‼️CASTE System గురించి కృష్ణుడు చెప్పాడా?‼️|ft.Dr.Vara Prasad Reddy | Telugu Podcast | Madan Gupta
Author Name:Madan Gupta
Youtube Channel Url:https://www.youtube.com/@themadangupta
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6hx1uanklUA
Transcript:
(00:00) రాంగ్లీ కోటెడ్ ఎవరంటే కృష్ణుడు ఆయన వర్ణ వ్యవస్థను పెట్టాడని కమ్యూనిస్టులు అర్థం చేసుకోకుండా తిట్టారు ఆయన కుల వ్యవస్థ పెట్టలే వర్ణ వ్యవస్థ పెట్టాడు వృత్తి ధర్మం వాళ్ళు చేయమన్నారు. వృత్తిలు ఎవరి వృత్తి వాళ్ళు చేస్తే అదే వాళ్ళకి ఆదాయం కుటుంబ పోషణ ఆనాడు అధికారుల వరకే ఇబ్బంది పలికించేవాళ్ళు.
(00:24) రాజకీయ నాయకుల ప్రమేయం తక్కువ ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ పరిశ్రమలకు కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టం ని తగ్గిస్తూ వస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు ఎందుకు లేదు అంటే వాళ్ళ సీటుని కాపాడుకోవడానికి ఉచితాలు అన్నటువంటి ఒక పథకాలు తీసుకొచ్చి ఉన్న డబ్బునంతా 2000 చేయడమే కాదు పెన్షన్ వయసు 45కే తగ్గిస్తామని చెప్పి ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను.
(00:50) కాలనీలకు ఎవరు కూడా కరెంట్ బిల్లులు కట్టాల్సిన అవసరమే లేకుండా చేస్తానని చెప్తా ఉన్నాను నేను. ఇఫ్ ఎవరీబడీ ఎనీబడీ ఇస్ హావింగ్ సెకండ్ చైల్డ్ స్ట్రెయిట్ అవే ఐ విల్ గివ్ ₹25,000 క్యాష్ ఫర్ థర్డ్ చైల్డ్ వు ఆర్ గోయింగ్ టు గివ్ మంత్లీ ₹1000 ఫర్ అప్ టు ఫైవ్ ఇయర్స్ పెన్షన్లు ఉద్యోగ భృత్తి, పస్తుకి, కుంకుమకి, తాలిబట్టుకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా మనుషుల మీద పరిశ్రమ మీద కాదు.
(01:14) అది సంక్షేమం, సంక్షేమం సంక్షేమము చివరికి సంక్షేమం. మీ ద మన్ హ గేవ్ ఇండియా ఇట్స్ ఫస్ట్ ఇంజనస్లీ డెవలప్ రీకాంబినయంట్ హెపటైటిస్ బి వక్సిన్ పద్మభూషణ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి గారు దవిజనరీ ఫౌండర్ ఆఫ్ శాంత బయోటెక్నిక్స్ ఆన్ ద మదన్ గుప్త పాడ్కాస్ట్ నా ఏన్షయంట్ హిస్టరీని గాని చూసుకుంటే మనవాళ్ళు చాలా ఇన్వెన్షన్స్ చేశారు. రీసెర్చ్చే జరగకుండా ఎందుకు అలా ఆర్ఎన్డి ప్రభుత్వం ఒక దేశం కొరియా 4% ఆన్ జిడిపిఆర్ఎండి మీద ఖర్చు పెడుతుంది. జర్మనీ 5.
(01:51) 6 అమెరికా 3.9 ఫ్రాన్సునాలుగు చైనా ఆరు మనం ఎంత పెడతామో తెలుసా? 0.6 మన జీడిపీలో 0.6 మనం ఖర్చు పెట్టేది. ఐటి ఐటి నేనేదో సాధించాను అని చెప్పుకునే గత ముఖ్యమంత్రి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయనకు తెలియకుండానే ఎంత ద్రోహం జరిగిపోయిందో సైన్స్ మీరు ఆలోచించు పోనీ ఏమన్నా వీళ్ళు కొత్త విషయాలు కనిపెట్టారు ఐటీ కూలి పని చేస్తారు ఇప్పుడున్న ఐటీ వాళ్ళు అవునండి పల్లెల్లో అనేక ఉత్పత్తులు జరిగేవి మనం పెద్ద మెకనైజేషన్ చేసి ఆ వృత్తిదారులందరినీ చెడిపోయాం సార్ మన జీడిపీలో 40% ఉత్పత్తి ఉండేది 12% పడిపోయింది. మనం ప్రతి ఒక్కరిని ఎత్తిన 20
(02:30) లక్షలో 30 లక్షలో సిటీ మీద పడ్డారు ఉద్యోగాలకి ఎస్ హెవీ అయిపోయింది పడవ అందరూ సమానంగా చుట్టూ కూర్చుంటే నిరుస్తుంది. అందరూ అర్బన్ వైపు వచ్చేస్తే మంచి పాట ఒకటి ఉంది సార్ ఏది ఇంతకుముందు పాత సినిమాలో టౌన్ పక్కక వెళ్లొద్దురో డింగరి డాంబికాలు పోవద్దు టౌన్ పక్కకెళ్లొద్దురా డింగరి డాంబికాలు పోవద్దురా నమస్తే వరప్రసాద్ రెడ్డి గారు నమస్కారం సార్ ఇప్పుడు ఆనాడు మీరు ఈ వ్యవసాయంలోకి అంటే పరి పరిశ్రమల వ్యవసాయంలోకి మీరు దిగినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నేటి నేటి పరిస్థితులు అంటే దాదాపు 40
(03:16) ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఈనాడు ఉన్న పరిస్థితులు ఏమన్నా తేడా మీకు కనిపిస్తుందా తేడాలు ఉన్నాయి బాగైతే పడలేదు సార్ తేడాలు ఉన్నాయి బాగుపడలేదు మ్ మరో మరో రకంగా కలుపు మొక్కలు వస్తూనే ఉన్నాయి ఒకే రకం కలుపు మొక్క కాదు ఆనాడు అధికారుల వరకే ఇబ్బంది పనికించేవాళ్ళు రాజకీయ నాయకుల ప్రమేయం తక్కువ ఉండేది ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నారు.
(03:49) వాళ్ళ ప్రాధాన్యాలు వేరుగా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఈ పరిశ్రమలకు కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టం ని తగ్గిస్తూ వస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు ఎందుకు లేదు అంటే వాళ్ళ సీటుని కాపాడుకోవడానికి ఉచితాలు అన్నటువంటి ఒక పథకాలు తీసుకొచ్చి ఉన్న డబ్బునంతా పెన్షన్లు ఉద్యోగభృతి పసుపుకి కుంకుమకి తాలిబొట్టుకి సమర్తాడిన దానికి గర్భవతికి మరీ భయంకరంగా అయిపోయినాయి భయంకరంగా అయిపోయినాయి ఆ డబ్బులన్నీ అట్టు వెళ్ళిపోతే ప్రజలని ఓట్ బ్యాంక్ గా చూసినటువంటి రాజకీయాలు వచ్చి చేసి ఒకప్పుడు కేవలం అధికారుల వరకే అలసత్వం అలక్ష్యమో నిర్లక్ష్యమో లేకపోతే అవినీతో
(04:34) ఇప్పుడు రాజకీయ నాయకులు ఇవ్వాల్సిన ఫండ్స్ పరిశ్రమలకు ఇవ్వకుండా దారిమళ్ళ ఇచ్చారు. వాళ్ళ సీటు కాపాడుకోవడానికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా మనుషుల మీదనే పరిశ్రమల మీద కాదు ఇది లాంగ్ టర్మ్ లో ఎంత దెబ్బ కొడుతుంటే అభివృద్ధి లేదు అని సంక్షేమం సంక్షేమం సంక్షేమం చివరికి సంక్షామం సంక్షామం క్షామం ఇప్పుడు అంటే ఆ ఆనాడు ఆ ప్రపంచవ్యాప్తంగా మన ఏన్షియంట్ హిస్టరీని గాని చూసుకుంటే మనవాళ్ళు చాలా ఇన్వెన్షన్స్ చేశారు.
(05:08) అండ్ అఫ్కోర్స్ మీరు తయారు చేసిన హెపటైటిస్ బి వ్యాక్సిన్ మాతృక కూడా మన గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది అంటే వ్యాక్సినేషన్ సిస్టం ఇన్ని ఇన్వెన్షన్స్ మనకు ఉంటే అసలు మన వాటిల మీద రీసెర్చ్ జరగకుండా ఎందుకు అలా రీసెర్చ్ అన్వేషణకి ఆర్ఎన్డి కి ఇన్సెంటివ్స్ ఉండేయి ఉత్సాహం చేయడానికి వాళ్ళు ఆర్ఎన్డి మీద మీరు ఒక వ రూపాయలు ఖర్చు పెడితే 175 రూపాయలు రాయితీ ఇచ్చేవాళ్ళు పన్నులో ఆహ క్రమేణ 175 నుంచి 150 100నకి 100 రూపాయలు వెసులుబాటు
(05:53) 50 రూపాయలు తగ్గించారు ఇప్పుడు జీరో నువ్వు ఏమనా ఖర్చు పెట్టుకో దండగా ఆర్ఎండి చేయడం ఆవిష్కరణలకి ప్రోత్సాహం అనేది లేకుండా చేసేసారు ఇది ప్రియ ప్రభుత్వం ఎందుకంటే డబ్బు లేదు ఆ డబ్బు ఏమైందంటే ఉచితాలు ఉచితాలు అందువల్ల ఏది కూడానండి రీసెర్చ్ చేయాలంటే డబ్బు కావాలి. ప్రతి అన్వేషణకి ఖర్చు ఉంటుంది.
(06:15) దానికి డబ్బు ఖర్చు పెట్టకపోతే ఎట్లా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఆర్ఎండి ఒక ప్రభుత్వం ఒక దేశం చిన్న దేశాలు అవితొమ్మిది కోట్ల జనాభా 10 కోట్ల జనాభా ఉన్నట్టు కొరియా 4% ఆన్ జీడిపి ఆర్ఎన్డిబి ఖర్చు పెడుతుంది మనం ఎంత పెడతామో తెలుసా06 మన జీడిపీ లో 0.6 మనం ఖర్చు పెట్టేది వాళ్ళు నాలుగు జర్మనీ 5.6 అమెరికా 3.9 9 ఫ్రాన్స్ నాలుగు చైనా ఆరు మనం ఎక్కడున్నాం పాయింట్ ఆరు ద్రోహం కాదు ఇది
(07:00) కచ్చితంగా ఎక్కడి నుంచి వస్తాయి ఆవిష్కరణలు మీకు ఇంకొకటి చెప్తాను సైన్స్ చదివేవాళ్ళు లేకుండా పోయారు ఎందుకని అందరూ ఐటి ఉద్యోగం ఐటి ఉద్యోగం అవడికే సైన్స్ అక్కర్లేదు అమెరికా వెళ్ళిపోవాలి డాలర్స్ సంపాదించాలి పోనీ ఏమన్నా వీళ్ళు కొత్త విషయాలు కనిపెట్టారు ఐటీలో కూలి పని చేస్తారు ఇప్పుడున్న ఐటీ వాళ్ళ అవునండి అవును సార్ కూటి కూలి పని ఆపరేటర్స్ వాడు గంటకి 80 డాలర్లు ఇస్తాడు పంపించిన ముటామిస్త్రీ ఉంటాడు కదా ఏదో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా ఆ గంటకి వాడికి 80 ఇస్తే 20 వాడు జోబులు వేసుకొని 60 వాళ్ళ పంపాడు వాడు ఏ పని చేయకుండా ముటా మేస్త్రి
(07:38) తనానికే గంటకి 20 డాలర్లు ఒక మనిషి మీద 3000 మంది 4000 మంది పంపిస్తున్నారు అమెరికాకి ఓవర్నైట్ అంతా కుబేరులు అయిపోయారు. ఇది జరుగుతుంది అదే 10వేల మందికి ఒక సైంటిస్ట్ ఉన్నాడు అక్కడ ఇక్కడ 12 లక్షల మందికి ఒక సైంటిస్ట్ లేడు. అన్యాయం కదా కచ్చితంగా సార్ సైన్స్ ఎవరు చదువుతారు అంతా ఈ డాలర్ల కోసం వెంపలాడి పరిగస్తున్నారు. ఐటి ఐటి నేనేదో సాధించాను అని చెప్పుకునే మన గత ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయనకు తెలియకుండానే ఎంత ద్రోహం జరిగిపోయిందో సైన్స్ కి మీరు ఆలోచించండి.
(08:16) ఎవరైనా చెప్తారా ఆ విషయం మీలాంటి జర్నలిస్టులు కూడా దీని గురించి పట్టించుకోరు రాయరు ఎక్కడ మాట్లాడరు. దారుణం ఇది దారుణమే సార్ నిజంగా దారుణం ఇప్పుడు అలా కాదు సార్ ఇప్పుడు ఆవిష్కరణ లేకుండా ఇంటెలిజెన్స్ వచ్చింది ఏమవుతారు ఈ ఐటీ వాళ్ళంతా 150 మందికి ఒక్క కంప్యూటర్ షిప్ చాలు చాలు ఏమైపోతారు వీళ్ళంతా సైన్స్ లేదు ఆవిష్కరణలు లేవు ఐటీ లేదు ఏమైపోద్ది ఈ దేశం అప్పుడు దాహం అయితే బావి తవ్వుకుంటారా అదే కదా ఆగలకే తప్ప కోదే కువ అని నిప్పు అంటుకున్నప్పుడు బావి తవ్వుకోవడం మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు అంటే ఎటువంటి మార్పులు వస్తే ఆ ఇటువంటి పరిస్థితులు మారుతాయి. దీనికి
(09:01) కావాల్సింది ఏదో ఈ నాయకుడు ఇంకో నాయకుడు కావడం కాదు అందరి నాయకులు ఒకటే అందరూ వినాయకులే సమాజంలోనే ఒక మార్పు రావాలి. ఇది ఇవాళటికి ఇవాళ్ళు రాదు మన విద్యా విధానం మారాలి. ఈ ఇంగ్లీష్ విద్యా విధానం పోవాలి. మన ఆర్ష ధర్మంలో ఉన్న విద్య రావాలి మన మూలాలు మనం తెలుసుకోవాలి మనకున్న పాత వైభవం వాళ్ళకి గుర్తుకు రావాలి వాళ్ళలో ఆత్మీయనత పోయి అమెరికా పోయి చదువుకుంటే చదువు కాదు ఇక్కడ కూడా నేను చదువుకోవచ్చు ఇక్కడ తగిన ఆవిష్కరణలు చాలా గొప్పవి ఉన్నాయి గణితానికి ఖగోళ శాస్త్రానికి జామెట్రీకి అన్నిటికీ పునాది ఇక్కడే ఇదబడింది అన్న విశ్వాసం
(09:38) కలిగి మన విద్య పట్ల గౌరవం పెరిగితే మన మేదస్సు మళ్ళీ మనం వికసితం చేసుకుంటే అప్పుడు అప్పుడు ఇట్లాంటి మంచి పౌర సమాజం నుంచి వచ్చిన నాయకులు వచ్చినప్పుడు పరిస్థితులు మారుతాయి ఐదారు తరాలు మారాలి అంటే ఐదు 60లు 300 సంవత్సరాల తర్వాతనే మీరు మంచి రోజులు చూస్తారు సార్ అంటే మనకు చూసే అవకాశం లేదు మీరు తట్టుకోలేరు నేను ఈ విషయం చెప్తున్నా మీ మనవల మనవల మనవల మనవల వరకు మలమల మాడిపోతారు ఇక్కడ ఇటాటి సమాజంలో ఆ తర్వాత ఏమన్నా మారొచ్చు వాస్తవం చెప్పాను సార్ ఒక ఒకనాటి కాలంలో ప్రతి ఇల్లు మన మన భారతదేశంలో మీరు పల్లెల నుంచి వచ్చిన వాళ్ళే మేము పల్లెల నుంచి వచ్చిన వాళ్ళమే
(10:18) పల్లెల్లో అనేక ఉత్పత్తులు జరిగేవి ఆ ఉత్పత్తులన్నీ గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చేవి అసలు ఆ ఉత్పత్తులన్నిటిని మనం పెద్ద మెకనైజేషన్ చేసి ఆ వృత్తిదారులందరినీ చెడిపాం సార్ రాంగ్లీ కోటెడ్ ఎవరంటే కృష్ణుడు ఆయన వర్ణ వ్యవస్థను పెట్టాడని కమ్యూనిస్టులు అర్థం చేసుకోకుండా తిట్టారు ఆయన కుల వ్యవస్థ పెట్టలే వర్ణ వ్యవస్థ పెట్టాడు పెట్టాడు అది వాళ్ళు ఏ వృత్తి వధర్మో వాళ్ళు చేయమన్నారు.
(10:51) వృత్తులు ఎవరి వృత్తి వాళ్ళు చేస్తే అదే వాళ్ళకి ఆదాయం కుటుంబ పోషణ ఎప్పుడైతే చాకలవాడు చాకల పని మానేసి ఐటీ కి వెళ్ళిపోయాడో ఇప్పుడంతా మెషిన్స్ వచ్చేసినాయి దాన్ని ఏమయింది వాడి వృత్తి పోయింది. అది చేసే నేపణ్యం పోయింది కమరివాడు లేడు కుమ్మరివాడు లేడు నేతలు వేసేవాడు లేడు మెకనరైజేషన్ అయిపోయింది వాళ్ళందరూ దేని మీద పడ్డారు అర్బన్ సిటీ మీద పడ్డారు ఉద్యోగాలకి ఎస్ హెవీ అయిపోయింది పడవ అందరూ సమానంగా చుట్టూ కూర్చుంటే నిలుస్తుంది.
(11:25) అందరూ అర్బన్ వైపు వచ్చేస్తే పడిపోయింది. ఇక్కడ శానిటేషన్ లేదు ఆరోగ్య సమస్యలు ఇంతమందికి నీళ్ళ ఇవ్వలేరు ఏమి జరగవు ఇక్కడ అనారోగ్యాలు పాలైపోయారు. ఆ మనకు మంచి అవినీతి పెరుగుద్ది మంచి పాట ఒకటి ఉంది సార్ ఏది ఇంతకుముందు పాత సినిమాలో టౌన్ పక్కక వెళ్లొద్దురో డింగరి డాంబికాలు పోవద్దు కోడికోడళ్ళు ఆ మొత్తం మరుగు వాసనలను తగిలించిన చచ్చిన అవతలకి ఇచ్చే ఇదే ఉండదని బ్యాలెన్స్ పోయింది వృత్తి ధర్మాలు పోయినాయి నాచురల్ గా అర్బనైజేషన్ వచ్చింది పల్లెటూళ్ళు మూతపడిపోయినాయి పల్లెలు వెన్నెమక దేశానికి అవన్నీ ఎండిపోయినాయి మనం తెలియ ఇది ఈ సృష్టి పరిణామ క్రమంలో ఇన్ని సృష్టి కొంతకాలం బాగా పచ్చగా ఉండడం
(12:13) మళ్ళీ ఎండిపోవడం తప్ప భగవంతుని సృష్టిలోనే మళ్ళీ నేర్చుకుంటాం అది ఒక సైకిల్ అండి అది ఈ శాఖ సంక్రమణంలో టఫ్ పీపుల్ మేక్ థింగ్స్ ఈజీ ఫర్ ది అదర్ పీపుల్ సో దే క్రియేట్ ఏ గుడ్ సొసైటీ ఇన్ గుడ్ సొసైటీ లేజీ పీపుల్ స్టార్ట్ ఎమర్జింగ్ దెన్ దే క్రియేట్ టఫ్ టైమ్స్ టఫ్ టైస్ మళ్ళీ టఫ్ టైమ్స్ వచ్చినాయి కాబట్టి కొంతమంది మేధావతులు వచ్చి ఆ టఫ్ టైమ్స్ సాల్వ్ చేసి ఈజీ చేస్తే మళ్ళీ సాల్వ్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ సార్ ఈనాటి యువతకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి? ఈనాటి యువత కంటే ఒకటే వాళ్ళు కూడా ఏమి చేయలేరు నేను చెప్పే సందేశం బట్టి మార
(12:52) సార్ అన్యాయం సార్ ఈ మాట లేదు 100% నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళేమ మారరు. యువత సార్ మీలాంటి వారి జీవితాలే ఈనాటి యువతకు ఆదర్శం సార్ మీరు ఎన్నెన్ని కష్టాలు పడి పైకివచ్చారు ఈ స్థితికి వచ్చారు చాదస్తు పడ్డాడుఅని అంటారు అలా ఉంది అట్లే లేదు సార్ లేదు లేదులే లేదు సార్ యు ఆర్ ఐకాన్ ఫర్ ద ప్రెసెంట్ యూత్ మీరు ఒక విషయం చెప్తాను మీరు బేస్ వదిలిపెట్టి నేల విడిచి నన్ను పొగుడుతున్నారు అరే లేదు సార్ లేదు సార్ నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నిజాయితిగా నా సంస్థలోనే నేను ఏర్పాటు చేసిన నీతి నియమం నిబద్ధత నేను ఉన్నాను గానీ నా మనుషులోనే ఎక్కడో
(13:32) లోపం జరిగింది నాకు ఎవరో చెప్పారని చెప్పానా నా మనుషులే నేను వాళ్ళకి నేను ఆదర్శపాయం మరి నా దగ్గరే నా మనుషులే నా వెనక చేశారని విన్నాను నేను నేను ఇంకో యూత్ కి చెప్తే మీరు జాగ్రత్తగా ఉండండి పద్ధతిగా ఉండండి అంటే వింటారండి ఏం మాట్లాడుతారు ఎందుకు విన్నారు సార్ సార్ అట్ల ఏం లేదు సార్ అది కాదు నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పిన దాన్ని బట్టి మారుతాను కదా అవన్నీ కాదు వాళ్ళ వాళ్ళకి తెలియ చెప్పాలి మనం ఏమిటంటే మీరు బతకాల్సిన బతుకు ఇది కాదు మీరు ఆలోచించుకోండి మనకు మనం చేసుకునే రోజులు రావాలి స్వయం సమృద్ధి సెల్ఫ్ సఫిషియన్సీ సెల్ఫ్
(14:07) రిలయన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నిజమైన స్వాతంత్రం ఎండా ఎగరయడం మూడు అడుగుల గుడ్డని ఎగరయడం కాదు. ఎవరికీ చేయి చాచకుండా బతకడం ఎస్ అది కావాలంటే నీ నిపుడతలు పెంచుకో నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు ఇంకో ధర్మం ఆశ్రయించుకో నీవఏమిటో నువ్వు రుజువు చెయ్ ఆ రోజులు వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా ఈ దేశం సుసంత్పన్నం అవుద్ది దానికోసం కృషి చేయండిరా బాబు అని అంటే చాలు మీరు మారండి అవినీతిగా ఉండకండి కాదు మీరు మీ గర్వంగా బతికే మార్గం చూడండిరా బాబు ఒకరి మీద ఆధారపడకండి అంటే దానివల్ల అదిఅది అది పాటిస్తే క్రమేణ క్రమేణ క్రమేణ క్రమేణ దేశం బటిష్టం అవుతుంది. వాళ్ళ మీద
(14:48) వాళ్ళు ఆధారపడడం అంటే ట్రంప్ గురించి సుంకాల గురించి మనం ఎందుకు వరీ కావాలంటే వాడు ఏది వేస్తే ఏమి ఒకప్పుడు రాజులు దండెత్తి వస్తే కోటకి తలుపులు వేసేవాళ్ళు లోపలే వ్యవసాయం జరిగేది అవును సార్ పండించుకునేవాళ్ళు పరిశ్రమలు జరిగాయి ఆయుధాలు తయారు చేసుకునేవాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు తర్వాత బయట కలుపు తీసేవాళ్ళు ఇవాళ కోట సంగతి వదిలేయండి మన దేశం ఎంత దరిద్రం అయిపోయిందో చెప్పనా మీకు మన జిడిపి ఒకప్పుడు 40 ఉండేది మన ఉత్పత్తి ఆ మన జీడిపీ లో 40% ఉత్పత్తి ఉండేది 12% పడిపోయింది.
(15:29) అంటే అన్నీ మనం సోప్ మనం తయారు చేసుకోలేమండి ఇదేమన్నా రాకెట్ సైన్స్ సికాయ పెట్టి తల పోసుకోలేమా షాంపూలు కావాలా మనకు అన్నిటికీ ఇంపోర్టే ప్రతి ఒక్కటి ఇంపోర్టే ఫోన్లు మనం తయారు చేసుకునే శక్తి మనకు ఉంది. అక్కడి నుంచి రెండు ప్లేట్లు వస్తాయి స్నాప్ చేసేస్తే మేక్ ఇన్ ఇండియా ఇది మన స్లోగన్ ఇవ్వాళ కాబట్టి యస్ లాంగ్ యస్ యు డిపెండ్ ఆన్ ఇంపోర్ట్స్ యస్ లాంగ్ యస్ యు ఆర్ ఇంపోర్టింగ్ ఎవ్రీథింగ్ ఇవాళ ఆ ఆయిల్ ఉత్పత్తి వాళ్ళు గన ఆపేస్తే దిక్కు ముక్కు లేదు మనకు మనకు గోడంత సూర్యుడు ఉన్నాడు.
(16:04) సౌర విద్యుత్తుని డెవలప్ చేసుకోకుండా ఎందుకు మనం అలసత్వం పాటించాం ఎక్కడ మీ ఆర్ఎండి ఏమైంది మీ ఆర్ఎండి ఆర్ఎండి కి డబ్బులు ఇస్తే విద్యుత్తు దానికి డోకా లేకుండా వచ్చేది పోయింది కదా దానికి కావాల్సినటువంటి ఫ్యూయల్స్ బొగ్గు అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అప్పులు అయిపోయాం మీకు తెలియట్లేదేమో మొత్తం మన దేశంఅంతా అప్పులు పాలైపోయింది.
(16:28) రాష్ట్రాలు అప్పు చేయడం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరిని నెత్తిన కనీసంలో కనీసం ప్రతి ఒక్కరి నెత్తిన 20 లక్షలో 30 లక్షలో ఒప్పుంది మీకు తెలిీదు ఇది మీ బిడ్డల బిడ్డలంతా చెల్లిస్తూ ఉంటారు స్వయం సమృద్ధి లేకుండా ఈ జాతి ముందుకు వెళ్ళలేదు స్వయం సమృద్ధి సాధించాలంటే మన ఆవిష్కరణలు మనకు ఉండాలి మన వస్తువులు మనం వాడాలి ఇంకో దేశం నుంచి తెప్పించుకొని వాడాల్సిన వస్తువులే ఉండకూడదు ఆ రోజుల్లో గాంధీ గారు తగలబెట్టమన్నారే మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితి వచ్చింది.
(17:04) ఏది ఇంపోర్ట్ చేయకూడదు మన వస్తువు మనం వాడాలి మన పళ్ళపొడి మనం వాడాలి ఆ టూత్ పేస్ట్లు అక్కర్లేదు మన మన సొబ్బ అక్కర్లేదు మనకు మన సురిపిండి మనం వాడుకోవాలి మన సీకాయ పొడి మనం వాడుకోవాలి. మన నేతగొడ్డలే మనం కట్టుకోవాలి. ఆ రోజు వస్తే స్వయం సమృద్ధి సాధించినట్టు అప్పుడు మనుషుల్లో ఈ వెంపర్లాట ఈ అవినీతి వీటికి ఇప్పుడు కన్స్ూమర్ పెరిగింది కాబట్టే కదా అవినీతి అప్పుడు ఏమైంది అంటేనండి ఆ రోజుల్లో ఒక కారు జీవితకాలం ఉండేది.
(17:34) ఐదర్ అంబాసిడర్ ఆర్ ఫియట్ కార్ ఫియట్ కార్ 17000 ఇంకోటి 22000 ఇవాళ అప్పుడు ఆ రోజులో కార్ కొనాలంటే ఐదేళ్ళు ఆరేళ్ళు వెయిట్ లిస్ట్ ఒక ఫోన్ కావాలంటే ఇంట్లో ఫోన్ ల్యాండ్ లైన్ 10 సంవత్సరాలు వెయిట్ లిస్ట్ ఉన్నాయి రోజులు ఉన్నాయి. ఇప్పుడు గంట గంటకి ఫోన్ మార్చుకోగలను. కన్స్ూమరిజం పెరిగింది వస్తు ఉత్పత్తులు ఇంపోర్ట్ చేసేసుకున్నాం కార్లు ఏవి కావాలంటే అవి ఫోన్ చేస్తే ఇంటికివచ్చి కార్ వచ్చేస్తుంది.
(18:03) ఇన్ని వస్తువులు వచ్చినప్పుడు మీకు కొనాలని తాపత్రయం పెరుగుద్ది ఇన్ని కొనాలంటే మీ మీన్స్ ఆర్ లిమిటెడ్ మీకు వచ్చే జీతం 50వేలో లక్ష రూపాయలు చాలదు చాలినప్పుడు ఏం చేస్తారు అడ్డదారులు పోతారు. అవినీతి స్టార్ట్ అయిపోద్ది. లంచాలు ఎందుకు వచ్చినాయి వాడికి వచ్చినటువంటి ఆదాయం చాలకపోబట్టి కొనుక్కోవాల్సిన వస్తువులు బజార్లో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అవి చూసి పిల్లలు ముచ్చట పడతారు భార్య ముచ్చట పడతది తను ముచ్చట పడతాడు ఇప్పుడు ఇవాళ రేపు ఎవరు పెళ్ళళ్లు ఇక్కడికి ఇంట్లో చేసుకోవట్లేదు వాడి ముచ్చటలు జరాలు తీర్చాల వాళ్ళ ఇంట్లో పెళ్లి పోయింది గుడిలో పెళ్లి పోయింది
(18:37) డిస్టెంట్ మ్యారేజ్ అట ఏదో డెస్టినేషన్ డెస్టినేషన్ మ్యారేజ్ ఎక్కడి నుంచి వచ్చినాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వెళ్ళిపోతున్నారు సార్ హాయిగా మాచ చిన్నప్పుడు మేము చూసాం సార్ మా పల్లెల్లో పెళ్ళేళ్ళు జరిగితే ఆ గ్లాసులు చెంబు పట్టుకొని వచ్చేవాళ్ళు సార్ వాళ్ళ వాళ్ళ వస్తువులు సెల్ఫ్ సఫిషియన్ సెల్ఫ్ సఫిషియన్ ఆ ధర్మం పోయింది పోయింది ఏం పెళ్లికి ఏదైనా ఇది ఇస్తే అదే చదివిచ్చేవాళ్ళు ప రూపాయలు 10 రూపాయలు ప రూపాయలు చదివిచ్చేవాళ్ళు లేకపోతే ఒక కంసమో గ్లాసో అంటే ఇంటికి పనికివచ్చేటటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు
(19:10) దేనికి పనికిరాని అలంకరణ వస్తువులు ఇస్తా ఉన్నారు అది అది ఇల్లంతా నిండిపోతున్నాయి తప్ప ఉపయోగంలేదు ఉపయోగం ఉండదు జనరల్ గా అంటే మామూలు సహజమైన కుటుంబాల్లో నెలనెల జీతం వస్తుంది హాయిగా సంసారం గడిచిపోతుంది పర్వాలేదు మరి సంసారం గడిచిపోతూ ఉన్న ఈ సమయంలో ఉద్యోగం వదిలేసి ఈ రిస్క్ తీసుకుంటుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా మిమ్మల్ని అలవ చేసింది నాది వ్యవసాయ కుటుంబం చెప్పాను ఊరి దగ్గర నుంచి అన్ని పండుతాయి వస్తాయి ఇంటి దగ్గర నుంచి హైవేస్ వస్తుంది జీతం మీద ఆధారపడి బతకలేదు.
(19:50) ఇంటినుంచి పప్పు ఉప్పు నిప్పు అన్ని వచ్చాయి ఇది ఉద్యోగం పోతే ఎట్లా అన్న వర్రీ లేదు కుటుంబం గడవదు అన్న బాధ లేనే లేదు కాకపోతే నాకు ఇక్కడ జీవితం నచ్చక వెళ్ళిపోదాం అనుకున్నా వ్యవసాయానికి వ్యవసాయానికి పోనీయకుండా నువ్వు ఇంత చదువు చదివి ఇంత మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండి ఇంత దేశం మీద నిబ్బత ఉన్నవాడివి నువ్వు అలా టైం వేస్ట్ చేసుకోవద్దు వ్యవసాయం ఎవడేం చేస్తాడు నీ టాలెంట్ నీ చదువు నీ ఎక్స్పీరియన్స్ నీకున్న అన్నటువంటి కమిట్మెంట్ టు ది నేషన్ నిజాయితి ఇవన్నీ నాకు నచ్చినాయి నేను ప్రారంభించిన కంపెనీ నువ్వు నడుపు కాకపోతే దీంట్లో డబ్బులు లేవు నువ్వు తీసుకొచ్చి పెట్టు అన్నాడు. అది కూడా ఒక
(20:26) ఛాలెంజ్ గా అనిపించింది నన్న ఎటు నన్ను ఒక బాస్ అన్నాడు కదా నువ్వు నీతిగా నడిపి చూద్దాం అని అవకాశం దేవుడు ఇచ్చాడు అనుకున్న తీసుకున్నాను నడిపాను జాతిగా నడిపాను బాగా ప్రూవ్ చేశను. కాకపోతే ఆయన ఆయన బుద్ధి మారింది. డీఫంక్ట్ కంపెనీని ఎఫిషియంట్ కంపెనీగా మార్చిన తర్వాత నన్ను బయటికి పంపించేశడు. పంపించినప్పుడు కూడా నేను మళ్ళీ త్రీ వ్యవసాయమే అనుకున్నా ఉద్యోగం అనుకోలేదు లేదా ఇంకొ ఇండస్ట్రీ అనుకోలేదు అప్పుడు ఈడబ్ల్యూహె్ఓ ఈ హెపటైటిస్ బి క్రైసిస్ మిగతా స్టాల్వర్డ్స్ ఇన్ ఫార్మస్యూటికల్ వాళ్ళఎవరు టేక్అప్ చేయడానికి భయపడి బయోటెక్నాలజీ మాకు తెలియదు మేము చేయం అని
(21:07) వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ తో వాళ్ళు చెప్తే ఏ నాలెడ్జ్ లేనటువంటి నేను మూర్ఖంగా గుడ్డిగా దాంట్లో దూకాను ఎవరు చేయకపోతే నేనే చేస్తాను పౌరుషం కూర్చొని తిరిగాను తెలియక తెలిసి కాదు తెలిసఉంటే మిగతా వాళ్ళలాగా అమ్మో ఇది ప్రమాదమే ఎవరు చేయండి మనట్ట చేస్తాం మన వల్ల కాదు ఇది దీనికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషులు లేరు గవర్నమెంట్ లో దానికి అనుకూలమైన వాతావరణం లేదు బ్యాంకులు దీనికి అప్పు ఇవ్వటం లేదు దీనికి ఏ రకమైనటువంటి రాయితిలు లేవు ఇది ఏమవుద్దో తెలియదు మనకు టెక్నాలజీ లేదు ఎట్లా చేయగలం అని చెప్పి భయపడి పక్కకు వచ్చి ఉండేవాడిని నాకు ఏమీ
(21:43) తెలియదు కాబట్టి ఇగ్నోరెన్స్ ఈస్ మై బ్లిస్ ఆ అమాయకత్వంలో దిగేసాను సంకల్పం శుద్ధమైంది కాబట్టి సిద్ధించింది. ఆ నేను అంటున్నది అటువంటి ఆ పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు మీకు సహకరించినయా ఇంట్లో సహకరించారంటే అయ్యా అందరూ సినిమాలో చూపించినటువంటి పాతివృత్యంతో నాదా నువ్వు ఏం చెప్తే అదే నాకుని ఎవరు అనరు ఏ భార్య అనదు ఏంటండీ ఏంటి మీరు అని అంటారు పట్టించుకునే వాడిని కాదు నా పాటి నేను చేసుకుంటూ పోయాను ఆమె వెనక్కి లాగడానికి ప్రయత్నం చేసేపోంది బాణం వెనక్కి ఎంత లాగితే అంత వేగంగా ముందుకు వెళ్ళిపో అట్లాగే వెళ్ళాను నేను ఆమె
(22:22) వీళ్ళు వినడికినా సరే పదా ముందు అంటది జాగ్రత్త అఫ్కోర్స్ తప్పుతారు వెళ్ళలేదు ఏం చేస్తారు మా అమ్మ నాన్న మా అబ్బాయి ఏమైనా ఆలోచించే చేస్తాడు వాళ్ళ భరోసా మా ఆవిడ సంసారం నడిపేదాని కాబట్టి పిల్లలు ఎదుగొస్తున్నారు నువ్వఏంటి ఇంకా నాది ధర్మం అనిపించింది చేస్తాను చేశను ఒప్పుకుంది నడిచింది నాతో కూడా అన్ని ఆ నా వెంచర్స్ కి ముందు వెనక్కి లాగిన నిజం బట్టి మళ్ళీ నా వెనక నడిచింది కదా సంసా మేమ ఇంకా విడిపోలేదు కదా హాయిగానే ఉన్నాం కదా 60 ఏళ్ళు సంస్కారం చేసాం 54 ఏళ్ళు పెళ్లి అంతకుముందు ఆరేళ్ళు మా మేనత్త కూతురే కదా నాతో పాటు ఉండేది
(23:04) అందువల్ల ఏంటంటే 60 ఏళ్లుుగా మేము కలివిడిగానే ఉన్నాం. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అవి ఉంటాయి సార్ కామన్ ఏ ఎంత పెద్ద అన్యోన్యమైన దాంపత్యమైనా నేను తందాన అంటే తాన తందాన అని అనాల్సిన అవసరం లేదు. నేను సరిగమప అంటే పదనిసా అని చెప్పి ఆమె అన్న ఉండొచ్చు అయినా స్వరం కుదిరింది కలిసి నడిచింది సార్ మీరు అనేక పుస్తకాలు రాశారు అనేక పుస్తకాలు ముద్రించారు అనేక సాహిత్యంలో సంగీతంలో అఫ్కోర్స్ మీకు మంచి ఇది ఉంది.
(23:43) కానీ నేను మీ ఆ జీవితానికి సంబంధించిన మీరు రాసిన పుస్తకాలు చదివినప్పుడు నాకు కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి సార్ ఇప్పుడు మీ మేనమామగారు ఒకాయన ఆయన దగ్గరనే మీరు చదువుకున్నారు కమ్యూనిస్ట్ ఆయన అంటే నిరీశ్వరవాది అమ్మగారా పూర్తి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడిచే తల్లి మరి ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ భావజాలంలోకి ఇదయ్యారా లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి అసలు ఈ కాంట్రవర్సీని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు నిజానికి ఆధ్యాత్మికత కమ్యూనిజం అంటే రెండు భిన్న కోణాలు కావు భిన్న ధ్రువాలు కావు అంతర్లీనంగా రెండు ఒకటే
(24:28) ఆధ్యాత్మికతలో మనం ఏమి నేర్చుకుంటామో ఏది ప్రాక్టీస్ చేస్తామో ఏది ఉపాసిస్తామో నిజమైన కమ్యూనిజంలో కూడా అదే కమ్యూనిజం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అరాచక శక్తుల నుండి శ్రామిక శక్తులను కాపాడడం కోసం వచ్చింది. మన పురాణ పురుషులందరూ రాక్షసు సంహారం చేయడానికి పుట్టుకొచ్చారు అవతారాలు తీసుకున్నారు. సర్వమానవ శ్రేయం సర్వజీవ శ్రేయం అదే నిజమైనటువంటి మానవతావాదం దానికోసమే కమ్యూనిజం పుట్టింది.
(25:02) నిజానికి దాని పేరు హ్యూమనిజం అని పెట్టి ఉండాలి. ఆ రోజుల్లో ఎందుకో కమ్యూనిజం అని పేరు వచ్చింది అది పుట్టి గడ్డగట్టింది రష్యాలో మార్క్సిజం మ్ కార్ల్ మార్క్స్ ఏంజెల్స్ వాళ్ళు ఈ వ్యవస్థలో ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఈ భూస్వామ్య వ్యవస్థ శ్రామిక వర్గాన్ని దోపిడి చేసే వ్యవస్థ రాచరికపు వికృత చేష్టలు వాటిని ఎదిరించడానికి పుట్టుకొచ్చిన సిద్ధాంతం అది బహుశా ఆధ్యాత్మికంలో కూడా అదే వాళ్ళేదో అడవిలో యజ్ఞయాగాదులు చేసుకుంటుంటే రాక్షసులు ఆ యజ్ఞాలని విఫలం చేయడానికి రావడం వాళ్ళని వీళ్ళు సంహారం చేయడం ఇది రెండు ఒకటే దేవుడు ఏం చెప్తాడు దయ క్షమ సహనం ఓర్పు సౌజన్యం సౌశల్యం ఇన్ని ఆ ఇన్ని ఉంటే దైవీ
(25:50) గుణాలు అవన్నీ ఉండాలి అని అనుకుంటాం కమ్యూనిజం లో కూడా అదే కానీ అవన్నీ ఉన్నాయా కమ్యూనిజంలో నిజమైన కమ్యూనిజంలో అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ మతం కూడా సైద్ధా ాంతికంగా గొప్పదనఅండి దాన్ని ఆచరణలో తీసుకొచ్చినప్పుడు అవకాశవాదులు అనుకూల పద్ధతిలో వెళ్లి దానికి మరకలు అంటిస్తారు ఇవాళ హిందూ మతంలో అన్ని సవ్యంగానే సాగుతున్నాయా లేదు కదా అనేక భిన్న ప్రవృత్తులు వచ్చినాయి ఆదిశంకరుల నాటికే అనేక రకాల వాదాలు పిడివాదాలు వస్తే వాటిన్నిటిని ఆయన పరిష్కరించుకుంటూ వచ్చారు వాదోపవాదాలు చేసి ఏకీకృతం చేశారు వ్యవస్థీకృతం చేసి పీఠాలు పెట్టారు అంటే ఆ
(26:29) రోజుల్లోనే ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. అందరినీ ఒకే తాటి మీద నడిపించడానికి అందరిది హిందూ మతమే కానీ భిన్న ప్రవృత్తులు కమ్యూనిజం లో కూడా ఒరిజినల్ సిద్ధాంతం సర్వమానవ శ్రేయం అందరూ ఒకటే అందరూ సమానం దేవుడి దృష్టిలో ప్రతి జీవి సమానం అని చెప్పారు. అదే కార్ల్ మార్క్స్ ఏంజెల్స్ కోరుకుంది. రాచరకపు వికృతపు చేష్టల్లో శ్రామికుల్ని దోచేశారు.
(26:53) వాళ్ళ రక్తం పిండుకొని తాగేశారు. కానీ ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది కదా సార్ అది అది ప్రాక్టీస్ లేదని నేను అనలేదు. అది జరగకపోతే అది సిద్ధాంతం తప్పు కాదు సిద్ధాంతాన్ని ఆచరించేవాడు తప్పు ఆ సిద్ధాంతం ముసుగులో కమ్యూనిస్టులు నియంత్రులు అయిపోయారు. ఆ నియంతృత్వ ధోరణి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది సార్ 11 కోట్ల మంది చంపబడ్డారు సార్ అవును అవును ఇలా చంపుకుంటూ పోతే అంటే హావ్ సెండ్ హావ్ నాట్స్ ఇది కదా బేసిక్ సిద్ధాంతం ఇట్లా చంపుకుంటూ పోతే ఎవడు మిగులుతాడు దానికి వాళ్ళు తీసుకున్నటువంటి లైన్ ఏమిటంటే ఆనాడు హింసా ప్రవృత్తి ఏరియ అని కానీ అది
(27:35) సొల్యూషన్ కాదు మళ్ళీ పుట్టుకొస్తారు ఆ మానవ ప్రవృత్తిలో మార్పు తీసుకురాగలిగినటువంటి సత్తా కలిగిన బోధకులు అవధూతలు లేకపోయారు. ఒక మనిషిలో ఒక మార్పు తీసుకురావాలంటే కత్తితో రాదు ప్రేమతోనే వస్తుంది. ఆ ప్రేమకు చాలా ఓర్పు చాలా సహనం చాలా సమయం పడుతుంది కొన్ని తరాలు దానిమీ కృషి చేస్తే అనుకున్నటువంటి ఆ సహోజినియస్ వాతావరణం ఏర్పడుతుంది.
(27:59) చంపేస్తే నీచుడు పోతాడుఅని చెప్పి అనుకుంటే ఒక్కరోజు కానీ రెండో రోజు ఇంకో సైనికుడు ఇంకొక దరిద్రుడు పుట్టుకొస్తాడు. మనుషుల ప్రవర్తనలో మార్పు వచ్చి ఆ dఎన్ఏ కంటిన్యూ అయితే సమాజమే ప్రశాంతంగా ఉంటుంది అది లేనప్పుడు ఇదే జరుగుద్ది కానీ అటువంటి సమాజాన్ని ఊహించగలమా ఆలోచించండి ఊహించొచ్చు ఏదైనా ఊహించొచ్చు ఆచరణకు రావడానికి సమయం పడుతుంది దాన్ని మళ్ళీ ఎవరో అవధూతలు పుట్టుకొస్తారు ఇగో పురుషులు వస్తారు జరుగుతాయి ఇప్పుడు మా అమ్మ సిద్ధాంతం అందరూ బాగుండాలని కోరుకోరా లోకా సంస్థ సుఖనోభవంతో అని చెప్పింది మా మామ కూడా చెప్పింది అదే అందరూ ఒకటేరా మనకు
(28:34) వాళ్ళు తక్కువ ఎక్కువగా చూడకు వీళ్ళు ఎక్కువగా చూడకు పంక్తి భోజనాలు పెట్టేవాడు మా ఇంట్లో మాలా మాదిగా ఎవరైనా రావచ్చు అని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు మామ చెప్పింది అదే ఈయన చెప్పింది అదే నాకేం తేడా కనపడలేదు. కాకపోతే అది వేరే వేరేగా కనిపిస్తాయి దేవుడు లేడు మనిషిలోనే దేవుడు ఉన్నాడని కదా మన సిద్ధాంతం శంకరుడు సిద్ధాంతం అదే కదా అద్వైతం అంటే ఏమిటి ఆయన వేరు నువ్వు వేరు కాదు నీలోనే ఉన్నాడు దేవుడు మరి ఆయన చెప్పేది కూడా మా మేమ చెప్పింది కూడా ఆయనలో ఆయన ఒకడే నువ్వు ఒకడే వేరు కాదురా ఆయన నువ్వు ఒకటే రెండు కాదు అన్నాడు ఆయన ఆయన
(29:09) తెలియకుండానే ఆయన అద్వైతం మాట్లాడాడు మా అమ్మ తెలిసి అద్వైతం మాట్లాడాడు తెలియక ఈయన తెలిసి ఆమె ఇద్దరు ఒకే అద్దం ప్రతిబింబాలయి నాకేం తేడా కనపడలేదు కాకపోతే సమయాన్ని దేవుడి గదిలో కూర్చొని మంత్రాలు జపాలు చేయకు క్షేత్ర స్థాయిలో పోయి పని చేసిప మందికి సహాయం చేయ అని చెప్పాడు ఆ పాయింట్ నాకు నచ్చింది అది తీసుకున్నా మా అమ్మ చెప్పింది కేవలం భగవంతుడిని మెప్పించడానికో ఆయన్ని మురిపింప చేయడానికో మంత్రాలు చదవకు ఈ మంత్రాల్లో ఒక రకమైన శక్తి ఉంది ప్రశాంతత వస్తుంది మనసుకి జపం చేసుకో ధ్యానం చేసుకో స్తోత్రాలు చదవక్కలేదు అదేదో మేము చూసుకుంటున్నాం ఇది ఫస్ట్ స్టెప్ే
(29:50) ఎలిమెంటరీ హైయెస్ట్ స్థితి ఏమిటంటే కృతజ్ఞత చెప్పుకోవడానికి పూజ అనేది కేవలం కృతజ్ఞత కోరికలు కోరడానికి కాదు పూజలో నీవు నివేదిస్తావు ఏమని నాకు ఇన్ని ఇచ్చాం ఊపిరి తీసుకోగలుగుతున్నాను వదలపట్టగలుగుతున్నాను ఆహారం తీసుకోగలుగుతున్నాను జీర్ణించుకుంటున్నాను శక్తిగా మార్చుకుంటున్నాను వ్యర్థాలు వదిలేస్తున్నాను ఆయగా నిద్రపోగలుగుతున్నాను.
(30:15) లేచి నిలబడగలుగుతున్నాను 10 మందికి సహాయం చేయగలుగుతున్నాను మంచి సుందర దృశ్యాలు చూసే చూపిచ్చావు శ్రవణపయమైన సంగీతం వినే చెవులు ఇచ్చావు స్పర్శానుభూతి ఇచ్చావు అన్నీ ఇచ్చావుని పుస్తకం చెప్పడం ధ్యానంలో నిన్ను నువ్వు వింటావు నువ్వు మాట్లాడవు వింటావు లోపలన్న జీవుడు మాట్లాడుతాడు జీవుడు దేవుడు విడిపోయినటువంటి రెండు ఒకే తాను ముక్కలు దాని ధ్యానంలో వింటావు ఇదే ఆ మామ చెప్పింది ఆయన చెప్పింది ఏమిటి సర్వశ్రేయసు కోరుకున్న నువ్వు క్షేత్ర స్థాయిలో పని చెయ అన్నాడు.
(30:46) చేసిన నాకు అరసట వచ్చినప్పుడు ధ్యానం చేసుకుంటే తప్పేంటి నేను ఏం చేస్తానో ఆయనకు తెలియదు నేనేం పూజలు చేశ దాన్ని చూడలేదు కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకునేవాడిని ధ్యానం అంటే దేవుడే కాదు మనసు నిశ్చలం చేసుకోవడం ప్రాణాయామంతో ఆయన తెలిసేది కాదు అటు ఆయన సంతృప్తి పడ్డాడు మామ సంతృప్తి పడింది. నేను రెండిటికీ సమన్వయం చేసుకోగలిగాను అది అది అది అందువల్ల అది వేరు ఇది వేరు నేను అనుకోవటం లేదు వెరీ గుడ్ సార్ సార్ థాంక్యూ కొంచెం సేపు మీ అంటే అఫ్కోర్స్ ఇది మీ పర్సనల్ ఇది మీ వ్యాపార సంబంధమైన విషయానికి వస్తే మిమ్మల్ని ఆ మిమ్మల్ని మీరు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగానే మీరు
(31:29) కోరుకుంటారు భావిస్తూ ఉంటారు ఆ రకంగా ఉండాలని కోరుకుంటాను ఉన్నారో లేనో అప్పటికే భవిష చేసుకుంటాను తెలియకుండానే మనం ఆ స్థితికి దాటి నేను ఇండస్ట్రిలిస్ట్ ని అన్న అహంకారం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ రకమైన అభిప్రాయం వస్తుందో నేను ఇండస్ట్రిలిస్ట్ అన్న భావన కలిగితే ఇండస్ట్రలిస్ట్ అంటే ఏమిటి చాలా అసెట్స్ పోగేసుకున్నటువంటి ఒక పారిశ్రామిక దిగ్గజం ఔత్సాహిక అంటే నిత్యం వెంపర్లాడి ఇంకా ఏదో చేయాలని తపనల్లో ఉండేటటువంటి వాడు వాడే రిస్క్ తీసుకోగలడు.
(32:01) వాడే ఏదైనా ఆవిష్కరణలకి ముందుకు అడుగు వేయగలడు. ఈ సమాజానికి అవసరం ఇలా కష్టం అని ఇష్టం చేద్దాం అని ముందుకు వెళ్ళగలిగినవాడు ఔత్సాగి పారిశ్రామిక వేత్త నేను పారిశ్రామిక వేత్తని అయిపోయాను అనుకున్నవాడు నాకు ఇంత పేరు వచ్చింది ఇంత డబ్బులు ఉన్నాయి ఇంత అసెట్స్ ఉన్నాయి మళ్ళీ కొత్త దాని మీద పెడితే డబ్బు త్రీ వస్తో లేదో నాకున్న పేరు పోతుందేమో ఒకవేళ అపజయం జరిగితే అరే వర్క్ సారా రెడ్డి ఫెయిల్ అయ్యాడు అని చెప్పి అనుకుంటారేమో అని భయం ఉంటుంది.
(32:26) అందుకని నాకు అది ఇష్టం లేదు. ఔత్సాహిక పారిశ్రామిక వ్యక్తగానే ఉండాలి నా కోరిక కారణం అది శాంతా బయోటిక్ అనంగానే ఆ హెపటైటిస్ బి కానీ మీరు అదిఒక్కటేనా లేకపోతే ఇంకా ఏమన్నా చేశారా అదే స్ఫూర్తితో ఏదైతే ఆ వ్యాక్సిన్ చాలా వికృతమైన ఖరీదులో ఉన్న రోజుల్లో ఆ భారతదేశంలో లో పిల్లలకి మన ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే అవకాశం లేకపోయింది. అంత ఖరీదైన వ్యాక్సిన్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఫారెన్ ఎక్స్చేంజ్ కావాలి ఆనాటి పరిస్థితి 9293 లో 1992 93 లో మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విదేశీ మారక ద్రవ్యం చాలా తక్కువ ఉండేది. ఆ భారం భరించలేక ప్రభుత్వం
(33:11) చేతులఎత్తేసింది పిల్లలకి వ్యాక్సిన్ ఇంపోర్ట్ చేసి ఇవ్వలేదు. ఇవ్వకపోయినందువల్ల 45 మిలియన్లు పిల్లలకి వ్యాధి సోకింది చనిపోతున్నారు. అది ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా గర్హించింది విమర్శించింది. మనల్ని తూష్ణీ భావంతో మాట్లాడింది కూడా మీరు పిల్లల్ని కాపాడుకోకపోతే మానించి ఏ రకమైనటువంటి సలహా సంపతింపులు సపోర్ట్ సిస్టం ఉండదు అని బెదిరించారు.
(33:41) అప్పుడు చేయవలసి వచ్చింది కాబట్టి చేశాను. అదే స్ఫూర్తితో అది చేసింది ఏమిటి తక్కువ ఖరీదుకి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ తో నిమిత్తం లేకుండా రూపాయల్లోనే లోకల్గా దొరికేట్లుగా చేయడం ఖరీదు తక్కువలో చేయడం ఎంత తక్కువ 100 డాలర్లు ఉండే వ్యాక్సిన్ ఒక డాలర్కి చేయడం ఒక డాలర్ 100 డాలర్ ది ఒక డాలర్ కే అంటే రూపాయలో మాట్లాడితే అప్పుడు 1200 రూపాయలు ఉండేది1 రూపాయలకే చేయాలి నేను 50 రూపాయలకే ఇచ్చాం.
(34:10) తర్వాత తర్వాత రోజుల్లో 25 రూపాయలకే ఇచ్చాం. అదే స్ఫూర్తితో అనేక రకాల ఔషధాలు వ్యాక్సిన్లో 14 చేశం వాటి అవన్నీ పాండవులు అనగానే ముందు అర్జునుడు గుర్తొస్తారు కానీ ధర్మరాజు ఉన్నాడు భీముడు ఉన్నాడు నకుడు ఉన్నాడు సగదేవుడు తెలియదు కాబట్టి ఐ మీన్ హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు బ్లడ్ క్లాస్ స్టెప్టోకైనస్ అవన్నీ కూడా చేసాం 6000 రూపాయలది 150 రూపాయలక ఇచ్చాం ఇంటర్ఫెరాన్ ఆల్ఫా క్యాన్సర్ డ్రగ్స్ కి ఇస్తారు అది కూడా 5000 రూపాయలు ఎవ్రీ వీక్ ఒక డోస్ ఇవ్వాలి అట 40 50 వారాలు ఇవ్వాలిఐ 5000 ఒక్కొక్క డోసు ఎంతమంది భరించగలరు అది కూడా 200 రూపాయలకే ఇచ్చాం 5000 ది ఈ రకంగా మేము
(34:50) ఉంచుమించుగా కానీ ఇక్కడ నాకు ఒక చిన్న ఇది సార్ మార్కెట్ లో పర్సెప్షన్ ఎలా ఉందంటే రేట్ తక్కువ అనింటే క్వాలిటీ తక్కువ అన్న పర్సెప్షన్ చీప్ అండి అది చీప్ ప్రొడక్ట్ అండి అప్పుడు అప్పుడు దాన్ని మీరు ఎలా కౌంటర్ చేయగలరు అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు ఫేమస్ వైద్యులు వాళ్ళ పేరు చెప్తే బాధపడతారు వాళ్ళంతా నా స్నేహితులే అది మూసి వాటర్ అదేం పని చేయదు అని ఎందుకంటే అది 1200 రూపాయలు వీడేమో 20 రూపాయలు ఇస్తాను అంటున్నాడు. అది పని చేసేది కాదు అన్నారు.
(35:19) మా కాంపిటీటర్ మల్టీనేషనల్ వాడు ఉత్తరాలు కూడా రాసేసాడు డాక్టర్లకి డోంట్ టెస్ట్ యువర్ బేబీస్ విత్ దిస్ ఇండియన్ వ్యాక్సిన్ ఇట్ విల్ హామ్ యువర్ బేబీస్ యుఆర్ కిల్లింగ్ యువర్ బేబీస్ అని రాశారు. ఇది ఆపండి అని నేను డ్రగ్ కంట్రోల్ దగ్గరికి వెళ్లి చెప్పాను. వాడు వాళ్ళ ఉప్పు తిని ఉంటాడు బహుశా అది కార్పొరేట్ వార్స్ నాకు సంబంధం లేదు యు డీల్ విత్ దెమ అన్నాడు.
(35:45) భగవంతుడు సహాయం చేస్తాడు ఆలోచన ద్వారా కూడా అది మీకే ప్రాబ్లం అండి అది వెల్ టెస్టెడ్ కాదని రాశారు వాళ్ళు టెస్ట్ చేయకుండా మీరు వ్యాక్సిన్ నాకు పర్మిషన్ ఇచ్చారా లైసెన్స్ ఇచ్చారా మీ మీద అపవాదు కదా అది మీరు టెస్ట్ చేసే కదా నాకు ఇచ్చారు వాడు అనడం ఏమిటి నాట్ వెల్ టెస్టెడ్ అంటున్నాడు అప్పుడు ఉలికి పడ్డాడు ఏం చేయాలి ఇప్పుడు ఆ వ్యాక్సిన్ ని మా వ్యాక్సిన్ ని కంపేర్ చేద్దాం తెలిసిపోతుంది కదా మాది బూసి వాటరా నిజమైన వ్యాక్సిన్ అని టెస్ట్ చేశారు ఆరు సెంటర్స్ లో వాళ్ళకన్నా మా వ్యాక్సిన్ చాలా చాలా చాలా మేలని రిపోర్ట్లు వచ్చినయి. అప్పుడు అమెరికాలో ఒక
(36:24) వ్యాక్సిన్ మ్యాగజైన్ ఒక అథారిటీ వాళ్ళు పబ్లిష్ చేశారు అద్భుతమైన వ్యాక్సిన్ ఇండియా నుంచి చిన్న కంపెనీ నుంచి వచ్చింది. ఇది మూడు డోసులు కూడా వేసుకోక్కర్లేదు రెండు డోసులకే సరిపోతుంది అని మా గురించి రాసినప్పుడు మాకు ఇంటర్నేషనల్ గా పేరు ప్రతిష్ట ఆ క్రైసిస్ మాకు ఒక అపర్చునిటీగా అయింది అలవాట అయింది 10 మందికి శాంత యొక్క నిపుడత ఎఫికసీ అవన్నీ తెలిసివచ్చినయి వాడు ఆ నింద వేయకపోతే తెలిసేది కాదు అంతే కదా అఫ్కోర్స్ ఇప్పుడు మీరు పరిశోధన చేయించారు ఆ రిపోర్ట్స్ బయటకి వచ్చినయి అది మొత్తం ప్రపంచానికి తెలియాల అనిఅంటే అంటే తెలిసింది కదా ఆ వ్యాక్సిన్ మగజన్
(37:04) పబ్లిష్ చేసింది కదా చేసిందా చేసింది కాబట్టే తెలిసింది అందరికి లేకపోతే ఎట్ట తెలుస్తుంది రైట్ రైట్ రైట్ రైట్ దాని తాలు అది జరిగిన తర్వాతనే ఇంటర్నేషనల్ మార్కెట్ లో మాకు పేరు వచ్చాక 70% ఆఫ్ ది గ్లోబల్ రిక్వైర్మెంట్ మేమే సప్లై చేశం మా పేరు ప్రతిష్ట విపరీతమైన మార్కెట్ అన్నీ వచ్చినయి ఆ క్రైసిస్ వల్ల సో క్రైసిస్లు అనేవి ఏంటంటే ఒక అపర్చునిటీగా కూడా చూడాలి.
(37:29) ఒక కష్టకాలం వచ్చిందంటే కష్టకాలం వచ్చింది పాండవులకి ఏం చేశారు ఆ కష్టకాలంలో పరిపాలించాల్సిన అవసరం లేదు సమయం ఉంది కాబట్టి తపస్సులు చేసుకొని పాశుపత్తి వస్తాలు సంపాదించుకున్నారు ఒక్కోరు ఒక్కో రకమైన ఆయుధాలు సంపాదించుకున్నారు వాళ్ళ నిపుణతలు పెంచుకున్నారు స్కిల్ సెట్స్ పెంచుకున్నారు అంతే కదా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాటిల్లో ఉద్యోగం చేశారు.
(37:55) ఈ ఉద్యోగాల్లో మీరు పడ్డ మానసిక స్థితిని మీ పుస్తకాల్లో ఆవిష్కరించారు. ఆ అటువంటి పరిస్థితిని అంటే మీరు అవన్నీ అవగాహన ఉన్నాయి మీకు అక్కడ జరిగేటటువంటి ఆ ఏదైతే అవినీతి ఇవన్నీ మీకు అవగాహన ఉన్నాయి. అవినీతి అని అంటే సరే అవినీతి గాని వాటికి నచ్చలేదు వాళ్ళ ధోరణి వాళ్ళ పద్ధతి వాళ్ళ ప్రాధాన్యాలు వాళ్ళ కార్యశీలత నాకు నచ్చలేదు. నా సమయాన్ని నా జన్మని వేస్ట్ చేసుకుంటున్నా అనిపించా కదా మీరు అటువంటి పరిస్థితుల్లో మీరు ఒక ఇండస్ట్రీ పెట్టి మళ్లా అటువంటి రుచ్చులోకే దిగాలని ఎందుకు అంటే ఐ మీన్ ఆ నన్ను నేను చివరగా గవర్నమెంట్ లో పనిచేసింది
(38:43) రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి శాఖ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్కడ మా బాధ్యత ఏమిటంటే ఎవరైనా ఎంటర్ప్రనర్ వస్తే వాడికి సహాయం చేసి ఆర్థిక సహాయం చేసి వాడు కొంత పెట్టుబడి పెడితే వాడికి మ్యాచింగ్ పెట్టుబడి మేము కూడా ఇచ్చి ఆ ఇండస్ట్రీ నడపమని చెప్తాం. అది వాళ్ళు సరిగ్గా చేసేవాళ్ళు కాదు వాళ్ళు కొంచెం మాయలు మర్మాలు చేసేవాళ్ళు డిఫరెంట్ బ్యాలెన్స్ షీట్లు కిట్టిచ్చి రాసేవాళ్ళు దాన్ని నేను అబ్జెక్ట్ చేసేవాడిని ధర్మంగా లేదు తినేస్తున్నారు డబ్బులు మనం ఇచ్చిన డబ్బుని సరిగా వినియోగించట్లేదు.
(39:18) భోక్తలు అయిపోయారు అని చెప్పని కంప్లైంట్ చేసేవాడిని మా బాస్ చూసి చూడనట్టు పోరాదు ఎందుకు అన్నిటికీ గొడవ పెడతావు అనేవాడు ఇంత నిబ్బద్ధతగా కష్టం వాళ్ళ ఇండస్ట్రీ చేయలేరు అనేవాడు ఎందుకు చేయలేరు అంటే చేసి చూద్దాం నీ వల్ల అవుద్దా ఏదో కొంత అవినీతి తప్పదు అన్నట్టుగా అనేవాడు ఆయన అప్పుడు బయటిక వచ్చి నేను చేస్తానండి అవినీతి లేకుండా చేయ నేను అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ఎదుర్కొని ఉంటారు కదా సార్ ఎదురుకున్నాను కాబట్టే నాకు చాలా నష్టపోయాను ఇప్పుడు బయటికి వచ్చేసాను అవినీతి అనేది చేయకూడదు అనుకున్నాను లంచం అనేది ఇవ్వకూడదు అనుకున్నాను. నాకు నా
(39:53) పర్మిషన్లు నా లైసెన్సులు అన్నీ ఆలస్యం అయిపోయినాయి. ఏది సమయానికి రాలేదు నేను లంచం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దాని తాలూకు శాఖ నాకు బాగా తగిలింది నిలబడ్డాను వదిలేయలేదు. నిలబడ్డాను కాబట్టే నష్టపోయినా కొంత కాలం తర్వాత అయినా అర్థమైంది వరప్రసాద్ దగ్గర నుంచి ఒక్క రూపాయ రాదు. అతను ఈ పద్ధతిలో ఉండడు.
(40:18) అర్థం చేసుకున్నాక వాళ్ళు కూడా ఇక ఈ వీడితో వీడితో లాభం లేదు ఏదో చేసేయండి దానికి అనే పరిస్థితి తీసుకొచ్చుకున్నాను అయితే నిజాయితీగా నేను ఎవ్వరికీ ఇవ్వలేదని చెప్తానే కానీ మావాళ్ళు నా కింద ఉన్నవాళ్ళ నేను లేనప్పుడు త్వరగా పనులు చేసుకోడానికి ఇచ్చిఉంటారని నాకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది అచఛ ఆ వచ్చింది వచ్చినప్పుడు మనం ఏం చేయలేం ఇప్పుడు ఏం చేయగలం నీకు ఎంతవరకు మీ పని నేను ఎంత కాపలా కాయలేను కదా ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్లి ఏ వాడికి లంచం ఇస్తున్నావా వీడికి ఇస్తున్నావా ఆయన అడగలేదు కదా ఇవ్వడానికి వీలు లేదని చెప్పాను ఇవ్వలేదు కొన్ని పనులు జరగలేదు నేను భరించగలని చెప్పి ఊరుకున్నాను.
(40:53) వాళ్ళు ఊరుకున్నారు నేను చూస్తున్నప్పుడు నేను లేనప్పుడు నేను ఎక్కడో టూర్లో ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ఆయన చాదస్తుడు జరగదు మన పని అయిపోవాలని చెప్పి రూపాయి ఇచ్చి ఎంచుకున్నారేమో ఎంచుకున్నారని నాకు ఎవరో ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎవరు ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయి వర్ప్షా గారు మీరు నడిపారు గానీ మీ శిష్యగణం కొంత అన్నారు అంటే నిజమా అన్నారు సరే మీ దాకా చెప్పడం ఎందుకులే అనుకున్నా కానీ చెప్తున్నాను జరగవండి మీరు అనుకుంటారు కానీ నేను జరుపుతున్నాను కదా మీరు జరుపుకున్నారు మీవాళ్ళు జరపలేకపోయారు కదా అని అన్నాడు ఆయన సో ఇట్ హస్ బికమ్ ఏ కామన్ ప్లాట్ఫామ్ అది
(41:32) ఏమవుతుందంటే తులసి వనంలో గంజాయి మొక్కలు ఒకటి రెండు ఉంటే ఏరియ చేయచ్చు అసలు గంజాయి వనం తులసి ముక్కలు ఉంటే ఏం చేయాలి కష్టం సార్ మీరు ఆ వచ్చింది ఒక ఐ మీన్ రైతు కుటుంబం నుంచి అంటే మామూలుగా ఆ జనరల్ గా ఏమంటారంటే ఉదర పోషణార్థం బహుకృత వేషం అంటారు. రైతు కుటుంబం నుంచి వచ్చినవా మీకు ఉదర పోషణార్థం అని నేను అనుకోవడంలే ఇది ఈ ఈ ఫేజ్ లోకి రావడానికి మీరు మీ ఆలోచన విధానం ఎలా నేను దీనికి రావాలని అనుకోలేదండి
(42:17) నేను బిఎస్సీ వరకు చదివిన వరకు నాకు అంత ఊహా జ్ఞానం ఏమి లేవు బిఎస్సీ చదువుతున్న రోజులోనే మా ఇంకొక మేనమామ ఆయన సంస్కృత పండితుడు ఆయన దగ్గర చాలా ప్రాచీన వాంగ్మయం అంతా ఉండేది. అవి చూసి హాయిగా ఈ పద్యాలు ఈ శ్లోకాలు ఈ కావ్యాలు ఈ ప్రబంధాలు ఈ వర్ణన ఇవన్నీ చదువుకుంటే సరిపోద్ది కదా హాయిగా ఉంది ప్రాణం వ్యవసాయం చేసుకుంటాం వ్యవసాయం అండి ఇప్పుడు మూడు మూడు కాలాల్లో పంటలు వేస్తున్నారు ఆ రోజుల్లో ఒక్క పంటే నెల్లూరు వైపు మొలగొలుకులు అది ఒక్క పంట ఆరు నెలల పంట అది ఆరు నెలలు ఏడు నెలలు అసలు ఇప్పుడు పూర్తిగా మాయమైపోయింది ఏడు నెలల తర్వాత ఐదు నెలలు ఖాళీయే కదా
(42:57) హాయిగా చదువుకోవచ్చు అనుకున్నాను కానీ కాన బీస తర్వాత మా మేనమ నన్ను పెంచిన మేనమ నువ్వు చదువుకోనావాలి నువ్వు దేశం పునర్నిర్మాణ పరిస్థితిలో ఉంది ఇంజనీర్లు కావాలి దేశానికి బో ఇంజనీరింగ్ కాలేజీ కి అన్నాడు నాకు ఇష్టం లేదు అంటే బలవంతంగా పంపించాడు. బలవంతంగా పంపించాక చదివాను చదివిన ఇంజనీరింగ్ ని ఖాళీగా పెట్టలేను కదా ఉద్యోగం తప్పనిసరిగా చేయాలి నువ్వు దేశానికి సహాయం చేయాలా అని అన్నాడు.
(43:27) అది కూడా నాకు ఇష్టం లేకుండా చేరాను చేరిన తర్వాత అక్కడ పరిస్థితులు బాగాలేవు ఏడేళ్ళు చూశను నా వల్ల కాలేదు మారాను మళ్ళీ అక్కడ చూసాను ఏడేళ్ళు ఆరున్నర సంవత్సరం మా పరిస్థితులు నచ్చలేవు ఇంటికి వెళ్ళిపోయి వ్యవసాయం చేద్దాం అనుకున్నాను మళ్ళీ వ్యవసాయంకి మాకు ఉంది కదా పొలం అంతా ఆ టైంలో ఒకాయన నన్ను మళ్ళీ లాగాడు పంగయ్య హైదరాబాద్ బాడ్వర్డ్ బ్యాటరీస్ దాంతో ఎంట్ర్ప్రనర్ అయ్యాను సో ప్రభుత్వానికి మీరు ఏం సజెస్ట్ చేస్తారో చివరిగా ఈ ప్రశ్నతో ప్రభుత్వం చెవులు లేవు కళ్ళు లేవు దానికి నేనేం చెప్తానండి సార్ కొంచెం ఎప్పుడైనా రంద్రాలు చేసి వినిపించడానికి
(44:08) ప్రయత్నం చేద్దాం సార్ చాలా అది నిష్కృతి లేనటువంటి ప్రయత్నం సార్ మీలో మామూలుగా చాలా కోపం కొన్ని చోట్ల చాలా కోపాన్ని కూడా మీరు ప్రదర్శిస్తారు ఇప్పుడు లేదండి నేను దాన్ని అధిగమించాను నాకు 77 ఏళ్ళు ఇప్పుడు కోపాన్ని వదిలి కుబసం వదిలి వదిలేసి నేను చాలా ప్రశాంతంగా ఉడద ఉంచుకున్నాం మీరు కాలేజీలో మీరు రాగింగ్ చేసేటప్పుడు ఆడి బళ్ళడ కొట్టేసారు ఇప్పుడు లేదు మరి కొంచెం తెచ్చుకోండి సార్ తెచ్చుకుంటే సార్ ధర్మాగ్రహం మధ్యలో ఉండింది ఆ టైంలోనే చేశను శాంతా గాని ఇవన్నీ ఇప్పుడు కేవలం చూస్తున్నా సమాజం ఎప్పుడు ఈ తరాలు ఎప్పుడు మారుతాయా విద్యా విధానం ఎప్పుడు మారితే
(44:50) కొత్త పౌర సమాజం వస్తే ఆ పౌర సమాజం నాలుగైదు జనరేషన్స్ మీరు మీరు మళ్లా వందలు సంవత్సరాలు తర్వాతక పోతే 300 సంవత్సరాలు నా లెక్కలో 200 300 సంవత్సరాలు జరిగితేనే కొత్త పరిపుష్టమైన సమాజం నుంచే నాయకులు రావాలి వాళ్ళు సేవ చేస్తారు ఇప్పుడు వచ్చేవాళ్ళు షేవ్ చేస్తారు. సార్ చాలా అసలు విషయం మర్చిపోయాను సార్ మామూలుగా ఒక సామెత ఉన్నది సార్ ఆ సంగీతము చేత కోమటి బేర సారములుడిగని అట్లా మీరు ఆ సంగీతం సాహిత్యం మంచి ఆ అంటే అద్భుతమైనటువంటి సాంస్కృతిక ఇదైనటువంటి వారు అసలు ఈ ఇది ఎట్లా
(45:38) వచ్చింది మీకు ఇది నాకు అభిరుచి అనేది ఉంది గాని కాన దీని మీద ఇంత మనసు పెట్టి దాంట్లో దిగి ఏదో రవీంద్ర భారతికి పోయో లేకపోతే ఇంకో థియేటర్ కి పోయో ఎంజాయ్ చేసి రావచ్చు అట్లా కాదు నేనే పూనుకొని చేశ అవును సార్ కారణం ఏంటంటే అభిరుచి ఒకటి రెండోది నాకున్న కోపాన్ని నాకున్నటువంటి అసహనాన్ని దానివల్ల దాని తాలూకు మనసులో ఉద్వేగాన్ని సేద తీరాలంటే సంగీత సాహిత్యాలు వాటిని నేను ఆశ్రయించా దాని ద్వారా నేను ఉపశమనం పొందా నాకవి ఎయిర్ కండిషన్ లాగా పనిచేస్తాయి.
(46:17) ఒక మంచి సాహిత్యం గాని చదివితే ఆ రోజు అవును సార్ ఎంత కష్టం అన్నా మర్చిపోతాను. బోడిని మంచి పాటలు తయారు చేయించుకున్నా నాకు కావాల్సింది రాయించుకున్నాను నేనే రాశను స్వరం చేయించుకున్నాను నేనే సజెస్ట్ చేసి ఈ రాగంలో చేసి తీసుకున్నాను అది చేసుకొని చాలా సేద తీరా నేను ఇది నా స్వార్థం కాకపోతే నేను నాకే పెట్టుకోకుండా అందరికీ పంచుతున్నాను.
(46:42) అది ఆ పుణ్యం ఇదేమో నాకు నాకోసం చేసుకున్నాను ఈ దీన్ని నేను ఎటు చేసుకున్నా కదా 10 మందికి ఇస్తే మంచిదని అందరికీ ఇస్తాను ఫ్రీగా ఏది ఒక రూపాయ చార్జ్ చేయకుండా బూడంత ఖర్చు పెట్టాను సాహిత్య అవును సార్ చాలా పుస్తకాలు మీరు ప్రింట్ చేయచ్చారు చాలా పుస్తకాలు అసలు యాక్చువల్ గా నాది అపూర్వ భారతం మీకు చేరింది కదా దానికి ముందుమాట మీ చేత రాయిద్దాం అని చాలా ప్రయత్నాలు చేశాను అది నాకు ఆశ్చర్యం నేను ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం ఇన్నిసార్లు అంటున్నారు నేను దొరకని వాడి లేరు అందరూ వస్తారు అందరూ ఏదో చేసుకుపోతారు నేను మీకు ఎందుకు దొరకలేదో తెలియదు దారి తెలియలేదు సార్ దారి అంటే మీకు
(47:16) దారి తెలుసుకునేదానికి దగ్గర కదా మీకు సార్ అశ్విని సుబ్బారావు మీ దగ్గర అశ్విని సుబ్బారావు క్లాస్మేట్ ఆయన ద్వారా నెంబర్ ఇద్దరికి దొక్క పోయే ఇద్దరూ కాకినాడలోనే సార్ ఆ ఇద్దరు కాదు కాకినాడ ఆయన చూడండి ఆయన చదువుకున్న చదువులో లేడు ఆ హోమియోపతీ అంటాడు గాయత్రి పరివారు అంటాడు మంచి పనులు చేస్తున్నాడు ఆ అండ్ ఈ ఆర్గానిక్ వ్యవసాయం ఏదో రకరకాలు చేస్తూ ఉంటూ ఉంటాడు మంచి చేస్తూఉంటాడు మా నాన్నగారు ఒక మాట చెప్పారు సార్ ఆయన జీవితంలో అంటే ఆ బాబు అని పిలిచేవాడిని నేను ఆ బాబు నేను ఏం నేర్చుకోవాల జీవితంలో అంటే తృప్తిగా బ్రతకడం నేర్చుకోరా
(48:00) తృప్తి తృప్తి చాలా ముఖ్యం శ్రీకృష్ణుడు రెండు మాటల్లో చెప్తాడు భగవద్గీతలో అందరూ నాకు నమస్కారం చేస్తారు నేను ఒకరికి నమస్కారం చేస్తాను ఆ ఒకరు ఎవరంటే నాకున్నది చాలు అని తృప్తి పడిన వాడికి అది ఆ తృప్తితో ఎవరి దగ్గర అప్పు చేయని వాడికి అప్పు చేయ అంటే డబ్బు అనే కాదు ఎవరి మీద ఆధారపడాలి ఆధారపడని అప్పు అంటే ఏమిటి రుణపడడం నేనుది మీ దగ్గర సహాయం తీసుకున్నాను.
(48:29) నన్ను అక్కడిదాకా లిఫ్ట్ ఇవ్వయ్యా అని నీకు థాంక్స్ చెప్పాలి చెప్పి రుణం తీరిపోయింది అనుకుంటాను కాదు తీరదు ఇంకోరికి ఎవరికో నువ్వు సహాయం చేయాలి. కర్మ సిద్ధాంతం అది నువ్వు ఏం పొందుతావో తిరిగి ఇంకోరికి అది చెల్లించాలి. అది లేనివాడు అంటే ఏమిటి ఎవరి మీద ఆధారపడకుండా ఉండగలిగినవాడు వాడికి నేను దండం పెడతాను అన్నాడు కృష్ణుడు సో మనం ఎలా ఎదగాలంటే లైఫ్ లో దేనికి ఎవరిని ఆధారపడి బతక ఏది తీసుకున్నా ఒకరి దగ్గర తిరిగి వాళ్ళకి ఏదో చెల్లించాలి అది ధన రూపేనా కాక అక్కలేదు మీరు డాక్టర్ మీరు వైద్యం చేసి వాడికి సహాయం చేశారు వాడు డబ్బు ఇచ్చే కాదు ఇంకొకరికి ఎవరికనా
(49:14) సహాయం చేసి కూడా రుణం తీర్చుకోవాలి. వన్ ఆన్ వన్ కాదు ఈక్వేషన్ తమాషా ఉంటది మీకు సహాయం ఎక్కడి నుంచో వస్తది మీరు ఇంకెవరికో సహాయం చేస్తారు రుణం తీరిపోద్ది. వాళ్ళకే చేయక్కలేదు. అది సృష్టి సమాశ సముద్రుడు అక్కడి నుంచి వేడిగాలు పైకి వెళ్తాయి మేఘం తీసుకుంటుంది. వర్షించేది ఎక్కడో తిరిగి ఇచ్చేస్తుంది ఇక్కడ సముద్రం నుంచి తీసుకుంటుంది నీళ్ళని కురిసేది ఎక్కడో దాని రుణం తీసుకుంటుంది.
(49:49) అది పొందింది ఇచ్చింది థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ సార్ ఈరోజు నిజంగా చాలా అంటే మాకు ఆనంద బాబు ఒక కోరిక చెప్పండి నాకు ఇంటర్వ్యూలు అంటే కొంచెం విముఖత అసహ్యం వచ్చింది ఎందుకంటే తమ్మనైల్స్ భయంకరంగా పెడతారు ఇప్పుడు ఎక్కడో నేను ఒక ఇంటర్వ్యూలో మా ఆవిడ ఏవండీ మీరు సంగీతం ఇన్ని వింటారు కదా మీ ఆవిడ కూడా వింటారా అని ఆమె వినదురు నిజంగానే వినదు అంటే పోద్ది మన హాస్యం అనేది మన నా బ్రెయిన్ లో ఉంది ఉందది అందుకని హాసం పత్రిక హాసం పత్రిక మా ఆవిడ ఔరంగజేబ్ చెల్లులు అన్నా ముస్లింలు చేసుకున్న వరప్రసాద్ రెడ్డి ఇంకా భయంకరం ఇంకా భయంకరం ఆ ఏవండీ మీకు అబ్బాయిలు లేరా నాకు
(50:34) అబ్బాయిలు ఇష్టం లేదమ్మా ఆ అమ్మాయిలే కావాలనుకున్నాను అందులో ఒక అమ్మాయి కావాలనుకున్నాను రెండో అమ్మాయి కూడా వచ్చింది అది ఎట్లా ఒక అమ్మాయి పుట్టగానే చాలా సంతోషించాను మా ఆవిడకి సిజేరియన్ చేయాల్సి వచ్చింది డాక్టర్ తో చెప్పాను ఆ సిజేరియన్ కదా మళ్ళీ మళ్ళీ సిజేరిన్ వద్దు ఒక బిడ్డతో ఆపేద్దాం ఒకవేళ కొడుకు పుట్టకపోతే కూడా నా కొడుకైతే వద్దునే వద్దు కూతురుగా అయినా కూడా నాకు ఆపరేషన్ చేయండి అలాగే అంది డాక్టర్ మా ఫ్యామిలీ నా ఫ్రెండ్ చేయలే ఆమె ఆపరేషన్ అంటే ఈమె ఈమె ఆమె మాట్లాడుకున్నారు ఈమె కొడుకు కావాలందేమో మళ్ళీ రెండో పాప వచ్చు మా ఆవిడ నన్ను మోసం
(51:15) చేసింది అన్నా భరత్సారిని మోసం చేసిన భార్య తంబ్నైల్స్ అలా ఉంటాయి అక్కడితో ఆగలేదు. మర్చిపోయాను ఇంకో రకమైన విచిత్రం పెట్టారు కేటీఆర్ ఒకసారి కేటీఆర్ కి చెప్పాను నేను ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఇవి బాగాలేదు మీకు చాలా చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళంతా అవినీతి పరులు అయిపోయారు సగం రోడ్డు నేను వేసాను డబ్బు మీరు సగం వేయాలి కండిషన్ ఆయన ఏమన్నా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి అన్నాడు.
(51:45) మా ఏరియాలో రోడ్ లేదు ఇప్పుడు వేస్తున్నారు లేండి నేను 57 లక్షలు వసూలు చేసి మా కాలనీలో నేను 15 లక్షలు ఇచ్చి మిగితా వాళ్ళు 50 లక్షలు ఇచ్చి రోడ్డు సగం దూరం వేసాను మిగతా సగం వాళ్ళు వేయాలి వేయలే అప్పుడు ఆయన చెప్పాను ఫోన్ చేసి మీ వాళ్ళు మోసం చేశారు జిహెచ్ఎంసి వాళ్ళు ఇది ఇట్లా మీకు చెడ పేరు వస్తుందండి అని చెప్పా అది ఒక ఇంటర్వ్యూలో ఇటు గవర్నమెంట్ సరిగా ఉండదు అని చెప్తూ నేను కేటీఆర్ కూడా చెప్పాను ఈ ప్రభుత్వం ఒట్టు ఉందయ్యా బాబు కేటీఆర్ ని ఏకపరేసిన వరప్రసాద్ ఆయన చూసి ఏం సార్ మీరు నన్ను ఏకపరారేసి నా పరువు తీస్తున్నారు మావాళ్ళంతా మా అభిమానుల మా
(52:22) నియోజక గురించి వరసాడు మేమ తిట్టాడా ఏంటి అని అడుగుతున్నారు నేను తిట్టాను ఎక్కడ తిట్టలేదుఅని చెప్పలేదు ఆయన తంబ్నెయిల్ పంపించాడు ఆయన ఏకి పారేశరు సార్ అట్ట ఉండడం లేండి సార్ ఏం పెడతారో నాకు తెలిీదు అది మాత్రం మర్యాద పూర్వకంగా సంస్కారంగా ఉండాలి వరప్రసాద్ రెడ్డి గారి హృదయావిష్కరణ మనోగతం హృదయగతం అంతే మేము ఇంకా అంత దిగజారలేదు సార్ తెలియదు ఫ్యూచర్ లో రేటింగ్ కావాలంటే ఏదో చేస్తున్నారట అవసరం లేదు సార్ సార్ కంటెంట్ ముఖ్యం కానీ ఆ తంబ్నెయిల్ ఇి కాదు సార్ థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ నిజంగా ఈరోజు చాలా సుదీనం మాకు మరలా మరల మీతోటి అంటే ఈ విషయాలు కాకుండా సాహిత్య
(53:09) సంబంధమైనటువంటి విషయాలు మీతో మాట్లాడడానికి మాకు అనుమతించగలరా తప్పకుండా నమస్కారం నమస్తే సార్ ఇదండీ ఈరోజు మన ఇష్టాగోష్టి కార్యక్రమం విన్నారు కదా యువత ఎలా ఆలోచించాలి ఎటువంటి నిబద్ధత ఉంటే జీవితంలో పైకి రాగలరు అనేది మనం వారి జీవితాల ద్వారా మనం తెలుసుకోగలగాలి. అంతలా కష్టపడితే అందరూ పైకి వస్తారు అనుకుంటే అందరూ కష్టపడతారేమో కానీ మనిషి మనిషికి తేడా ఉంటది అనే విషయం వారు మనకు వారి మాటల ద్వారా తెలియజేశారు.
(53:51) మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవా మరి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ది మదన్ గుప్త ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మీ మిత్రులకు కూడా ది మదన్ గుప్తా ఛానల్ ను పరిచయం చేయండి మరొక మంచి విషయంతో మీ ముందు ఉంటాను జై హింద్ జై మా భారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్త
No comments:
Post a Comment