🛑 Who Really Built Modi's $4 Trillion Economy? | Was India Reborn in 1991?
Author Name:Layman Studio
Youtube Channel Url:https://www.youtube.com/@LaymanStudio4
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rK1sLbXRf0Q
Transcript:
(00:00) ఎస్ ఇండియా వాస్ రీబార్న్ బట్ టై దిస్ yearయర్ ఇస్ unusజవల్ ఫర్సెవరల్ రీasన్స్ faceేస్ aఫిస్కల్ crisస్ aఫన్ ఎక్స్చేంజ్ క్ైసిస్ అది 1991 సంవత్సరం ఇండియా చరిత్రలోనే ఒక పీడకల లాంటిది. జూన్ నెల నాటికి మన దేశ ఖజానాలో మిగిలిన విదేశీ మారక నిలువలు కేవలం 1.1 బిలియన్ డాలర్స్ మాత్రమే సరిగ్గా అంచనా వేస్తే ఈ డబ్బుతో మన దేశం కేవలం 14 రోజులకు మాత్రమే విదేశాల నుంచి పెట్రోల్ అండ్ మందులు దిగుమతి చేసుకోగలదు.
(00:30) 15వ రోజు దేశంలోకి ఒక్క చుక్క డీజిల్ రాదు. రవణ వ్యవస్థ ఆగిపోయి దేశం మొత్తం చీకట్లో కూరుకుపోతుంది. ఆ టైంలో సామాన్యుడి నడ్డి విరుస్తూ నిత్యావసరాల సరుకుల ధరలు పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ రేట్ ఏకంగా 16.7% చేరుకుంది. అప్పులు తీర్చలేని పరిస్థితిలో పడిపోయిన ఇండియాకు రేటింగ్ ఏజెన్సీస్ ఏకంగా జంక్ కేటగిరీలో పడేసాయి. దేశం పరువు కాపాడుకోవడానికి ఇండియా దగ్గర ఉన్న 67 టన్నుల బంగారాన్ని అత్యంత రహస్యంగా చార్టెడ్ విమానంలో లండన్ కు అండ్ స్విజర్లాండ్ కు తరలించి తాకట్టు పెట్టాల్సి వచ్చింది.
(01:04) అంతేకాదు లండన్ లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అధికారులు మన బంగారాన్ని చూసి ఒక ఘోరమైన అవమానం చేశారు. మీ ఇండియా బంగారం స్వచ్ఛంగా ఉండదు దీన్ని కరిగించి బిస్కెట్ల రూపంలో ఇస్తేనే అప్పు ఇస్తామని ఒక సావరిన్ కంట్రీని ముఖం మీద అవమానించింది. కానీ 1991లో దివాల అంచన నిలబడి ప్రపంచం ముందు అవమానించబడిన ఒక దేశం ఈరోజు ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదిగింది కేవలం 1.
(01:26) 1 బిలియన్ డాలర్స్ రిజర్వ్స్ ఉన్న స్థాయి నుంచి ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఒక దేశం మళ్ళీ ఎలా పుట్టింది ఈ అద్భుతమైన మార్పు వెనుక ఉన్నది కేవలం ఇద్దరంటే ఇద్దరే నాయకులే అందులో ముఖ్యులు పివి నరసింహారావు గారు రెండో ఆయన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వీళ్ళద్దరూ కలిసి వేసిన ఆర్థిక వ్యూహాలే ఈనాటి మన ఆధునిక భారతదేశం. అసలు వాళ్ళు ఏం చేశారు అనేది అంకెలతో సహా మాట్లాడుకుందాం.
(01:48) బికాuse ఆఫ్ దిస్ ప్రొటెక్టెడ్ markర్కెట్ద indian peopleీపల్వ beంగ్ gివen shortlyీ goodడ్స్ అండ్సర్వస్ 12 ట 24మంతస్అంఅబౌట్ 50 విసిట్స్ టడీ get a lైensస్ to every lైన్స్ఎపట్ was pr్రocర్edబ corరప్ట్ అసలు కోట్లాది మంది యువత అండ్ అపారమైన వనరులు ఉన్న మన దేశం ఎందుకు ఈ దారుణమైన పరిస్థితికి వచ్చింది దీనికి ప్రధాన కారణం మనం 40 ఏళ్ల పాటు అనుసరించిన తప్పుడు ఆర్థిక విధానాలే.
(02:17) 1950 నుంచి ఇండియా ఒక క్లోజ్డ్ ఎకానమీగా అంటే బయట దేశాల నుంచి ఏమీ కొనుక్కోకుండా అన్ని దేశం లోపలే తయారు చేసుకోవాలి అనే విధానాన్ని అనుసరించింది. దీనివల్ల దేశంలో భయంకరమైన లైసెన్స్ రాజు వ్యవస్థ పుట్టుకొచ్చింది. ఎవరైనా ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఢిల్లీలోని అధికారుల చుట్టూ సంవత్సరాల తరబడి పడిగాపులు కాయాల్సిందే. 12 టు 24 మంత్స్ అండ్ అబౌట్ 50 విజట్స్ టు ఢిల్లీ టు గెట్ ఏ లైఫ్ రోజుకు ఎన్ని వస్తువులు తయారు చేయాలో దాన్ని ఎంత ధరకు అమ్మాలో కూడా గవర్నమెంటే డిసైడ్ చేసేది.
(02:48) దీనివల్ల కొత్త వ్యాపారాలు ఎదగక 1950 నుంచి 1980 వరకు మన దేశ సగటు జీడిపి వృద్ధి రేటు కేవలం 3.5%కి పరిమితమైంది. ప్రపంచ ఆర్థిక వేత్తలు మన దేశాన్ని చూసి దీన్ని హిందూ వృద్ధి రేటు అని వెక్కరించేవాళ్ళు. సరిగ్గా అదే టైంలో మనకంటే చాలా చిన్న దేశాలైన సౌత్ కొరియా అండ్ తైవాన్లు 8 నుంచి 10% వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయి. విదేశీ వస్తువులు దేశంలోకి రాకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏకంగా 300% వరకు ఇంపోర్ట్ డ్యూటీ లేదా కస్టం టాక్స్లు పెంచేసింది.
(03:17) దీనివల్ల మన దేశంలోని కంపెనీలకు బయట ప్రపంచం నుంచి ఎలాంటి పోటీ లేకుండా పోయి నాణ్యత లేని వస్తువులను ఇష్టం వచ్చిన ధరకు అమ్మడం మొదలు పెట్టారు. ఒక సామాన్యుడు స్కూటర్ కొనాలన్నా లేదా ఇంట్లో టెలిఫోన్ కనెక్షన్ కావాలన్నా 10 సంవత్సరాల పాటు వెయిటింగ్ లిస్ట్ లో ఉండాల్సిన దారుణమైన పరిస్థితి ఉండేది. చాలా వ్యాపారాల్ని కేవలం ప్రభుత్వమే స్వయంగా నడిపించడం వల్ల విపరీతమైన నష్టాలు వచ్చాయి.
(03:39) ఈ నష్టాలను పూజానికి ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ద్వారా కొత్త కరెన్సీ నోట్లను విపరీతంగా ముద్రించడంతో డబ్బు విలువ పడిపోయి ధరలు మండిపోయాయి. 1991 నాటికి ప్రభుత్వం తన ఆదాయం కంటే విపరీతంగా ఖర్చు చేయడంతో మన ద్రవ్యలోటు లేదా ఫిజికల్ డెఫిసిట్ జీడిపీలో 8.4%కి 4 %ానికి అమాంతం పెరిగిపోయింది. సరిగ్గా ఇలాంటి టైంలో 1990 లో జరిగిన గల్ఫ్ యుద్ధము ఇండియాను నేరుగా అగాధంలోకి నెట్టిందని చెప్పాలి.
(04:06) ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెట్రోల్ రేటు బ్యారల్ కు 15 డాలర్ల నుంచి ఒక్కసారిగా 35 డాలర్లకు పెరగడంతో మన డాలర్ల ఖర్చు రెట్టింపయింది. గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న లక్షలాది మంది ఇండియన్స్ ప్రాణభయంతో వెనక్కి రావడంతో వాళ్ళు పంపించే రెమిటెన్సెస్ పూర్తిగా ఆగిపోయాయి. అదే టైంలో సోవియట్ యూనియన్ ముక్కలు అయిపోవడంతో మన ఎక్స్పోర్ట్స్ కు ఉన్న అతి పెద్ద ఉచిత మార్కెట్ ఒక్కసారిగా మూసుకుపోయింది.
(04:29) దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంటే ఢిల్లీలో పివి సింగ్ అండ్ చంద్రశేఖర్ లాంటి నాయకుల ప్రభుత్వాలు కనీసం ఏడాది తిరగకుండానే పడిపోయాయి. జూన్ 1991 లో కాంగ్రెస్ పార్టీలో ఎవరు పెద్దగా పట్టించుకొని 70 ఏళ్ల వృద్ధ నాయకుడికి ప్రధానమంత్రి పదవి అప్పగించారు. వచ్చాడు వచ్చాడు వచ్చాడు వచ్చాడు మే పివి నరసింహరావ్ ఈశ్వర్కి లేత ఈశ్వర్ కి శపలేత అప్పటికే గుండె ఆపరేషన్ చేయించుకొని రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయనే పివి నరసింహారావు ఆయన ఎక్కువ కాలం పదవిలో ఉండలేరని అందరూ నమ్మారు కానీ ఆయన ఇండియా పొలిటికల్ చరిత్రలోనే అతి పెద్ద చాణకుడని వాళ్ళకి అప్పటికి
(05:09) తెలియదు. దోose proble్రాబ్లమ్స్విత్ deటర్మిinేationన్ అండ్సింగgle mైండెడ్నెస్వ విల్ ఎన్sureద unూనిityీ అండ్ఇంటగ్రటీ ఆఫ్ ది కంట్రీ ఆర్ saఫ్గార్డెడ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పివి నరసింహరావు గారు దేశాన్ని కాపాడాలంటే ఒక ప్రపంచ స్థాయి ఆర్థిక నిపునుడు కావాలని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఏరుకోరి మరి ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారు.
(05:31) వారిద్దరి మధ్య జరిగిన సమావేశంలో దేశం మునిగిపోవడానికి సిద్ధంగా ఉందని కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే నాశనం అవుతామని మన్మోహన్ సింగ్ గారు నిక్కచ్చిగా చెప్పారు. అప్పుడు పివి నరసింహారావు గారు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆపరేషన్ చేసే పూర్తి బాధ్యతను మన్మోహన్ సింగ్ గారికి అప్పగించారు. రాజకీయ దెబ్బలను నేను ఒక షీలాగా కాసుకుంటానని మాట ఇచ్చారు.
(05:51) ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మనకు అప్పు ఇవ్వడానికి కొన్ని కఠినమైన శరతులు విధించింది. కానీ పీవీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ సంక్షోభాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకొని ఐఎంఎఫ్ అడిగిన దానికంటే ఎక్కువ మార్పులు చేశారు. జూలై 1, 1991 న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన కరెన్సీ విలువను కావాలనే 9% తగ్గించింది. ఆ వెంటనే జూలై 3న మళ్ళీ ఇంకో 13% తగ్గించడంతో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రెండు రోజుల్లోనే దాదాపు 19% పడిపోయింది.
(06:21) దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ లో మన వస్తువులు చౌకగా మారి ఎగుమతులు పెరుగుతాయి అనేది దీని వెనక అసలైన వ్యూహం కానీ ఈ విషయం బయటకి తెలియగానే దేశంలో అగ్ని పర్వతం బద్దలయి అమెరికాకు అమ్ముడిపోయారు అని ప్రతిపక్షాలు పార్లమెంట్లో గొడవ చేశయి. ఇంట్రడ్యూస్ లాస్ట్ ఇయర్ హవ్ ఎలిమినేటడ్ డిఫరెన్షియల్ ఇన్సెంటివ్ ఫర్ఎక్స్ప ఆ తర్వాత అసలు మాస్టర్ స్ట్రోక్ జూలై 24 1991న పడింది.
(06:45) ఆ రోజు సాయంత్రం మన్మోహన్ సింగ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా ఉదయం ఎవరికీ తెలియకుండా పీవి గారు నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో 40 ఏళ్ల నాటి క్యాన్సర్ లాంటి లైసెన్స్ రాజును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కేవలం 18 కీలక రంగాల మినహా మిగతా దేనికైనా ప్రభుత్వ అనుమతి అవసరం లేదని తెలియచేశారు. అంతేకాకుండా 34 హై ప్రయారిటీ రంగాల్లో 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడలకు అనుమతి ఇచ్చేసి మార్కెట్ తలుపులు బార్లా తెరిచేశారు.
(07:13) ఇండియా onన్ దమూ అగైన్వషల్మే దఫ్యచureహ అందరి దృష్టి సాయంత్రం వచ్చే బడ్జెట్ మీద ఉండడంతో ఈ చారిత్రాత్మక నిర్ణయము పెద్ద గొడవ లేకుండానే పాస్ అయిపోయింది. సాయంత్రం బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ సింగ్ గారు ఎరువులు అండ్ చక్కరపై ఇస్తున్న భారి సబ్సిడీలను నిర్దాక్షణంగా కట్ చేశారు. ఆ బడ్జెట్ స్పీచ్ చివరిలో ఆయన ఒక ఐడియాకి సరైన టైం వచ్చినప్పుడు దాన్ని ఏ శక్తి ఆపలేదు అని విక్టర్ హ్యూగో మాటలను కోట్ చేస్తూ భారతదేశం గ్లోబల్ పవర్ గా మారుతుందని గర్జించారు.
(07:43) సోషల్ అండ్ ఎecనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియాహటప్ఇదఫ్రేameవర్క్ of ఓపన్సocైటీ కానీ ఈ మార్పులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రోడ్లెక్కి భారీగా బందులు చేశాయి. దేశంలోని టాప్ ఇండస్ట్రియలిస్టులు అంతా ఏకమై బొంబై క్లబ్ గా ఏర్పడి విదేశీ కంపెనీస్ వస్తే మేము నాశనం అవుతామని బెదిరించారు. సొంత పార్టీ నాయకుల సైతం సోషలిజాన్ని కూనీ చేస్తున్నామని పివీ గారిని పదవి నుంచి దించడానికి కుట్రలు పన్నారు.
(08:10) అప్పుడు పివి నరసింహారావు గారు ఎంతో ప్రశాంతంగా మనం ఇది కావాలని చేయడం లేదు ఐఎంఎఫ్ వాళ్ళు పెట్టిన కండిషన్లు ఇవి లేకపోతే దేశం డిఫాల్ట్ అవుతుందని వాస్తవాన్ని అంకెల రూపంలో చెప్పారు. మైనారిటీ గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ దేరీజ్ ను ఆల్టర్నేటివ్ వ్యూహంతో అత్యంత ఓపిగ్గా సంస్కరణను ముందుకు తీసుకెళ్లారు. ఈ ఇద్దరు నాయకులు చేసిన ఫైనాన్షియల్ సర్జరీకి ప్రతిఫలం డేటా రూపంలో రెండేళ్ల వ్యవధిలోనే ప్రపంచం కళ్ళ ముందు కనిపించింది. 1991 లో కేవలం 1.
(08:36) 1 బిలియన్ డాలర్స్ ఉన్న విదేశీ మారక నిలువలు 1994 నాటికి ఏకంగా 15 బిలియన్ డాలర్స్ ఎగుబాకాయి. ఇంగ్లాండ్ అండ్ స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో కుదురుపెట్టిన 67 టన్నుల బంగారాన్ని అప్పు తీర్చి సురక్షితంగా తిరిగి మన దేశాన్ని తీసుకొచ్చారు. సరిగ్గా 1993 లో ఇండియా ఐఎంఎఫ్ దగ్గర తీసుకున్న ఎమర్జెన్సీ అప్పును గడువు కంటే ముందే తిరిగి చెల్లించి ప్రపంచ మార్కెట్లకు ఒక అతి పెద్ద మెసేజ్ ఇచ్చింది.
(09:00) ఒక దివాళ తీసిన దేశం ఇంత త్వరగా కోలుకోవడం చూసి ఇండియా తిరిగి వచ్చింది అని ప్రపంచ దేశాలకు అధికారికంగా అర్థమయింది. 1991 లో 1.1% 1%ా పడిపోయిన జీడిపి వృద్ధి రేటు 1994 వచ్చేసరికల్లా అది ఏకంగా 6.7%నికి పైగా ఎగబకింది. సామాన్యుడిని భయపెట్టిన 16.7% ద్రవ్యోల్బనం నాలుగేళ్లలో సింగిల్ డిజిట్ కు అంటే 8 %ాతనికి పడిపోయి స్థిరపడింది.
(09:24) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోకి వరదలా వచ్చి ఐటీ టెలికాం ఆటోమొబైల్ రంగాలను దేశంలో ఒక మహా విప్లవాన్ని క్రియేట్ చేశాయి. మార్కెట్ లో విపరీతమైన పోటీ పెరగడంతో ఉత్పత్తి ఖర్చులు తగ్గి వస్తువుల నాణ్యత పెరిగి మధ్య తరగతి ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. గంటల తరబడి రేషన్ క్యూస్ లో నిలబడే పరిస్థితి నుంచి ఆన్లైన్ లో ఏ వస్తువైనా ఇంటికి వచ్చే స్థాయికి దేశం ఎదిగింది.
(09:46) 1991 లో కేవలం 270 బిలియన్ డాలర్స్ ఉన్న మన దేశ జీడిపి ఈ రిఫార్మ్స్ పునాది మీదే నేడు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా అవతరించింది. ఒక దేశం అగాధంలో పడిపోయినప్పుడు తిరిగి ఎలా లేవాలో పివి నరసింహారావు గారు అండ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రపంచానికి ఒక పాఠం నేర్పారు. ఒకరేమో రాజకీయ దాడులను గుండెల్లో దాచుకున్న రాజనీతిజ్ఞుడు అయితే మరొకరేమో అంకెలతో దేశాన్ని కాపాడిన ఆర్థిక నిపుణుడు.
(10:13) కానీ విచిత్రం ఏంటంటే దేశాన్ని ఇంత పెద్ద గండం నుండి రక్షించిన పివి నరసింహారావు గారికి రాజకీయ కారణాల వల్ల చరిత్రలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు. కానీ వాస్తవాలను అండ్ అంకెలను ఎవరూ దాచలేరు. నేడు మనం అనుభవిస్తున్న ఈ డిజిటల్ ఇండియా అంతా ఆనాడు వారు నాటిన విత్తనాలే. బంగారాన్ని కుదవబెట్టి పొరువు పోగొట్టుకున్న ఒక దేశం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎలా మారిందో చెప్పే వాస్తవ చిత్రమే ఈ 1991 సంస్కరణలు ఇది ఒక అద్భుతమైన నాయకత్వంలో జరిగిన ఒక మహా దేశం యొక్క పునర్జన్మ ఎస్ ఇండియా వాస్ రీబార్న్ ఏ బిగ్ సెల్యూట్ టు పివి నరసింహరావు గారు
(10:47) అండ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఫ్రెండ్స్ ఫైనల్లీ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా వాల్యూబుల్ గా అనిపించింటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్
No comments:
Post a Comment