యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః
Author Name:DHYANA VIDYARTHI PSSM
Youtube Channel Url:https://www.youtube.com/@DHYANAVIDYARTHIPSSM
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gDUpE2e4LqQ
Transcript:
(00:00) యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువా నీతిర్మతిర్మమామ ఇది భగవద్గీతలో చివరి శ్లోకం సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన కంక్లూజన్ గీత మొత్తం సారం ఒక్క ముక్కలో చెప్పాడు యత్ర యోగేశ్వరః కృష్ణః ఎక్కడైతే యోగులకు ఈశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో యత్ర పార్థః ధనుర్ధరః ఎక్కడైతే విల్లు పట్టుకున్న అర్జునుడు ఉంటాడో తత్ర శ్రీహి విజయః భూతిహి ధ్రువానీతిహి అక్కడ సంపద విజయం ఐశ్వర్యం శాశ్వతమైన న్యాయం ఉంటాయి మతిహి మమ ఇది నా గట్టి నమ్మకం ధృతరాష్ట్ర మహారాజా నా అభిప్రాయం విను ఒకవైపు కృష్ణుడు అంటే ధర్మం జ్ఞానం దైవబలం
(00:48) ఇంకోవైపు అర్జునుడు అంటే ప్రయత్నం పురుషకారం కర్మ ఈ రెండు కలిసిన చోట తప్పకుండా లక్ష్మీదేవి ఉంటుంది గెలుపు ఉంటుంది అభివృద్ధి ఉంటుంది న్యాయం ఉంటుంది ఇది గ్యారెంటీ ఈ శ్లోకం ఎందుకు స్పెషల్ కృష్ణుడు లేకుండా అర్జునుడు కష్టపడతాడు కానీ దారి తప్పుతాడు. దుర్యోధనుడులా బలం ఉంది ధర్మం లేదు రిజల్ట్ ఓటమి అట్ ద సేమ్ టైం అర్జునుడు లేకుండా కృష్ణుడు జ్ఞానం ఉంటుంది కానీ యక్షన్ ఉండదు సన్యాసిలా తెలివు ఉంది కర్మ లేదు రిజల్ట్ స్తబ్ధత కాబట్టి కృష్ణుడు ప్లస్ అర్జునుడు ఈక్వల్ టు గెలుపు ఫార్ములా కృష్ణుడు అంటే సరైన దిశ ధర్మం విలువలు గురువు దేవుడు ఆశీస్సు
(01:30) అలాగే అర్జునుడు అంటే నీ ఎఫర్ట్ స్కిల్ డిసిప్లిన్ ధైర్యం నువ్వు ఎంత కష్టపడినా దిశ సరిగ్గా లేకపోతే వేస్ట్ నీకు దిశ తెలిసి కూడా కష్టపడకపోతే వేస్ట్ రెండు కలిస్తేనే శ్రీర్ విజయో భూతిహి చిన్న కథ కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక సంజయుడు గుడ్డి రాజు ధృతరాష్ట్రుడితో ఓ రాజా మీ వంద మంది కొడుకులు చనిపోయారు ఎందుకంటే వాళ్ళ వైపు దుర్యోధనుడు ఉన్నాడు కానీ కృష్ణుడు లేడు పాండవుల వైపు అర్జునుడు ఉన్నాడు కృష్ణుడు కూడా ఉన్నాడు కాబట్టి వాళ్లే గెలిచారు ఇక నుండైనా తెలుసుకో దేవుడు ప్లస్ ప్రయత్నం ఈక్వల్ టు విజయం అని చెప్పాడు నీ జీవితాల్లో చదువు ఎలా ఉండాలంటే
(02:11) అర్జునుడిలా నువ్వు రాత్రి పగలు చదువు కృష్ణుడిలా పెద్దల సలహ గురువుల గైడెన్స్ తీసుకో అప్పుడే ర్యాంక్ వస్తుంది. మరి బిజినెస్ నువ్వు కష్టపడడం అర్జునుడు నీతి నిజాయితి ధర్మం అది కృష్ణుడు రెండు ఉంటే లక్ష్మి తాండవం చేస్తుంది. మరి ధ్యానం నువ్వు కూర్చోవడం అర్జునుడు నేను ఉన్నాను అనే కృష్ణుడి నమ్మకం అది కృష్ణుడు అప్పుడే శాంతి వస్తుంది.
(02:37) కాబట్టి లైఫ్ లో ఏ పని స్టార్ట్ చేసినా రెండు ప్రశ్నలు వేసుకో నా పక్కన కృష్ణుడు ఉన్నాడా నేను అర్జునుడిలా విల్లు పట్టుకున్నానా రెండు ఎస్ అయితే భయం లేదు ధ్రువానీతిహి గెలుపు గ్యారెంటీ అందుకే ఈ శ్లోకాన్ని చాలామంది విజయ శ్లోకంగా భావించి పారాయణం చేస్తారు
No comments:
Post a Comment