ఆలోచనలు లేని స్థితి రహస్యం!
Author Name:Mukti Padam
Youtube Channel Url:https://www.youtube.com/@MuktiPadam-Teluguspiritual
Youtube Video URL:https://www.youtube.com/watch?v=S5sgp_lbIJY
Transcript:
(00:00) ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం ఆ ఈ టాపిక్ మీద వేరియస్ వీడియోస్ ఉంండొచ్చు ఎందుకంటే అసల మూలమైనటువంటి సమస్య ఇది అనేటువంటి విషయం చాలామంది గమనించి ఉన్నారు కాబట్టి ఆలోచన ఆలోచన లేనటువంటి స్థితిలో ఉండటం ఎలాగ ఇది ఇంతకుముందు రకరకాలైనటువంటి టెక్నిక్స్ చెప్పాం దీని గురించి ఎలాగ వెళ్ళినా గాని అయితే ఇక్కడ ఆ చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే మనకి సాధనల్లో స్పీడ్ గా చేసేటువంటి డైనమిక్ ప్రాణాయామాస్ ఉంటాయి.
(00:40) ఆ స్పీడ్ గా ఎప్పుడైతే మీరు ప్రాణాన్ని లోపలికి బయటికి లోపలికి బయటికి ఆడించినప్పుడు మనసుఅనేది ఆగిపోతది కానీ తాత్కాలికంగా తాత్కాలికంగా ఆగుతది. తర్వాత మనం చేసేటువంటి మనకి హటయోగంలో ఉన్నటువంటి ప్రాణాయామాలు అనులోమ విలోమ అనులోమ విలోమ ఏదైనా డైనమిక్ ప్రాణాయామాస్ చాలా స్పీడ్ గా అయితే స్థితి అనులోమ విలోమలో స్లో డౌన్ చేస్తది మనసుని ఆలోచనని బాగా స్లో చేస్తది.
(01:08) లేకపోతే బస్త్రిక కపాల్భాతి ఇలాంటి ప్రాణాయామాలు చాలా స్పీడ్ గా మనం చేసినప్పుడు ఏంటంటే మనసు అనేది లేనటువంటి స్థితి కామ్ అయ్యేటువంటి స్టేట్ అనేది వస్తది. ఖచ్చితంగా కానీ తాత్కాలికమే ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇది ఒకసారి దీన్ని అర్థం చేసుకున్నారు కదా అంటే మనం ప్రాణాయామం చేసినప్పుడు మనసు అనేది ఆలోచన లేనటువంటి స్థితిలో కాం డౌన్ ఎందుకు అవుతుంది అంటే శ్వాసకి మనసుకి సంబంధం ఉంది.
(01:41) శ్వాస అనే దాని ద్వారానే మనసు అనేది ఏర్పడింది. శ్వాసలో కదలిక ఏర్పడితే మనసులో కదలిక ఏర్పడుతుంది. కదలిక ఏర్పడినప్పుడు అది ఒక అలజడిని సుఖాన్ని దుఃఖాన్ని రెండిటిని ఇచ్చేటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మనకు కావాల్సింది ఎప్పుడూ కూడా ఈ సుఖానికి దుఃఖానికి లేనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి ఆలోచన రహితమైనటువంటి స్థితి. అయితే మనకి జనరల్ గా చేసేటువంటి ప్రాణాయామాలకి మనం క్రియాయోగంలో చేసేటువంటి ప్రాణాయామానికి ఉన్నటువంటి బేధం ఏమిటి ఇది ముఖ్యమైనటువంటి విషయం క్రియాయోగంలో మనం చేసేటువంటి ప్రాణాయామం అంతర్ముఖ ప్రాణాయామం మనం చేసేటువంటి జనరల్గా ఈ ప్రాణాయామాల్లో మనం
(02:25) హటయోగంలో చేసేటువంటి ప్రతి ప్రాణాయామాల్లో కూడా ఆ చంద్రనాడి సూర్యనాడి ఈ రెండు నాడుల్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ నాడుల్ని ఎప్పుడైతే మనం ఉపయోగించామో అది తాత్కాలికంగా కామ్ డౌన్ అవుతది తర్వాత మళ్ళీ ఆ నార్మల్ స్టేట్ కి వచ్చేస్తది మైండ్ అనేది నార్మల్ స్టేట్ కి వచ్చేస్తది కానీ మనం క్రియలో చేసేటువంటి ప్రాణాయామ డైరెక్ట్ గా సుషుమ్న నాడితో చేసేటువంటి ప్రాణాయామ కాబట్టి సుషుమ్నా నాడి ఎప్పుడైతే అవేకన్ అయిందో మైండ్ అనేది కామ్ స్టేట్ లో ఎక్కువ సేపు ఉండటం అనేది జరుగుతుంది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే ఉందో అప్పుడు దానికి
(03:04) సంబంధించినటువంటి ఆనందాన్ని పట్టుకోవటమే కాకుండా ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుందో దాని మూలాన్ని పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఎప్పుడైనా గాని ఆ మూలం దొరికిందా మీరు ఎప్పుడైనా కామ్ చేయగలరు. ప్రత్యేకించి ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఈ స్టేట్ లో కూర్చున్నాం కూర్చొని ధ్యాన స్థితిలో ఇలా ఉన్నాం. ఈ స్థితిలో లోపల కామ్ స్టేట్ లోకి వెళ్ళాం.
(03:33) అంటే ఆలోచన లేనటువంటి స్థితిలోకి వెళ్ళాం. ఓకే ఇది మీకు దీంట్లో చాలా స్కిల్ వచ్చింది అంటే మీరు అంతర్ముఖ ప్రాణాయామం చేయడం ద్వారా చక్రాస్ యాక్టివేట్ అవ్వడం ద్వారా ఒక రకమైనటువంటి మత్తుని అంతర్ముఖ స్థితిని మీరు అవగాహన చేసుకొని ఆ స్థితిలోకి ఎప్పుడైతే వెళ్లారో ఈ స్థితి ఏంటి కళ్ళు మూసుకొని ఆలోచన లేని స్థితి ఈ స్థితి కళ్ళు లేక కళ్ళు తెరిసి ఆలోచన లేనటువంటి స్థితి ఇది కూడా ఉంది మనం వస్తు విషయాలని బయట తిరుగుతున్నా కానీ ఇక్కడ ఆలోచన లేకపోతే బయట తిరిగే దాని మీద ఆలోచన లేవట్లేదు ఇది మంచిది ఇది చెడ్డది ఇది బాగుంది ఇది బాగాలేదు ఇలాంటి ఆలోచనలు లేవట్లేదు జస్ట్ మీరు చూస్తున్నారు అంతే
(04:20) జస్ట్ చూస్తున్నారు దీనికి లోపల ఆలోచన ఉంటే చిత్తం పైకి లేస్తే అది దాని రాగ ద్వేష మోహాలతో నిండి ఉంటే రకరకాలైన పేర్లు అది లేకపోతే ఈ మూలం ైనటువంటి స్థితిని మీరు గనుక నిజంగా పట్టుకుంటే మీరు జరిగేటువంటి ప్రతి సాధనలో మీరు మీ మనసుని జయించినటువంటి స్థితి ఇది మీకు ఆ స్థితిని మనం క్రియాయోగంలో కేచరి ముద్ర ప్రాక్టీస్ చేయటం దాంతో పాటు క్రియాయోగ అంతర్ముఖ ప్రాణాయామం చేయడంలో మనకి శ్వాస లేనటువంటి స్థితి ఆలోచన లేనటువంటి స్థితి చాలా ఎక్కువ సమయం నిడివి చాలా ఎక్కువ మీకు ఎప్పుడైతే ఈ నిడివి ఆలోచన లేనటువంటి స్థితికి సంబంధించిన
(05:05) నిడివి అంత పెరిగితే ఆలోచన ఎక్కడ పుడుతుందో అనేది అర్థం అవుతది. ఆలోచన ఎక్కడ పుడుతుందో దాని మూలం తెలిస్తే దాని మూలాన్ని మామూలుగా ఉన్నటువంటి సమయంలో కూడా పట్టుకోవడం ఈజీ అయింది. దీంట్లో ఇంకా పెద్ద రహస్యం ఏం లేదు. ప్రపంచం సృష్టి మొత్తం ఏర్పడింది ఇక్కడి నుంచి ఆలోచన నుంచి నిద్రలో గాఢమైన నిద్రలో సృష్టి ఉందా? మీరేమన్నా చూస్తున్నారా తెలుసుకుంటున్నారా మీరు ఆడామగా తెలుసా ఇంట్లో పండుకున్నారో రోడ్డు మీద పండుకున్నారో తెలుసా మీరు బిచ్చగాళ్ళలో కోటీశ్వరులో తెలుసా ఏది తెలియదు ఎక్కడలే మళ్ళీ మీకు ఇన్నీ ఎక్కడ లేస్తున్నాయి సమస్య ఎప్పుడు ఉత్పన్నం
(05:45) అవుతుంది మళ్ళీ మీరు లేశారు మనసు లేసింది నేను అనేది లేసింది మనసు లేసింది అప్పుడు ఈ లేవు అంటుంది అయి ఉన్నాయి అంటుంది ఇది ఆనందం అంటుంది దుఃఖం అంటుంది ఇన్నీ ఎక్కడి నుంచి ఏర్పడినాయి ఆలోచన ఈ ఆలోచనకు సంబంధించి నుంచి మీరు మెలుకువలో ఉన్నటువంటి స్థితిలో మీ ఆలోచన యొక్క మూలాన్ని మీరు పట్టుకుంటే మీరు ఎక్కడ ఉన్నా గాని మీరు ఎక్కడ ఉన్నా గాని ఆ స్థితిని ఈజీగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు ఆ మూలాన్ని పట్టుకోవడానికి మీ ఆ సాధనలో ఎలాగంటే సాధనకి ఈ స్థితిని పట్టుకోవడానికి సాధన ఎందుకు అంత వైడ్ రేంజ్లో గంటల తరబడి కూర్చోవటం ఎక్కడెక్కడ ఎందుకు ఇంత
(06:28) జరుగుతుంది అంటే ఆ సాధన మీకు ఎప్పుడైనా కానీ సాధన అనేది ఒక నాచురల్ వేలో ఉంటే అది చాలా ఎక్కువ సమయం తీసుకుంటది కానీ మీరు మీ సాధన అనేది టెక్నిక్ పరంగా అంటే ఒక ఉపాయంతో మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ టెక్నిక్ అంటే ఉపాయం ఉపాయంతో వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకోవటం దాన్ని పట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది చాలా ఈజీ అయిపోతుంది దాన్ని దాన్ని అవగాహన చేసుకోవడం ఈజీ అవుతుంది కానీ ఈ గ్యాప్ అవసరం ఈ ఆలోచనకు సంబంధించి ఈ శరీరానికి మనసుకి ఆవలు ఉన్నటువంటి స్థితిలో ఎక్కువ సమయం గడపడం ఏదైతే ఉందో అది అనంతమైనటువంటి స్థితి ఈ అనంతమైనటువంటి స్థితే సమాధి
(07:12) స్థితి ఈ సమాధి స్థితిలోనే మనల్ని మనం తెలుసుకోవడానికి అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి స్థితి ఇది అంతర్ముఖ ప్రాణాయామంలో మీకు కేచరి ముద్రలో ఈ స్థితిని అచీవ్ చేయటం ఈ చేతిలో ఉన్నటువంటి లడ్డుని ఇలా తినటం ఎంత సమయం టెక్నిక్ అర్థమైతే అంత ఈజీ గైడ్ చేసేవాళ్ళు ఉంటే అంత ఈజీ ఈ సృష్టి మొత్తానికి ఇంకా పట్టు ఎక్కడా లేదు ఆలోచనలోనే అస్తిత్వం ఉంది సృష్టి మొత్తానికి ఆలోచన ఉంటే సృష్టి ఉంది ఆలోచన లేదా లయం అయిపోయింది సృష్టి సృష్టి స్థితి లయాలు అని చెప్తాం కదా ఇవన్నీ ఆలోచనలోనే ఉన్నాయి కాబట్టి దీన్ని కరెక్ అవగాహన
(07:59) చేసుకొని ఈ ఆలోచన రహితమైనటువంటి స్థితిని పొందటానికి ఇక ఈ పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి అసల ఎందుకంటే సమస్య అది అని అర్థమైన వాళ్ళందరూ కూడా ఈ ఆలోచన వద్దురా బాబు అని దండం పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి దీంట్లో నుంచి బయట పడటానికి మీకు క్రియాయోగ అనేది చాలా షార్ట్ కట్ రూట్ చాలా చాలా ఈజీ మార్గం దాన్ని కానీ అర్థం చేసుకోవటం అర్థం చేసుకునే విధంగా చెప్పే వాళ్ళు ఉండటం గైడ్ చేసే వాళ్ళు ఉండటం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసులకు సంబంధించినటువంటి వివరాల కోసం పైనున్నటువంటి ఫోన్ నెంబర్ ని
(08:38) సంప్రదించండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి
No comments:
Post a Comment