రెయిట్ గా చెప్పకుండా, కమిట్మెంట్ బ్రేక్ చేశాడని, లాయల్ గా లేడని, అబద్ధాలు చెప్తున్నాడని, మోసం చేశడని, ఎందుకు ఈ పెద్ద పెద్ద పదాలన్నీ? స్ట్రెయిట్ అండ్ సింపుల్ గా పెళ్లి చేసుకున్న పెళ్ళాం ఉండగా, ఆ అబ్బాయి ఇంకో అమ్మాయితో ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఓకే? సో దాన్ని మీరు చీటింగ్ అంటున్నారు. అంతేనా? ఫైన్. ఇప్పుడు అసలు పాయింట్ కి వద్దాం. నేను ఇప్పుడు చెప్పబోయేది చాలా స్ట్రెయిట్ గా, బోల్డ్ గా కొండ బద్దలు కొట్టినట్టు ఉంటది. సో ఎందుకైనా మంచిది, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వినండి. ఓకే? ఒక మొగుడు శారీరకంగా వేరే అమ్మాయితో పడుకున్నందుకే పెళ్లి వ్యవస్థను, పెళ్లి ప్రతిజ్ఞని బ్రేక్ చేసేసినట్టు అని అంటున్నారంటే, అప్పుడు అసలు ఈ మొత్తం వివాహ వ్యవస్థ, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది దేని గురించి పుట్టింది అని అర్థం? మిగతా కారణాలన్నీ పక్కన పడేసి, భర్తతో కాకుండా ఇంకొకరితో పడుకోవడం అనే ఒక్క కారణం చాలు, పెళ్లి ప్రమాణాలన్నింటిని బ్రేక్ చేసేసినట్టే అని అంటున్నారంటే, పెళ్లి ప్రమాణాలన్నీ లీగల్ గా, ఒకడితో శారీరక సుఖం పొందడానికి మాత్రమే డిజైన్ చేసినవి అని అర్థం వస్తుంది. ఏం కాదా? పెళ్లియనప్పటి నుంచి నేను నీకు మాత్రమే కొట్టబడి ఉంటాను అంటారు. నీకు మాత్రమే అంటే, ఏ రకంగా నీకు మాత్రమే? ఈ రోజుల్లో దాని అర్థం ఏంటో తెలుసా? శృంగార పరంగా. నీ కామం తీర్చుకోవడానికి గాని, నా కామం తీర్చుకోవడానికి గాని ఇంకొకరి వైపు చూడను, ఇంకొకరి గురించి ఆలోచించను, ఇంకొకరిని నా బుర్రలోకి కూడా రానివ్వను అని, మ్యూచువల్ గా ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటున్న కమిట్మెంటే పెళ్లి. అయితే ఎంతసేపు శృంగారం కామాన్ని తీర్చుకోవడం గురించేనా  పెళ్లి ప్రమాణాలన్నీ మాట్లాడుతున్నవి? కాదుగా! కానీ పెళ్లి చేసుకుంటున్న లో 99% మందికి ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు, పెళ్లి ప్రమాణాలు ఏంటో తెలియదు, వాటి ప్రాముఖ్యత ఏంటో తెలియదు, అసలు చీటింగ్ చీటింగ్ అంటున్నారే! అసలు చీటింగ్ అని దేన్ని అనాలో కూడా తెలియదు. ఏ మతానికి సంబంధించిన వివాహ వ్యవస్థను చూసినా, చీట్ చేయడం అంటే కేవలం ఫిజికల్ గా ఇంకొకరితో ఇన్వాల్వ్ అవ్వడం మాత్రమే కాదు. నాన్ ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయినా చీట్ చేసినట్టే అని ఉంటది. ఏంటి ? నాన్ ఫిజికల్? అదొకటి ఉంటదా? ఇంతకీ నాన్ ఫిజికల్ అంటే ఏంటి అసలు? నీ మొగుడు లేని టైం లోనో, నీ పెళ్ళం లేని టైంలోనో, వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ గా ఇంటర్నెట్ లో ఎవడో ఎవరితోనో పడుకుంటున్న ఆ వీడియోస్ చూస్తున్నావా లేదా? అది చీటింగ్ కాదా? వయసులో 70 ఏళ్ళు వచ్చిఉంటాయి. వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లిలు అయిపోయి ఉంటాయి. బట్ వీడు మాత్రం ఇంకా ఇంటర్నెట్ లో ఆ వీడియోస్ చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళ మొగుడు పెళ్ళాల్ని ఫిజికల్ గా వదిలేయలేదు కాబట్టి పతితులు పతివ్రతలు  ఐపోయినట్టా? ఇప్పుడు సినిమాకి వెళ్దాం. అందులో హీరో చొక్క విప్పేసి సిక్స్ ప్యాక్ బాడీ వేసుకొని ఆడి పెళ్ళానికి శోభనం రాత్రి చూపించిన ఆ బాడీనే మనందరికీ ఏకంగా సినిమా తెర మీదే చూపించేస్తుంటాడు. హీరోయిన్లు ఏం తక్కువ కాదు. బికినీలు వేసుకొని చిన్న చిన్న కర్చీపులు కట్టుకొని, ఆ హీరో మూతిలో మూతి పెట్టేసి ముద్దులు కూడా ఎట్టేస్తున్నారు. నా చిన్నప్పుడు ఇలాంటివన్నీ ఏవో ఒకటి రెండు ఇంగ్లీష్ సినిమాల్లో మాత్రమే ఉండేవి. ఇప్పుడైతే, కుటుంబ సపరివార సమేతంగా చూడొచ్చు అని సెన్సార్ బోర్డు వారు approve చేసిన అచ్చమైన తెలుగు సినిమాల్లో కూడా అన్ని రకాల సీన్లు ఉంటాయి, ఐటం సాంగ్స్ కూడా ఉంటున్నాయి. అవన్నీ శుభ్రంగా చూస్తున్నాం కదా. మరి దాన్నేమనాలి?  ఓహో ఎవడో చేస్తున్న శృంగారం చూస్తే పర్లేదు, డైరెక్ట్ గా చేస్తే మాత్రమే చీటింగ్ చేసినట్టు అని అంటావా? సరే నువ్వొక పని చెయ్. మీ పక్కింటి ఆవిడ స్నానం చేస్తున్నప్పుడో, బట్టలు మార్చుకుంటున్నప్పుడో వెళ్లి చూడు. అప్పుడు ఆవిడ పర్లేదండి మొత్తం చూసుకోండి అని అంటదా? పళ్ళు రాలగొడతాది. నువ్వు వెంటనే, నేనేమీ  మీతో ఫిజికల్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు గా! జస్ట్ చూసాను అంతే. అంత మాత్రానికే కొట్టేస్తారా! అంటే చూడడం కూడా తప్పేనా! అని వాదించు. నిన్ను బొక్కలోకి తోసి రెండు  పీకేక, అప్పుడు ఆటోమేటిక్ గా టింగ్ మని నీకే జ్ఞాన బల్బు వెలిగేస్తది, దేన్ని కూడా చీటింగ్ అంటారో అని. ఇక్కడ ఏంటంటే, పెళ్లి చేసుకోవడంలో ప్రధాన ఉద్దేశం కామం తీర్చుకోవడానికి నాకు ఒక బాడీ కావాలి అనే Point of view లోనే 99% పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే అది ఎవ్వడ బయటికి అనరు. ఎందుకో తెలుసా? మరి బయటికి వచ్చాక అందరూ పెద్ద పతితల్లాగా బిల్డ్ అప్ ఇవ్వాలి కదా! సో, బాడీల కోసం జరుగుతున్న పెళ్లిళ్లు ఆ బాడీలు బోర్ కొట్టగానే వేరే బాడీలపై మోజు పడతాయి. అది కామన్ గా మరి! ఈ రోజుల్లో అసలు వివాహ వ్యవస్థ అనేది ఏ పర్పస్ కోసం క్రియేట్ చేయబడింది అనే మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో, అది ఏ ఒక్కడికి పూర్తిగా అయితే తెలియదు. And అది ఇప్పుడు తెలుసుకునే ఓపిక, తీరిక, ఉద్దేశం కూడా, ఎవ్వడికీ లేవు. కామం తీర్చుకోడానికి నాకొక బాడీ కావాలి. సో, పెళ్లి చేస్కుంటా. ఇలాంటి సొల్లు సోలో పర్పస్లతో పెళ్లి చేసుకునే వాళ్ళకి పనిష్మెంట్ ఈ వివాహేతర సంబంధాలు, ఇంటర్నెట్ లో అశ్లీల వీడియోలు చూడ్డం, ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి మరి. సో చీట్ చేయకపోతేనే ఆశ్చర్యం కానీ, చేస్తే అందులో ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. ఒకరి దగ్గరికి వెళ్లి, ఇదిగో ఈ క్షణం నుండి నువ్వు నాతోనే కామం తీర్చుకోవాలి, దానికి బదులుగా నేను కూడా నీతోనే కామం తీర్చుకుంటా. So, నువ్వు ఏదైనా చేసుకో, ఎలా అయినా ఉండు, ఎవరితో అయినా తిరుగు, ఏ వీడియోనైనా చూసుకో, ఏ అమ్మాయినైనా ఊహించుకో, ఏ అబ్బాయినైనా ఊహించుకో, కామం తీర్చుకోవడానికి మాత్రం నా బాడీనే వాడుకోవాలి అని, ఇంత పచ్చిగా మాట్లాడితే ఎంత Vulgar గా అసహ్యంగా ఉంటది అని, దానికి బదులుగా ఏం చేస్తున్నారు? ఈ words ఏవి use చేయకుండా డీసెంట్ గా Companionship, Life partner, Soul mate అని ఏవేవో వాళ్ళకు కూడా అర్థం కానీ పెద్ద పెద్ద బిల్డప్ పదాలన్నీ వాడిస్తుంటారు. మళ్ళీ చెప్తున్నా, చీటింగ్ అంటే కేవలం ఏదో శారీరకంగా ఎవరితోనో పడుకుంటే మాత్రమే కాదు, నాన్ ఫిజికల్ గా చేసినా కూడా చీటింగే. అయితే అందరూ అదే చేస్తున్నారు కాబట్టి, ఆ పర్లేదులేరా అని, అదేదో Take it for Granted లాగా అయిపోయింది. సో నాన్ ఫిజికల్ చీటింగ్ ని కూడా సీరియస్ గా లెక్కలోకి తీసుకుంటే, 99% పెళ్లి అయిన వాళ్ళు ఎప్పుడూ చీట్ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు కూడా. మీరు మీ మొగుడితో ఏదో షాపింగ్ కి వెళ్ళారు. అక్కడ Sales Girl ఎవరో పడిపోయిన బట్టలు తీస్తుంటే, ఆ Sales Girl ఫిగర్ కత్తిలా ఉందని మీ మొగుడు ఆమె వైపు చూస్తున్నాడు. అది చూసిన మీరు, వెంటనే సీరియస్ అయిపోయి,  డైవర్స్ ఇచ్చేస్తా, నువ్వు ఇంత మోసగాడవ అనుకోలేదు, అని పెద్ద పెద్ద డైలాగులు కొడతారా? కొట్టరు. ఎందుకంటే, ఇప్పుడంటే మీరు చూశారు కాబట్టి తెలిసింది. మీరు లేనప్పుడు కూడా వాడు ఎంతో మందిని ఇలానే చూస్తాడని మీకు కూడా తెలుసు. కానీ మీరేం దాన్ని ఒక పెద్ద విషయంలా పట్టించుకోరు. ఎందుకంటే మొగాడన్నాక ఆడదాన్ని అలా చూడడం కామనే అని క్యాజువల్ గా తీసేసుకుంటారు. ఒక అబ్బాయి, అమ్మాయి అనే రెండు opposite genders ఎప్పటికీ ప్లెజెంట్ గా కలిసి ఉండాలనుకుంటే, First of all, ఆ కలిసి ఉండడానికి కారణం అవ్వాల్సిన ఫౌండేషన్ ప్రేమ, స్నేహం మాత్రమే అయి ఉండాలి. అయితే నిజమైన ప్రేమ స్నేహం అంటే ఏంటో పూర్తిగా మర్చిపోయిన, సోషల్ మీడియా జనరేషన్ లో ఉన్నాం మనం. సో ఒకరు అందంగా ఉన్నారని, కత్తి లాంటి ఫిగర్ ఉందని దానికోసం పెళ్లిళ్లు చేసుకుంటే, మీ బాడీ బోరు కొట్టిన వెంటనే వాడు వేరే బాడీల వేటలో పడటం ఖాయం . ఎందుకంటే ఈ భూమి మీద బోరు కొట్టని బాడీ అనేది ఉండదు. చ ఛ, అలా ఏముండదు అంటారా? మరి అలా అయితే కత్తి లాంటి ఫిగర్లు ఉన్న ఎంతో మంది హీరో హీరోయిన్లు, క్రికెటర్లు, బిజినెస్ పీపుల్, ముందేమో Made for Each Other అనేంత బిల్డప్లు ఇచ్చేసి అక్కడికి ఏదో ఆదర్శ దంపతులు టైప్ లో మొగుడు పెళ్ళాలు  ఎలా ఉండాలో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేసి, ఫైనల్ గా ఎందుకు విడిపోతున్నారు? అంటే మొదట్లో వాళ్ళకి దేన్ని చూస్తే తేప కార్చేసుకునేంత attraction కలిగిందో, అదే ఇప్పుడు బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. మీకు డౌట్ రావచ్చు. మరి పెళ్లి చేసుకుంటున్నవాళ్లో ఎంతమంది కలిసలేరు అని. అసలు వాళ్ళు ఎందుకు కలిసి ఉన్నారో, దాని వెనకాతల దాగున్న ఎవరికీ తెలియని Actual Reasons ఏంటో ఎప్పటికీ బయటికి రావు. Ofcourse 100కి 100% ఇట్లానే ఉంటారని కాదు. But 99% ఇట్లానే ఉంటారు. మీకో విషయం తెలుసా? పెళ్లైన అబ్బాయి గాని అమ్మాయి గాని, వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకుంటే, చట్టరీత్య  కూడా నేరం కాదు అని మన న్యాయ వ్యవస్థే తీర్పునిచ్చింది. అంటే చేసుకున్నోళ్ళలో ఎన్ని కోట్ల మందికి వివాహేతర సంబంధాలు ఉన్నాయో, వాళ్ళక్కూడా అర్థమైపోయింది. సో మనిషికి బాడీ వల్ల వచ్చేది సుఖం మాత్రమే, సంతృప్తి మాత్రం కాదు, సుఖానికి సంతృప్తికి చాలా డిఫరెన్స్ ఉంది, అనే చిన్న లాజిక్ ని అర్థం చేసుకోనంత కాలం, ఈ చీటింగ్స్ అనేవి ఎప్పటికీ ఆగవు. ఇక ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. నెక్స్ట్ పాడ్కాస్ట్ లో, ఇంకో ఇంట్రెస్టింగ్ అనాలసిస్ తో మళ్ళీ కలుద్దాం.

No comments:

Post a Comment