*_🧬ఆరోగ్య సూత్రాలు (Health Formulae) :_*
*_ఏకార్యాన్ని సాధించాలన్నా మొదట ఉత్సాహం ఉండాలనిలో శారీరకంగా గానీ, మానసికంగా గానీ,శరీరంలో శక్తి హరించుకుపోయినట్లుగా నీరసంగా అలసటగా ఉంటే : వ్యక్తి ఏపనినీ చేయలేడు. దీనినే Fatigue అంటారు. జీవితంలో ప్రతివాళ్ళూ ఎప్పుడో ఒకప్పుడు ఈ Fatigue కి లోనవుతుండటం సహజం. అలా ఉండకుండా ఉండటానికి ఏం చేయాలన్నది చూసినప్పుడు:_*
*_శరీరంలో నీరసంగా అలసటగా వున్నట్లనిపించటానికి రకరకాల కారణాలుంటాయి. వాటిలో ముఖ్య కారణం సరయిన పోషకాహారాన్ని తీసుకోకపోవటం, జీర్ణం సక్రమంగా కాక పోవటం, మానసిక వొత్తిళ్లకు లోనుకావటం మొదలైనవి._*
*_శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు తీసుకోకపోతే శరీరంలో శక్తి సరిపడా ఉత్పత్తి కాదు. దీనివల్ల జరిగే మొట్టమొదటి నష్టం జీవితం పట్ల ఉత్సాహం చచ్చిపోవటం! చర్మంలో మృదుత్వం పోతుంది. రోమాలు రాలిపోతాయి. గోళ్ళు పగుళ్ళు వారతాయి. ఇవన్నీ ఆ మనిషిని జబ్బు వరించబోతోందనేందుకు ప్రధమ సూచనలు. నిర్లక్ష్యం చేస్తే నష్టం తప్పదు! ఇందుకు విరుగుడుగా నిత్యజీవితంలో పాటించాల్సిన కొన్ని ఆరోగ్య సూత్రాలు._*
*_1. వారానికి ఒకరోజు పళ్ళు ఫలాలు :_*
*_అరుగుదలకు ఎక్కువ సమయం తీసుకునే మాంసం, కొవ్వు జున్నులాంటి ఆహారాలను తప్పుడు కాంబినేషన్లో రెగ్యులర్గా అధిక మొత్తంలో తీసుకుంటే మనిషిలో అలసట తేలికగా కనిపిస్తుంది. దురదృష్టం ఏమిటంటే చాలా మంది వారం పాడుగుతా ఇలాంటి వాటినే ఏదో ఒకరూపంలో తీసుకుంటూ ఉంటారు._*
*_# అందుకని వారంలో ఒక రోజు మరే ఆహారం జోలికి పోకుండా కేవలం తాజా పళ్ళు ఫలాలతోనూ, మంచినీళ్ళతోనూ మాత్రమే గడిపితే వారమంతా శ్రమించిన ప్రేవులకు రెస్ట్ ఇచ్చినట్లవుతుంది. శరీరం తగు ఉత్సాహాన్ని పుంజుకుంటుంది._*
*_2. ప్రేరక పానీయాలు వద్దు !_*
*_ఉప్పు, పంచదార, కాఫీ, టీ, మసాళా కూరలు, ఆల్కహాల్, సిగరెట్లు లాంటివి శరీరంలో శక్తిని హరించి వేస్తాయి. అదే విధంగా అతిగా సెక్స్ కార్యంలో పాల్గొంటున్నా కూడా. ఈ చెప్పినవన్నీ అతిగా అయినప్పుడు అడ్రెనాల్ (Adrenal) వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది._*
*_3. బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి :_*
*_# ఉదయాన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవటం చాలా ముఖ్యం, తప్పనిసరి. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గిపోయి (Hypo Glycaemia) సంభవించే ప్రమాదం ఉంది. దాని మూలంగా కళ్ళు తిరగటం, చెమటలు పోయటం, మనస్సుకూ శరీరానికి సమన్వయం సన్నగిల్లటం, మనిషి Exhaust అయిపోవటం లాంటివి సంభవిస్తాయి._*
*_4.రిలాక్స్... రిలాక్స్..._*
*_# చాల మందికి అన్నం తిన్న వెంటనే బయటికి వెళ్ళిపోవటం లేక పనుల్లో నిమగ్నమవటం లాంటివి అలవాటుగా వుంటాయి. అలా భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ కావాలి. రెస్ట్ తీసుకోవాలి. ఆ మాత్రమే పనుల్లో పాల్గొనాలి. తర్వాత ఎంత సేపు రిలాక్స్ కావాలి అంటే దాని కొక సమయమంటూ ఏమీలేదు. తక్కువలో తక్కువ పావుగంట అయినా పరవాలేదు._*
*_5. బాగా నీళ్ళు తాగాలి :_*
*_నిజం చెప్పాలంటే చాలామంది రోజూ తమకు సరిపడేంత నీటిని తాగుతుండరు. మరీ తక్కువ నీళ్ళు తాగటం వల్ల శరీరంలో మలబద్దకం పేరుకుంటుంది. వ్యర్ధ పదార్థాలు శరీరం నుంచి బయటికి వెళ్ళక శరీరం విషపూరితమవుతుంది. అది అలసటకు దారితీస్తుంది.రోజుకు 3, 4లీటర్ లు నీళ్లు త్రాగాలి._*
*_6. పరిశుభ్రమైన ఆహారం :_*
*_ఈరోజుల్లో క్రిమినాశక మందులు చల్లబడని పళ్ళు, కాయగూరలు వుండటం లేదంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ఈ క్రిమినాశక మందులు (Pesticides) అవి చల్ల బడ్డ పళ్ళు, కాయగూరల లోపలికంటా కూడా వెళ్ళి పోతుంటాయి. అయినా కూడా వాటిని శుభ్రంగా తుడిచి కడగటం వల్ల మన శరీరానికి అపకారాన్ని కలిగించే దుమ్ము, బాక్టీరియా లాంటివి తొలగిపోతాయి. అందుకని ఎప్పుడైనా పళ్ళు, కాయగూరలు లాంటి వాటిని శుభ్రంగా కడిగాక మాత్రమే తినటానికి గానీ, కూరలకుగానీ ఉపయోగించాలి._*
*_7. ఉదయాన గోరువెచ్చటి నీరు :_*
*_ఉదయాన నిద్ర లేచి మొహం కడుగుకోగానే 1గ్లాసు గోరువెచ్చటి నీటిలో తాజా నిమ్మకాయ రసాన్ని పిండుకుని తాగితే అది నిద్రాపూరిత శరీరానికిమంచి ప్రేరకంగా పనిచేస్తుంది. అధిక బరువు ఉన్న వాళ్ళు తేనే ఒక చెంచా కలుపు కొని త్రాగాలి. కొద్దీ సేపు తరువాత 3గ్లాసులు గోరు వెచ్చని నీరు తీసుకోండి బాయిల్ చేసి చల్లార్చ బడుతున్న నీటిని గోరు వెచ్చటి స్థితిలో ఉండగా తాగాలి. ముందే పిండుకున్న రసాన్ని నిలవ చేసుకున్న నిమ్మరసాన్ని కాకుండా అప్పుడే పిండుకుని తాగితే అందులోని విలువలు (Preservatives) నశించకుండా వుంటాయి._*
*_8. పళ్ళు, ఫలాలు :_*
*_కొందరు అన్నం ఆఖరున అరటి పండును లేక సీజనులో అయితే మామిడి పండును తింటారు. అన్నంతోపాటు గానీ, అన్నం తిన్న వెంటనే గానీ పళ్ళు, ఫలాలను తీసుకుంటే అది అజీర్ణము, తేన్పులు, గుండెల్లో మంట లాంటి వాటికి దారితీయవచ్చు._*
*_వేగంగా జీర్ణమయ్యే పళ్ళు, ఫలాలను నిదానంగా జీర్ణమయ్యే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు కల ఆహారంతోపాటు తీసుకుంటే వాటిలో ఏదీ సరిగ్గా జీర్ణంకాదు. అందుకని పళ్ళను అన్నం తినటానికి బాగా ముందుగానీ, భోజనానికి భోజనానికీ మధ్య సమయంలో గానీ తీసుకోవటం మేలు._*
*_9. బాగా నమలండి :_*
*_ఆహారం జీర్ణం కావటం అనేది మొదట నోటి ద్వారా ప్రారంభమవుతుంది. అందుకని ఆహారంలోని ఉత్తమ విలువలు శరీరానికి లభించాలంటే మింగబోయే ముందు బాగా నమలాలి, మన నోటిలో దంతాలున్నదీ, లాలాజలం ఊరుతోందీ ఇందుకోసమే కదా...._*
*_10. ఒంటికి నలుగు :_*
*_చర్మానికి మర్దన జరగటం వల్ల లోపలి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. లింఫ్ (Lymph) గ్రంధుల వ్యవస్థ రీచార్జ్ (Recharge) అవుతుంది. శరీరం లోపలి విషపూరిత పదార్థాలు (Toxins) త్వరగా విసర్జితమవుతాయి. వీటివల్ల శరీరం లోని శక్తి కిక్తో కూడుకున్న గేర్ ఉత్తేజంగా వుంటాడు. లోకి వచ్చి మనిషి మంచి ఉత్సాహంగా_*
*_11. బరువు తగ్గండి :_*
*_ఒళ్ళు ఇంత భారీ శరీరంతో ఊబగా వుంటే త్వరగా అలసిపోతారు. మరీ తక్కువ తిన్నా కూడా అంతే జరుగుతుంది. అధిక శరీరాన్ని తగ్గించుకోవటానికి తేలికైన మార్గం ఏమిటంటే ఆహారంలో గుజ్జు (Starches), ప్రొటీన్లను కలిపి తీసుకోకూడదు._*
*_ఉదాహరణకు ప్రోటీన్లతో కూడుకుని వుండే చేపలని Starch తో కూడుకుని ఉండే వరి అన్నంతో కలిపి ఒకేసారి తీసుకోకూడదు. (మనం ఇలాగే తింటాము కదూ?!) అందుకు బదులుగా చేపలను సలాడ్తో పాటు లంచ్ టైంలో తీసుకుని సాయంత్రం వరి అన్నాన్ని వెజిటబుల్స్తో కలిపి తీసుకోవచ్చు._*
*_• లేదంటే లంచ్ కింద ఆమ్లెట్ని తీసుకుని supper కింద అన్నంలో బంగాళా దుంప కూరని తీసుకోవచ్చు. ఈ రకం ఆహార పద్ధతుల వల్ల జీర్ణం తేలికగా జరిగి, బరువు మీ కంట్రోల్లో వుండి, శరీరంలో ఉత్సాహం పుంజుకుంటుంది._*
*_12. అవసరమయితే విటమిన్ లు :_*
*_మీకు మరీ నీరసంగా, అలసటగా ఉంటోంటే డాక్టరు సలహా మేర ఒక కోర్సు కింద విటమిన్ టాబ్లెట్లను తీసుకోవచ్చు. ఏ విటమిన్లను తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి. వాటిని వాడాలా వద్దా అనేది డాక్టరు నిర్ణయించాలి తప్ప మీకు మీరు నిర్ణయించుకోవద్దు._*
*_13. విటమిన్ - బి :_*
*_శరీరంలో శక్తి పుంజుకోవటానికి విటమిన్లు బాగా దోహదపడతాయి. అలసిపోయిన శరీరానికి బ్యాలెన్సుతో కూడుకున్న 'బి' కాంప్లెక్సు విటమిన్లు ఎంతో మేలు చేస్తాయి. అలసటగా నీరసంగా అనిపించే వాళ్ళు మెగ్నీషియం, విటమిన్ 'సి' తోపాటు బి కాంప్లెక్సు కల మందుల కోసం డాక్టర్ని సంపద్రించండి._*
*_14. దీర్ఘకాలం పాటు డైటింగ్ చేయకూడదు :_*
*_• దీర్ఘకాలం పాటు కొవ్వు తక్కువగా వుండే ఆహారాన్ని తీసుకుంటే చర్మం పొడి బారటం, హార్మోన్ల ఉత్పత్తిలో సమతూకం లోపించటం, స్త్రీలకు జననేంద్రియం పొడిబారటం, కీళ్ళనొప్పులు, అలసట లాంటివి చోటుచేసుకునే అవకాశం ఉంది. దీర్ఘకాలం పాటుగా డయటింగ్ చేసే వాళ్ళలో కూడా ఈ అవలక్షణాలు ఏర్పడతాయి. అందుకని డైటింగ్ విషయంలో జాగ్రత్త !_*
*_15. వర్రీలకు దూరం :_*
*_మనస్సును కృంగదీసే వత్తిళ్ళు (Negative stress) మనిషిని హరించి వేస్తాయి. మీ ఆందోళనలు, సమస్యలను పరిష్కరించుకోనన్నా పరిష్కరించుకోండి, ఎవరితోనన్నా పంచుకోనన్నా పంచుకోండి. అంతేతప్ప వర్రీలు మిమ్మల్ని కుంగదీసేట్లుగా మాత్రం చేసుకోవద్దు._*
*_16. నిదానంగా గాఢ శ్వాస :_*
*_• కొత్తిళ్ళతో కుంగిపోయే వాళ్ళు శ్వాసను గాఢంగా తీసుకోకుండా పైపైన గాలిని పీల్చుకుంటూ సరిపెట్టుకుంటారు. దీనిని Hyper Ventilation అంటారు. శ్వాసను ఇలా పైపైనే పీల్చుకోవటం వల్ల మీరు త్వరగా అలసటకు లోనయ్యే అవకాశం వుంది._*
*_# అలాంటి వాళ్ళు అప్పుడప్పుడూ గాఢ శ్వాసకు సంబంధించిన ఈ కింది డీప్ బ్రీతింగ్ (Deep Breathing) ఎక్సర్సైజుల్ని చేస్తుండటం మంచిది._*
*_# కడుపును లోపలికి లాక్కుంటూ మీ లోపల ఉన్న గాలినంతా ముక్కు ద్వారా బయటికి వదిలేయాలి._*
*_# తర్వాత నెమ్మదిగా, గాఢంగా ముక్కుద్వారా గాలిని లోపలికి పీల్చుకోవాలి. ఇలా పీల్చుకుంటున్నప్పుడు ఛాతీ కదలకుండా వుండి, పొట్ట అలలా పైకి లేవాలి. (మీ ఊపిరితిత్తుల నిండా గాలి నిండటానికి 10 సెకండ్లు పడుతుంది)._*
*_# తిరిగి గాలి మొత్తాన్ని బయటికి వదిలేస్తూ రిపీట్ చేయండి._*
*_# ఈ ఎక్సర్ సైజుల్ని చేస్తున్నప్పుడు మీరు పీల్చే గాలి కలుషితంగా మాత్రం ఉండకూడదు._*
*_🖋️హెల్త్ నోట్ :_*
*_సాధారణ అలసటకు విటమిన్ బి-12 లేక ఐరన్ లోపంతో కూడుకున్న రక్తహీనత (Anaemia) కారణం కావచ్చు. హైబీపీ లేక లోబీపీ లూ కారణం కావచ్చు. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయక పోవటమూ కారణం కావచ్చు. పైన చెప్పిన సూత్రాలన్నింటినీ పాటిస్తున్నా కూడా మీలో అలసట, నీరసం పోకపోతే డాక్టరు వద్ద కెళ్ళి పరీక్ష చేయించుకోండి!_*
No comments:
Post a Comment