Saturday, June 20, 2026

వెన్నెముకలో దాగి ఉన్న అద్భుత రహస్య శక్తులు! 🧠 The Science & Spirituality of Human Spine

వెన్నెముకలో దాగి ఉన్న అద్భుత రహస్య శక్తులు! 🧠 The Science & Spirituality of Human Spine

Author Name:likhitha inspires

Youtube Channel Url:https://www.youtube.com/@likhithainspires

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Cou2jYMut2I



Transcript:
(00:00) మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం ఏది అని అడిగితే చాలామంది గుండె అంటారు లేదా మెదడు అంటారు. కానీ ఆ మెదడు ఇచ్చే ప్రతి కమాండ్ ని శరీరానికి చేరవేసేది మనల్ని నిటారుగా నిలబెట్టి ఆకాశం వైపు చూసేలా చేసేది కేవలం మన వెన్నెముక మాత్రమే అని మీకు తెలుసా? యోగులు వెన్నెముకను మారుదండం అని పిలుస్తారు. అంటే ఆక్సిస్ ఆఫ్ ద యూనివర్స్.
(00:24) సైంటిస్టులు దీనిని ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే అంటారు. అసలు మన వీపు వెనుక దాగి ఉన్న ఆ 33 ఎముకల్లో అంతటి శక్తి ఏముంది? కుండలిని శక్తికి మన నరాల వ్యవస్థకి ఉన్న ఆ లింక్ ఏంటి? ఈరోజు వీడియోలో వెన్నెముక గురించి మోడరన్ సైన్స్ చెప్పే నిజాలు మరియు మన పూర్వీకులు చెప్పిన ఆధ్యాత్మిక రహస్యాలను డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు లిఖిత ఇన్స్పైర్స్. ముందుగా సైన్స్ ప్రకారం చూద్దాం.
(00:48) మన వెన్నెముక కేవలం ఒక ఎముకల గూడు కాదు. ఇది మెదడు యొక్క తోక లాంటిది. టెక్నికల్ గా చెప్పాలంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టం లో వెన్నెముక ఒక కీలకమైన భాగం. మన వెన్నెముకలో 33 వర్టిబ్రే ఉంటాయి. ఇవి అత్యంత [సంగీతం] సున్నితమైన స్పైనల్ కార్డ్ ని రక్షిస్తాయి. ఈ స్పైనల్ కార్డ్ వల్లే మనం కదులుతున్నం [సంగీతం] స్పర్శను అనుభవించగలుగుతున్నాం.
(01:10) మీ కాలికి దెబ్బ తగిలితే ఆ నొప్పి మెదడుకు తెలియాలన్నా మెదడు కాలుని కదిలించమని చెప్పాలన్నా ఆ [సంగీతం] సిగ్నల్స్ అన్నీ ఈ వెన్నెముక ద్వారానే ప్రయాణించాలి. సెకండ్లో వందో వంతు వేగంతో ఈ సమాచారం ఇక్కడ ప్రయాణిస్తుంది. సైన్స్ ఏం చెబుతుంది అంటే మీ వెన్నెముక ఆరోగ్యం మీ మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. మీరు వంగిపోయి కూర్చున్నప్పుడు మీ ఊపిరి తిత్తులు కుచించుకుపోతాయి.
(01:34) మెదడుకు ఆక్సిజన్ తగ్గుతుంది. తద్వారా మీలో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. [సంగీతం] అందుకే స్టాండ్ టాల్ అని అంటారు. అంటే నిటారుగా నిలబడు అని అంటారు. ఇప్పుడు సైన్స్ కనిపెట్టిన ఒక మైండ్ బ్లోయింగ్ ఫాక్ట్ చెప్తాను వినండి. మన మెదుడులో మరియు వెన్నెముక లోపల ఒక ప్రత్యేకమైన ద్రవం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. దీనిని సైన్స్ లో సిఎస్ఎఫ్ అంటారు అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఈ ద్రవం పగలు మరియు రాత్రి మన వెన్నెముక గుండా పైకి కిందకు ప్రయాణిస్తూ మెదడుకు కావలసిన పోషకాలను అందిస్తుంది.
(02:07) వ్యర్థాలను శుభ్రం చేస్తుంది. అయితే ఆధ్యాత్మిక గ్రంథాలలో దీనిని ఒక పవిత్రమైన అమృతంలా వర్ణించారు. ఎందుకంటే మనం గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఈ సిఎస్ఎఫ్ ద్రవం యొక్క ప్రవాహం మారుతుంది. ఇది వెన్నెముక కింద ఉన్న మూలాధారా చక్రం నుండి నెమ్మదిగా పైకి ప్రయాణించి మెదడులోని పీనియల్ గ్రంధిని యాక్టివేట్ చేస్తుంది. ఈ పీనియల్ గ్రంధిని మన పూర్వీకులు ఆజ్ఞ చక్రం లేదా శివుని మూడో కన్ను అన్నారు.
(02:33) ఇది ఆక్టివేట్ అయినప్పుడు మన శరీరంలో డీ ఎంటిటీ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీని వల్ల మనిషికి అపారమైన మానసిక ప్రశాంతత కళాతీతమైన అనుభూతి కలుగుతాయి. అంటే వెన్నెముకలో ప్రవహించే ఈ ద్రవమే మిమ్మల్ని ఆధ్యాత్మిక శిఖరాలకు తీసుకెళ్లే అసలైన ఇంధనం. ఇప్పుడు కొంచెం లోతుగా ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్దాం. పురాతన యోగశాస్త్రం ప్రకారం వెన్నెముక అంటే కేవలం ఎముకలు కాదు అది ఒక అద్భుతమైన ఎనర్జీ ఛానల్.
(03:01) మన శరీరంలో 72వ000 నాడులు ఉన్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైన మూడు నాడులు మన వెన్నెముకలోనే ఉన్నాయి. మొదటిది ఈడా [సంగీతం] నాడి అంటే చంద్రనాడి ఇది వెన్నెముకకు ఎడమ వైపు ఉంటుంది. రెండవది పింగల నాడి అంటే సూర్య నాడి ఇది మన వెన్నెముకకు కుడి వైపున ఉంటుంది. ఇక మూడవది సుషుమ్న నాడి ఇది సరిగ్గా వెన్నెముక మధ్యలో ఉంటుంది.
(03:26) యోగశాస్త్రం ప్రకారం కుండలిని అనే సుప్త శక్తి వెన్నెముక అడుగు భాగమైన మూలాధార చక్రంలో నిద్రాణమై ఉంటుంది. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో వెన్నెముకను నిటారుగా ఉంచుతామో ఆ శక్తి సుషుమ్న నాడి ద్వారా పైకి ప్రయాణించి తల పై భాగంలో ఉన్న సహస్రార చక్రం వరకు వెళ్తుంది. దీన్నే సెల్ఫ్ రియలైజేషన్ లేదా ఆత్మజ్ఞానం అంటారు. అందుకే గమనించండి ఏ దేవుడి విగ్రహం చూసినా లేదా ఏ యోగిని చూసినా వాళ్ళు వెన్నెముకను నిటారుగా ఉంచే కూర్చుంటారు.
(03:56) ఎందుకంటే వెన్నెముక నిటారుగా ఉంటేనే కాస్మిక్ ఎనర్జీ మనం గ్రహించగలం. ఇక్కడ ఒక అద్భుతమైన విశ్వ రహస్యం దాగి ఉంది. మన వెన్నెముకలో సరిగ్గా 33 ఎముకలు ఉంటాయని [సంగీతం] చెప్పుకున్నాం కదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్కృతుల్లో ఆధ్యాత్మికతలో ఈ 33 అనే నెంబర్ కి ఒక ప్రత్యేక [సంగీతం] ప్రాముఖ్యత ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు.
(04:22) మన శరీరమే ఒక బ్రహ్మాండం అనుకుంటే ఆ 33 కోట్ల శక్తులు మన వెన్నెముకలోని ఈ 33 ఎముకల విభాగాల్లో దాగి ఉన్నాయని ఒక నమ్మకం అలాగే క్రిస్టియానిటీ ప్రకారం ఏసుక్రీస్తు భూమిపై జీవించిన కాలం సరిగ్గా 33 సంవత్సరాలు ఆయన తన 33వ ఏటనే సిలువ వేయబడి తిరిగి బతికారు. దీనిని కూడా ఆధ్యాత్మిక విశ్లేషకులు మన వెన్నెముకలోని 33 స్టేజీలను దాటి ఆత్మ పైకి లేవడానికి ఒక సింబల్ గా చెప్పారు.
(04:51) ఇది కేవలం నంబర్ల ఆట కాదు మీ వెన్నెముకలో ఉన్న ప్రతి ఎముక విశ్వంలోని ఒక నిర్దిష్టమైన శక్తి తరంగంతో కనెక్ట్ అయ్యి ఉంది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఋషులు చెప్పిన చక్రాలకు డాక్టర్లు చెప్పే అనాటమీకి దగ్గర సంబంధం ఉంది. ఉదాహరణకు మూలాధార చక్రం ఉన్నచోటనే సైన్స్ ప్రకారం శాక్రల్ ప్లక్సెస్ అనే నరాల గుత్తి ఉంటుంది.
(05:17) అనహత చక్రం ఉన్నచోటనే కార్డియాక్ ప్లక్సెస్ ఉంటుంది. ఆజ్ఞ చక్రం ఉన్నచోటనే పీనియల్ గ్రంధి ఉంటుంది. అంటే మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే ఏ స్కానింగ్ మిషన్లు లేకుండానే మన వెన్నెముకలో ఏ పాయింట్ [సంగీతం] వద్ద ఏ శక్తి దాగి ఉందో పసిగట్టారు. సైకాలజీ ప్రకారం కూడా మీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు మీ భుజాలు జారిపోతాయి. వెన్నెముక వంగిపోతుంది.
(05:39) అదే మీరు ఆనందంగా ఉన్నప్పుడు వెన్నెముక తెలియకుండానే స్ట్రెయిట్ అవుతుంది. అంటే మీ ఎమోషన్స్ [సంగీతం] ని కంట్రోల్ చేసే స్విచ్ మీ వెన్నెముకలో ఉంటుందన్నమాట. చాలామంది అనుకుంటారు వెన్నెముక వంగిపోతే కేవలం నడుము నొప్పి వస్తుందని కానీ మెడికల్ సైన్స్ లో ఎపిజెనటిక్స్ అనే ఒక కొత్త విభాగం ఏం చెబుతుందో తెలుసా? మీ శారీరక స్థితి మీ DNAన్ఏ పనితీరును కూడా మార్చగలదు.
(06:02) మీరు రోజూ ఫోన్ చూస్తూనో లాప్టాప్ ముందు వంగి కూర్చోవడం వల్ల మీ వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల శరీరంలో కార్టిసాల్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్ మీ ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. మిమ్మల్ని త్వరగా ముసిలి వాళ్ళను చేస్తుంది. అదే మీరు మీ వెన్నెముకను నిటారుగా ఉంచినప్పుడు కేవలం రెండు నిమిషాల్లోనే మీ శరీరంలో టెస్టోస్టిరాన్ అంటే కాన్ఫిడెన్స్ హార్మోన్ పెరుగుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది.
(06:31) యోగశాస్త్రం ఎప్పుడో చెప్పింది. ఎవరు వెన్నెముకను స్థిరంగా ఉంచుతారో వారి మనసు స్థిరంగా ఉంటుంది అని ఈరోజు మోడరన్ సైన్స్ కూడా అదే నిజమని ఒప్పుకుంటుంది. మీ వెన్నెముక నిటారుగా ఉంటే మీ ఆలోచనలు మారుతాయి. మీ ఆలోచనలు మారితే మీ భవిష్యత్తు మారుతుంది. మరి ఈ వెన్నెముకలోని శక్తిని మనం [సంగీతం] ఎలా ఉపయోగించుకోవాలి అనే డౌట్ మీకు ఉండొచ్చు.
(06:55) దీనికి పెద్ద పెద్ద తపస్సులు చేయక్కర్లేదు. చిన్న మార్పులు చాలు. మొదటిది పోస్చర్ అవేర్నెస్ అంటే నిటారుగా కూర్చోవడం. మీరు ఆఫీసలో ఉన్న ఇంట్లో ఉన్న స్పృహతో వెన్నెముకను నిటారుగా ఉంచండి. దీనివల్ల మీ మెదుడు చురుగ్గా మారుతుంది. ఇక రెండవది స్పైనల్ బ్రీతింగ్ ఊపిరి తీసుకుంటున్నప్పుడు గాలి వెన్నెముక ద్వారా పైకి వెళ్తున్నట్టు వదిలేటప్పుడు కిందకి వెళ్తున్నట్టు ఊహించుకోండి.
(07:21) ఇది మీ నర్వ్స్ ని కామ్ చేస్తుంది. ఇక మూడవది మూమెంట్ తడాసన లేదా భుజంగాసన వేయడం ద్వారా వెన్నెముక ఫ్లెక్సిబిలిటీని పెంచుకోండి. గుర్తుంచుకోండి. యు ఆర్ ఓన్లీ యస్ యంగ్ యస్ యువర్ స్పైన్ ఇస్ ఫ్లక్సిబుల్ మీ వెన్నెముక ఎంత వంగితే మీరు అంత యవ్వనంగా ఉన్నట్టు చివరగా ఒక మాట మన వెన్నెముక కేవలం శరీరాన్ని మోసే స్తంభం కాదు అది భూమికి ఆకాశానికి మధ్య ఉన్న వారది.
(07:50) దానిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మీ ఆరోగ్యం మరియు మీ మానసిక స్థితి అంత అద్భుతంగా ఉంటాయి. ఈ రోజు నుండి రోజుకు ఒక్కసారైనా మీ వెన్నెముకను గమనించండి. నిటారుగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు కొత్త విషయాలను నేర్పించిందని భావిస్తున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి.
(08:16) అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. జైహింద్

No comments:

Post a Comment