*నక్షత్రముల జన్మము*
🌸కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27 మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె.
🌿వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలెపెంచాడు.
🌸ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష , మఖ , పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త , స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట , మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాబాధ్ర, ఉత్తరాబాధ్ర, రేవతి
🌿ఆ బిడ్డలకు తగిన వరుని కొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.
🌸ఆ ఇరువదియేడుగురు భార్యలలో అత్యంత సుందరాంగియైన రోహిణిపట్ల చంద్రుడు ఎక్కువ అనురాగం చూపుతూ తక్కినవారిపట్ల అనాదరం ప్రదర్శించాడు. అప్పుడు వారు దుఃఖించి తమ తండ్రితో తమ బాధను చెప్పుకొన్నారు.
🌿దక్షుడు సహజంగానే కోపిష్టి గనుక చంద్రుని క్షయవ్యాధితో కృశింపమని శపించాడు. క్రమంగా చంద్రుడు కళావిహీనుడుకాసాగాడు.పరమేశ్వరుని ప్రార్ధించాడు.
🌸దక్షుడినే ఉపాయం అడుగమని శివుడు చెప్పాడు. చంద్రుడు దక్షునికి నమస్కరించి "తమ ఆశీర్వచన ప్రభావంచేత ఇప్పటికిలా ఉన్నాను" అన్నాడు. అందరు భార్యలను సమముగాఎందుకుచూచుకోవడంలేదని దక్షుడు అడిగాడు.
🌿సృష్టిలో వైవిధ్యం ఉన్నపుడు అందరినీ ఒకేలా ఎలా చూసుకోగలమని చంద్రుడు ప్రశ్నించాడు. రూపమునకే ప్రాధాన్యత ఇవ్వడం తగదని దక్షుడు తెలిపాడు. అందరిలోకి రోహిణి అందగత్తె అని తాను భావిస్తున్నానని చంద్రుడు చెప్పాడు.
🌸రూపములో తరతమ భేదాలు ఉండడం సాధారణం. నా పుత్రికలలో తొమ్మిది మంది (అశ్వని, మృగశిర, పుష్యమి, స్వాతి, హస్త, పునర్వసు, అనూరాధ, శ్రవణము, రేవతి) దేవతా స్వభావులు, మరి తొమ్మిది మంది
🌿(రోహిణి, ఆరుద్ర, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాబాధ్ర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాబాధ్ర)మానవ స్వభావులు, తక్కిన తొమ్మిది మంది (కృత్తిక, మఖ, ఆశ్లేష, విశాఖ, శతభిష, ధనిష్ఠ, చిత్త, జ్యేష్ట , మూల) రాక్షస స్వభావులు.
🌸 కనుక వారి గుణాలలో భేదాలున్నాయి. అయినాగాని అగ్ని సాక్షిగా చేసుకొన్న ప్రమాణాలు తప్పరాదు. అందు వలన అసత్య దోషం కలుగుతుంది.
🌿వివాహ సమయంలో చేసే ప్రమాణములు చంద్రుని కోరికపై దక్షుడు పెండ్లినాటి ప్రమాణాలను ఇలా వివరించాడు - మంగళసూత్ర ధారణకు ముందు బ్రహ్మచూపిన అన్నంమీదదోసిళ్ళతో బియ్యం శిరసులపై పోసికొనే ముందు ఆ బియ్యం మీద, ప్రధాన హోమానికి ముందు చేతిలో పేలాలు ఉంచుకొని, ఆ తరువాత సప్తర్షులను అరుంధతిని చూపించేటపుడు అనేక ప్రమాణాలు చేశారు..
🌸ఎన్ని ఇక్కట్లు వచ్చినా భార్యను విడువనని ప్రమాణం చేసినాక భార్యను నిరాదరిస్తే అది దోషం అవుతుంది. ప్రమాణ హక్కులు లేకుండా వివాహం ఎక్కడా జరుగదు. ఆ ప్రమాణాలను వధూవరులతోసరిగాపలికింపకపోవడం పురోహితుల దోషం అవుతుంది.
🌿తెలిసి చేసినా, తెలియక చేసినా గాని సుకృతాలకు, దుష్కృతాలకు ఫలితం అనుభవింపక తప్పదు . కనుక యుక్తాయుక్తాలను తెలిసికొని కర్మలు చేయాలి.
🌸మానవేతర జంతు జాలానికి గత జన్మ పాపాలను అనుభవించడమే గాని ఆ జన్మలో క్రొత్తగా చేసే పాపాలేవీ ఉండవు. గత జన్మలో జీవులు చేసిన కర్మఫలాలు(ముందు జన్మలలో అనుభవించడానికి నిలువ చేసుకొన్నవి) తరువాతి జన్మలలో అనుభవించాలి.
🌿వీటిలో ఆరు జన్మల నుండి ప్రోగైనవి సంచితములు. ఏడు జన్మల క్రింద చేసినవి ప్రారబ్దములు. ఈ జన్మలో చేసిన కర్మలకు ముందు జన్మలలో అనుభవింపవలసిన ఫలాలు ఆగామి.
🌸వీటిలో తెలియక చేసిన అప రాధములకు పశ్చాత్తాపం పొంది , సన్మార్గాన్ని అలవరచుకోవడం వలన జీవులు క్షంతవ్యులు అవుతారు. అంటే వారి పాపాలనుండి విముక్తి లభిస్తుంది.
🌿అంతే కాకుండా జ్ఞానం ద్వారా సంచితములు, ఆగామి నుండివిడుదల పొందవచ్చును. ప్రారబ్దం మాత్రం అనుభవించి తీరవలసిందే. కనుక పశ్చాత్తప్తుడై, సన్మార్గం అవలంబించి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని జీవుడు
🌸సంచితముల నుండి, ఆగామినుండి విముక్తుడై, ప్రారబ్దాన్ని మాత్రం అనుభవించి, కర్మశూన్యుడై ముక్తిని పొందవచ్చును. బ్రహ్మజ్ఞాని కూడా ప్రారబ్దాన్ని అనుభవించి తీరాల్సిందే . జ్ఞానియైనవాడు తన కర్మలనన్నింటిని హరింపజేసుకొని, జనన మరణములు లేని స్థితిని పొందుటయే మోక్షము.
🌿కర్మ ఏమాత్రము శేషించినా గాని జన్మము తప్పదు. ఈ ప్రపంచం సమస్తమూ పరమాత్మ స్వరూపమే అని తెలిసికొని, సకల జీవులపట్ల సమభావంతో వర్తించడం సామాన్య జ్ఞానం.
🌸సామాన్య జ్ఞానాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది . అప్పుడు భేద బుద్ది తొలగి , సర్వ ప్రపంచంలో పరబ్రహ్మమే నిండియున్నదన్న జ్ఞానం ఆత్మకు లభిస్తుంది. దానివలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది... *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment