Sunday, August 10, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
నేటి...

         *ఆచార్య సద్బోధన*
             ➖➖➖✍️
```
ఏదో మొక్కుబడిగా స్తోత్రాలు చదివితే పెద్దగా ప్రయోజనం ఉండదు. 

మొదట దేవునిపై అచంచల భక్తి కుదరాలి. చుట్టు ప్రక్కల వాతావరణం, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. శుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. మొదట కొన్నాళ్ళు స్తోత్రం కంఠతాపట్టాలి. 

ఆ తర్వాత ఏకాగ్రతతో మనసులో దేవుడి రూపాన్ని నిలుపుకొని స్తోత్రం చదవాలి. చదివేటప్పుడు దేవుడి అనంత కల్యాణ గుణాలు అనుభవంలోకి రావాలి. దీనివల్ల భగవత్ కటాక్షం మన మీద ప్రసరిస్తుంది.

ఆ తర్వాత మన కర్మానుగుణంగా మనకు ఏది ఇవ్వాలో ఆయనే అనుగ్రహిస్తాడు. 

స్తోత్రాలు చదివేటప్పుడు ఆవులింతలు, నిద్ర, విసుగు, అలసట వస్తే స్తోత్ర పఠనం ఆపాలి. సాత్త్విక ఆహారం తీసుకోవాలి. చక్కని సంకల్పం చేసుకొని శ్రద్ధతో, దీక్షతో స్తోత్ర పఠనం చేయాలి. 

మనకు మానవ జన్మను ఇచ్చి సమాజంలో ఎంతో మంచి అవకాశాలు కల్పించిన దేవుడిపై కోపం కాదు, కృతజ్ఞత చూపాలి. 

అన్ని పనులూ భగవదర్పితంగా చేయడం నేర్చుకోవాలి. సుఖమూ, శాంతి అనుభవిస్తాము.✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment