Saturday, June 20, 2026

1000 కోట్ల కోటీశ్వరుడికి… ఓ పేద రైతు నేర్పిన జీవిత పాఠం! | SEETAKANTH TALKIE #charity #motivation

1000 కోట్ల కోటీశ్వరుడికి… ఓ పేద రైతు నేర్పిన జీవిత పాఠం! | SEETAKANTH TALKIE #charity #motivation

Author Name:SEETAKANTH TALKIE

Youtube Channel Url:https://www.youtube.com/@SEETAKANTHTALKIE

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mojY_yQEZbU



Transcript:
(00:00) హిమాలయ పర్వతాల్లో మంచుతో కప్పబడిన రోడ్డు ఒక డేంజరస్ మలుపు రాత్రి సమయం ఒక లగ్జరీఎస్యుv కారు చాలా వేగంగా దూసుకెళ్తుంది. ఆ కారు డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తి పేరు శేఖర్ వయసు 50 ఏళ్ళు అతను ఒక సెల్ఫ్ మేడ్ బిలియనర్ సడన్ గా రోడ్డు మీద ఉన్న మంచు వల్ల కారు టైర్స్ స్కిడ్ అయ్యాయి. ఒక్క క్షణం కన్ను మూసి తెరిసేలోపు ఆ కారు కంట్రోల్ తప్పి రోడ్డు అంచు దాటిపోయి భయంకరమైన లోయలోకి దొర్లిపోయింది.
(00:26) చెట్లకు కొట్టుకుంటూ పల్లీలు కొడుతూ చివరికి ఒక పెద్ద బండరాయి దగ్గర ఆగిపోయింది. ఆ ఫోర్స్ కి శేఖర్ కార్లో నుంచి బయట పడిపోయాడు ఒళ్ళంతా గాయాలు రక్తం కారుతుంది చలనం లేకుండా పడి ఉన్నాడు. సరిగ్గా ఆ క్షణంలో మృత్యువు అంచున ఉన్న ఆ సమయంలో శేఖర్ కి తన జీవితమంతా ఒక సినిమా లాగా కళ్ళ ముందు కదలాడింది. అతని 25 ఏళ్ల కష్టం ఒక చిన్న గదిలో మొదలుపెట్టిన బిజినెస్ రాత్రింబవుళ్ళు పడిన శ్రమ.
(00:54) ఇవాళ అతని స్థాయి ఏంటంటేవెయ కోట్ల సంపద ఐదు ఫ్యాక్టరీలు ఫారిన్ కార్లు కానీ ఈ క్షణం ఆ చీకటి లోయలో చావు బతుకుల మధ్య పడి ఉన్నప్పుడు ఆవెయ కోట్లు ఎక్కడున్నాయి ఆ కార్లు ఆ ఫ్యాక్టరీలు ఎక్కడఉన్నాయి ఇవేవి అతనికి సహాయం చేయట్లేదు ఏ ఒక్కరు అతని పక్కన లేరు. శేఖర్ కి జీవితంలో ఒకటే ఒక గట్టి నమ్మకం ఉండేది నా డబ్బు నాది నేను నా రక్తంతో చెమటోడ్చి సంపాదించాను ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఫ్రీగా ఇవ్వను దానధర్మాలు అంటే అదిఒక మూర్ఖత్వం అనే గట్టి నమ్మకంతో 30 ఏళ్ళు బతికాడు.
(01:25) తన జీవితంలో ఒక్క పేదవాడికి కూడా ఒక్క పైసా కూడా దానం చేయలేదు. మెల్లగా ఆ ఆలోచనల్లోనే శేఖర్ స్పృహ కోల్పోయాడు. కొన్ని గంటల తర్వాత అతనికి మెలుకు వచ్చింది. అదృష్టవశాత్తతో ప్రాణాలు పోలేదు ఆ గాయాలతో నొప్పులతో మెల్లగా పైకి లేచాడు ఫోన్ పగిలిపోయింది జేబులో ఉన్న వాలెట్ ఎక్కడో పడిపోయింది కనీసం ఒక్క రూపాయి కూడా జేబులో లేదు ఆ నొప్పులతోనే కుంటుకుంటూ కొండ దిగి నడిచాడు దూరంగా దీపాలు కనిపించాయి అదిఒక చిన్న కొండ కింద గ్రామం ఆకలితో భయంకరమైన నీరసంతో అక్కడ ఉన్న ఒక చిన్న ఇంటి తలుపు తట్టాడు.
(01:54) తలుపు తెరిచింది ఒక సాధారణ మహిళ. ఆమె వెనక ఆమె భర్త ఒక చిన్న పాప అదొక చాలా పేద కుటుంబం మట్టి గూడలతో ఉన్న ఒకే ఒక్క గది ఇల్లు వాళ్ళది శేఖర్ గాయాలు చూసి వాళ్ళు ఏ మాత్రం భయపడలేదు వెంటనే లోపలికి తీసుకొచ్చారు గాయాలకు కట్టు కట్టారు తమ దగ్గర ఉన్న ఆ కొద్దిపాటి ఆహారాన్ని అతనికి పెట్టారు. ఆ చలి రాత్రి శేఖర్ కి కప్పుకోవడానికి ఒక కంబళీ ఇచ్చారు ఆ రాత్రికి ఆశ్రయం ఇచ్చారు.
(02:17) మరసటి రోజు ఉదయం శేఖర్ వాళ్ళకి థాంక్స్ చెప్పి బయలుదేరబోతున్నాడు. సరిగ్గా అప్పుడు ఆ పేద రైతు తన జేబులో నుంచి కొన్ని వందల రూపాయలు తీశడు. బహుశా ఆ వందల రూపాయలు ఆ పేద కుటుంబానికి అవి 10 రోజుల ఖర్చు అవి తీసుకొచ్చి శేఖర్ చేతిలో పెట్టి ఇలా అన్నాడు సార్ ప్రమాదంలో మీవన్నీ పోగొట్టుకున్నట్టు ఉన్నారు మీరు మీ వాళ్ళని చేరుకునే వరకు దారి ఖర్చులకి ఉపయోగపడతాయి ఉంచుకోండి అన్నాడు.
(02:37) శేఖర్ ఒక్కసారిగా షాక్ అయ నిల్చున్నాడు. తన దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కానీ జీవితంలో ఏ ఒక్కరికి ఒక్క పైసా సహాయం చేయలేదు. కానీ ఈ పేదవాడు కనీసం తినడానికి తిండి లేకపోయినా తన నోటి దగ్గర అన్నం ఒక అపరిచితుడికి ఇస్తున్నాడు. శేఖర్ ఆపుకోలేక అడిగాడు ఈ డబ్బుతో మీకు 10 రోజులు ఇల్లు కడుస్తుంది కదా మీరే ఎంతో కష్టంలో ఉన్నారు మరి నాకు ఎలా ఇస్తున్నారు అప్పుడు ఆ రైతు చిన్నగా నవ్వి ఒక మాట అన్నాడు ఆ మాట శేఖర్ చెంప మీద లాగి కొట్టినట్టు అనిపించింది.
(03:03) రేపటికి మనకి ఉండదేమోనని ఈరోజు ఎదుటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోకపోతే ఇక సాటి మనిషిగా పుట్టటం ఎందుకు సార్ ఆ ఒక్క మాటకి శేఖర్ కి గుండె ఆగినట్లు అనిపించింది. 10 తరాలు తిన్నా తరగని ఆస్తి ఉన్నా ఒక్క పది రూపాయలు కూడా తీసి ఎవరికీ ఇవ్వని దరిద్రం తనది 10 రోజులకు మాత్రమే తినడానికి డబ్బు ఉన్నా ఆ డబ్బు మొత్తాన్ని ఒక ముక్కు మొహం తెలియని వాడికి సహాయం చేస్తున్న సంపద వాళ్ళది పైగా ఆ పేద దంపతుల మొహంలో తన దగ్గర వందల కోట్లు ఉన్న ఎప్పుడూ లేని ఒక సంతోషం ఒక అద్భుతమైన ప్రశాంతత కనిపిస్తుంది. ఇంతలో ఇంకో సంఘటన జరిగింది.
(03:36) ఆ ఇంట్లో ఉన్న ఆ చిన్న పాప లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి తన డబ్బులు తాసుకున్న డబ్బాలో నుంచి ఒక ప రూపాయలు తీసుకొచ్చి అంకుల్ ఇవి కూడా తీసుకోండి అని ఆయన చేతిలో పెట్టింది. శేఖర్ కళ్ళలో నుంచి దారగా నీళ్ళ వస్తున్నాయి. ఆ పసిపిల్లకి ఉన్న ఆ ఇచ్చే గుణం ఆ గొప్ప మనసు ఒక కోటీశ్వరుడైన తనకి లేదు కదా అని కదిలిపోయాడు.
(03:56) ఇంగ్లీష్ లో ఒక గొప్ప లైన్ ఉంది ద పూరెస్ట్ మన్ ఇస్ నాట్ ద వన్ వితౌట్ రూపీ బట్ ద వన్ వితౌట్ ద హార్ట్ టు గివ్ అంటే ఈ ప్రపంచంలో అత్యంత పేదవాడు జేబులో రూపాయి లేనివాడు కాదు ఎదుటివాడికి ఇచ్చే మనసు లేనివాడే నిజమైన పేదవాడు ఆ క్షణంలో శేఖర్ కి స్పష్టంగా అర్థమయింది వందల కోట్లు ఉన్న తన ఒక అనామక పేదవాడు ఆ కొన్ని వందల రూపాయలు మాత్రమే ఉన్న ఆ రైతు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు మనలో కూడా చాలామంది అచ్చం శేఖర్ లాగే ఆలోచిస్తుంటాం నేను రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇది వేరే వాళ్ళకి నేనుఎందుకు ఊరికే ఇవ్వాలి నేను నా రక్తాన్ని దారబోసి కష్టపడి సంపాదిస్తే వాళ్ళు మాత్రం
(04:30) కూర్చొని ఫ్రీగా తింటారా ఈ వాదనలో ఒక లాజిక్ ఉంది కాదనట్లేదు కానీ ఒక చిన్న ప్రశ్న చాలా సున్నితంగా ఆలోచించాలి మీకన్నా 1000 రెట్లు ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులు అయిన వ్యక్తులు రతన్ టాటా వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఎందుకు తమ సంపదలో అత్యధిక భాగాన్ని ఈ సొసైటీకి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి రతన్ టాటా గారు తన సంపదలో దాదాపు 65% సొసైటీ కోసం ఇచ్చేశారు.
(04:55) వారెన్ బఫెట్ తన సంపదలో ఏకంగా 99% దానం చేస్తానని అధికారికంగా ప్రకటించారు. వారెన్ బఫెట్ ద గివింగ్ ప్లెడ్జ్ అని ఒకటి మొదలు పెట్టారు అందులో 200 మందికి పైగా బెలినీయర్స్ వాళ్ళు సగం సంపదని దానం చేస్తామని ప్లెడ్జ్ చేశారు. వీళ్ళంతా స్టూపిడ్స్ అంటారా వీళ్ళకి డబ్బు విలువ తెలియదా వాళ్ళు ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక పచ్చి సత్యాన్ని గ్రహించారు ఎంత సంపాదించినారా అని తృప్తి సంపాదించిన దాంట్లో కొంత ఎదుటివాడికి ఇవ్వటంలో మాత్రమే ఉంది అని వాళ్ళకి అర్థమయింది. దీని గురించి వారెన్
(05:27) బఫెట్ ఒక అద్భుతమైన మాట అన్నారు ఇఫ్ యు ఆర్ ఇన్ లకీయస్ట్ 1% ఆఫ్ హూమానిటీ యు ఓవ ఇట్ టు ద రెస్ట్ ఆఫ్ హ్యూమానిటీ టు థింక్ అబౌట్ ద అదర్ 99% అంటే నువ్వు గనుక ఈ ప్రపంచంలో అదృష్టవంతులైన ఒక్క శాతంలో ఉంటే కష్టాల్లో ఉన్న మిగతా 99% మనుషుల గురించి ఆలోచించటం నీ బాధ్యత ఇక్కడ చెప్పేది సంపాదన అంతా రోడ్డు మీద పడేసి పనిచేయమని కాదు పక్కవాళ్ళు సంతోషంగా లేకుండా ఏడుస్తూ ఉంటే మనం మాత్రమే ఆనందంగా ఉందామ అనుకుంటే అది అసాధ్యం లగ్జరీస్ మధ్యలో మనం ఉండొచ్చేమో కానీ మన లోపల మాత్రం ఆనందం ఉండదు.
(06:03) మన హృదయంలో కే ఐఎన్ డి ఎల్ ఓవ లేకుండా దయ ప్రేమ లేకుండా మనకు ఆనందం రావడం ఇంపాజబుల్ ఈ సత్యాన్ని వేల సంవత్సరాల క్రితం ద్వారకా నగరంలో ఒక మహారాజు చాలా బాధాకరమైన పద్ధతిలో నేర్చుకున్నాడు. ఆ రాజు పేరు సత్రాజిత్తు ద్వారకా నగరం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నివసించే నగరం అక్కడ సత్రాజిత్తు అనే ఒక ప్రముఖుడు ఉండేవాడు అతను సూర్య భగవానుడికి పరమ భక్తుడు సత్రాజిత్తు తీవ్రమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకి సూర్య భగవానుడు ప్రత్యక్షమై అతనికి శమంతక మణి అనే ఒక దివ్యమైన మణిని వరంగా ఇచ్చాడు.
(06:33) ఆ మణి శక్తి అపారం అది రోజుకి ఎనిమిది భారువుల బంగారం అంటే దాదాపు 20 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని ప్రతిరోజు కురిపించేది అంతేకాదు ఆ మణి ఉన్నచోట ఎప్పటికీ కరువు రాదు రోగాలు రావు సత్రాజిత్తు ఆ మణిని మెళలో వేసుకొని దర్జాగా నగరంలోకి వచ్చాడు. ఆ మణి కాంతికి ప్రజలు అతన్ని చూసి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే వచ్చాడేమో అనుకున్నారు.
(06:55) కొన్ని రోజుల్లోనే ఆ సత్రాజిత్తు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుఅయ్యాడు కానీ ఆ సంపద అతనికి ఏం తెచ్చింది విపరీతమైన అహంకారాన్ని తెచ్చింది ఆ డబ్బు మొత్తులో ఆ మనీ పవర్ మొత్తులో సత్రాజిత్తు పూర్తిగా మారిపోయాడు. తన బంధువులని చులకనగా చూడటం మొదలు పెట్టాడు. తన వాళ్ళని పట్టించుకోవడం మానేసాడు అతని ప్రపంచం అంతా ఆ మణి ఆ బంగారమే అయిపోయింది.
(07:15) అతని కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. ఒకరోజు స్వయంగా శ్రీకృష్ణుడు సత్రాజిత్తు దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమగా అడిగాడు సత్రాజిత్తు సత్రాజిత్తు ఆ మణి వల్ల నీ దగ్గర ఇప్పటికే తరిగిపోని సంపద ఉంది కదా ఇక ఆ మణిని గనుక మన రాజు ఉగ్రసేనుడికి ఇస్తే ఆ మణి ఇచ్చే సంపద ద్వారా ద్వారక ప్రజలందరికీ మంచి జరుగుతుంది అని రిక్వెస్ట్ చేశాడు. కానీ సత్రాజిత్తు తన అహంకారంతో నిర్దాక్షణంగా ఆ రిక్వెస్ట్ ని తిరస్కరించాడు.
(07:40) ఇది నామణి ఎవ్వరికీ ఇవ్వను అని మొహం మీదే చెప్పేసాడు. సాక్షాత్తు ఆ భగవంతుడి మాటని కూడా కాదన్నాడు ఆ డబ్బు అతనికి అంత బ్లైండ్నెస్ ని తీసుకొచ్చింది. కానీ ఆ మణికి ఒక లక్షణం ఉంది పవిత్రమైన మనసు ఉన్నవాడికి అది బంగారం ఇస్తుంది కానీ లోభంతో అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి అది మృత్యువుని ఇస్తుంది. ఒకరోజు సత్రాజితు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని సరదాగా మెళలో వేసుకొని అడవికి వేటకు వెళ్ళాడు.
(08:06) ఒక సింహం ప్రసేనుడి మీద పడి అతన్ని దారుణంగా చంపేసింది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి ఆ మణిని తన గుహకు తీసుకెళ్ళాడు. తమ్ముడు తిరిగి రాలేదు ఇప్పుడు సత్రాజిత్తు ఏం చేశడో తెలుసా ఆ మణి పోయిందన్న పిచ్చిలో కృష్ణుడికే కదా నా మణి కావాల్సింది ఆ కృష్ణుడే నా తమ్ముడిని చంపి నా మణని దొంగిలించాడు అని సాక్షాత్తు భగవంతుడి మీదే హత్యాగరం మోపాడు. ఈ అపనింద ద్వారక నగరం అంతా వ్యాపించింది ఒక్కసారి గమనించండి ఆ డబ్బు సత్రాజిత్తుని ఎక్కడికి తీసుకొచ్చింది సొంత తమ్ముడిని పోగొట్టుకున్నాడు ఒక మంచి వ్యక్తి మీద నింద వేశడు అందరికీ భద్ర శత్రువయ్యాడు తన మనశశాంతిని పూర్తిగా పోగొట్టుకున్నాడు.
(08:39) అప్పుడు శ్రీకృష్ణుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆ మణిని వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు జాంబవంతుడితో ఏకంగా 28 రోజులు భీకర యుద్ధం చేశాడు చివరికి ఆ మణి తీసుకొచ్చి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేసాడు. ఇదిగో నీ మణి నేను దొంగిలించలేదు అని చెప్పాడు. అప్పుడు సత్రాజిత్తుకి కళ్ళు తెరుచుకున్నాయి జ్ఞానోదయం అయింది కన్నెళ్ళతో వెక్కి వెక్కి ఏడుస్తూ అనుకున్నాడు ఈ మణి నాకు రోజుకి 20 కిలోల బంగారం ఇచ్చింది కానీ ఏం లాభం ఆ సంపద వల్ల నా బుద్ధి పాడైపోయింది సొంత తమ్ముడిని కోల్పోయాను భగవంతుడి మీదే దారుణమైన నింద వేశను అందరికీ శత్రువు
(09:10) అయ్యాను చివరికి ఏం మిగిలింది ఒంటరితనం పశ్చాత్తాపం ఘోరమైన అవమానం. అప్పుడు సత్రాజిత్తు వెంటనే ఆ మణిని తీసుకెళ్లి కృష్ణుడి పాదాల దగ్గర పెట్టాడు కృష్ణ నాకు ఈ డబ్బు వద్దు ఈ మణి వద్దు నేను తప్పు చేశాను నా మనుషులు నా వాళ్లే నాకు ముఖ్యం దయచేసి దాన్ని నువ్వే తీసుకో అని చేతులుఎత్తేసాడు ఇంగ్లీష్ లో ఒక డీప్ లైన్ ఉంది ఇట్ ఇస్ నాట్ ద మన్ హ హస్ టూ లిటిల్ బట్ ద మన్ హూ క్రేవస్ మోర్ దట్ ఇస్ పూర్ అంటే తక్కువ ఉన్నవాడు పేదవాడు కాదు ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ కావాలి అని ఆరాటపడేవాడే నిజమైన పేదవాడు సత్రాదిత్తు దగ్గర ప్రపంచంలోనే అత్యధిక సంపద ఉంది కానీ
(09:45) అతనే అత్యంత పేదవాడయ్యాడు. సత్రాజిత్తు ఎవరో కాదు ఇవాల్టి ఈ సమాజంలో డబ్బే సర్వస్వం అనుకునే ప్రతి మనిషి ఒక సత్రాజిత్తే చూడండి డబ్బు వెంట గుడ్డిగా పరిగెడుతూ పిల్లల చిన్నతనాన్ని మిస్ అవుతాం భార్యతో గడిపే టైం ఉండదు కన్న తల్లిదండ్రులని పట్టించుకోం బంధువులని అసలు లెక్క చేయం ఆరోగ్యం నాశనం అవుతుంది. చివరికి కోట్లు సంపాదించాక ఒక పెద్ద ఇంట్లో అనాధల్లాగా ఒంటరిగా మిగులుతాం తర్వాత కొన్ని రోజులకి పోతాం.
(10:10) ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. మనం ఒక లేని వాడికి సహాయం చేసేటప్పుడు నేను వాళ్ళని ఉద్ధరిస్తున్నాను అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు ఎందుకంటే మనం చూడకపోయినా కింద ఉన్న వాళ్ళందరినీ చూసుకోవడానికి పైన ఒకడు ఉన్నాడు మనక ఇచ్చే బుద్ధి పుట్టకపోతే ఆ బుద్ధి వేరే వాళ్ళకి పుట్టిస్తాడు ఎవరికి ఏది దక్కాలో అది వాళ్ళకి ఖచ్చితంగా దక్కేలా చేస్తాడు.
(10:28) నువ్వు ఇవ్వకపోతే వాళ్ళకి ఏమి నష్టం లేదు నువ్వు నీ జీవితంలో ఆ తృప్తిని మిస్ అవుతావ్. ఇచ్చేది వాళ్ళ కోసం కాదు నీ తృప్తి కోసం నీ సొంత మనశశాంతి కోసం ఒక 10 రూపాయలు లేని వాడి చేతిలో పెట్టి ఆ క్షణంలో అతని కళ్ళల్లో ఆనందం చూడు నువ్వు 10 కోట్లు సంపాదించినప్పుడు కూడా రాని తృప్తి ఆ పేదవాడి ఆనందం చూస్తే కలుగుతుంది.
(10:48) విన్స్టన్ చర్చిలో ఒక అద్భుతమైన మాట చెప్పాడువ మేక్ ఏ livingంగ్ బై వాట్ వ గెట్ బట్వ మేక్ ఏ లైఫ్ బైవాట్ వ గివ్ అంటే సంపాదించే దానితో కేవలం మనం జీవనం కొనసాగిస్తాం కానీ మనం ఇతరులకు ఇచ్చే దానితో ఒక నిజమైన జీవితాన్ని నిర్మించుకుంటాం. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఇవ్వటం అనేది మానవ సేవతో మాధవ సేవ చేసి భగవంతుని మనకు మరింత దగ్గర చేసే అత్యంత సులభమైన మార్గం అని చెప్పారు.
(11:10) జీవితంలో ఆ బ్యాలెన్స్ రావడానికి మూడు సింపుల్ ఫార్ములాస్ మాట్లాడుకుందాం మొదటి సూత్రం బ్యాలెన్స్ సంపాదించడం ఎంత ముఖ్యమో ఇవ్వటం కూడా అంతే ముఖ్యం సంపాదన ఒక్కటే చేస్తే నువ్వు సత్రాజిత్తు అవుతావ్ ఇవ్వటం కూడా చేస్తే నువ్వు రతన్ టాటా అవుతావ్ రెండో సూత్రం ఇవ్వటం కోసం సంపాదించు ఎర్న్ టు గివ్ ఇది అత్యంత ముఖ్యమైనది అసలు ఇవ్వటం కోసమే సంపాదించాలన్న ఆ ఆలోచన బలంగా ఉంటే అక్రమంగా సంపాదించాలని అన్న ఆలోచన నీకు రాదు ఎందుకంటే ఇవ్వడం కోసం సంపాదించేవాడు వేరే వాళ్ళ వాళ్ళ దగ్గర అన్యాయంగా లాక్కోడు కదా ఇక మూడవ సూత్రం పిల్లలకి నేర్పు టీచ్ యువర్ చిల్డ్రన్ మీ
(11:45) పిల్లలకి ఇది ఖచ్చితంగా నేర్పండి బాగా సంపాదించు నాన్న కానీ ఆ సంపాదనలో కొంత లేని వాళ్ళ కోసం పక్కన పెట్టు అని సంపాదన మాత్రమే నేర్పితే రేపు సత్రాజిత్తులు అవుతారు ఇవ్వటం కూడా నేర్పితే మంచి మనుషులు అవుతారు. ఇప్పుడు శేఖర్ దగ్గరికి వద్దాం ఆ కొండ గ్రామం నుంచి ప్రాణాలతో తిరిగి వచ్చిన శేఖర్ హిమాలయాలకు వెళ్ళిన శేఖర్ ఒక్కరు కాదు ఆ రైతు అన్న మాట ఆ పసిపిల్ల ఇచ్చిన ఆ 10 రూపాయలు అతని మనసుని పూర్తిగా మార్చేసాయి.
(12:10) శేఖర్ తన జీవితంలో మొదటిసారి తన సంపాదనలో కొంత భాగాన్ని లేని వాళ్ళ కోసం ఇవ్వటం మొదలు పెట్టాడు. మొదటిసారి ఒక పేద విద్యార్థి చదువుకయ్యే ఖర్చుని భరించాడు ఆ క్షణంలో అతను పడిన ఆనందానికి అవధలు లేవు 30 ఏళ్లుగా వందల కోట్లు సంపాదించినప్పుడు రాని తృప్తి ఆ ఒక్క క్షణంలో శేఖర్ కి దొరికింది. ఇది కదా నా జీవితంలో అసలైన తృప్తి అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
(12:30) ఇవాళ శేఖర్ ఒక పెద్ద ఫౌండేషన్ నడుపుతున్నాడు. వందల మంది పేద పిల్లల చదువు బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఇప్పుడు అతను గర్వంగా అంటాడు ఆ రోజు ఆ లోయలో నేను చనిపోయి ఉంటే నా వెయి కోట్లు నాతో రాకపోయేవి ఆ పేద రైతు నాకు నేర్పిన ఆ చిన్న పాఠం నా మొత్తం జీవితాన్ని మార్చేసింది అని మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏడుస్తూ ఉంటే మనం మాత్రమే పగలబడి నవ్వుతూ ఉంటే అది నిజమైన సంతోషం కాదు.
(12:54) సత్రాదిత్తు దగ్గర రోజుకి 20 కిలోల బంగారం ఇచ్చే మణి ఉంది కానీ ఆ మణి ఆ బంగారం తమ్ముడు శవానికి ప్రాణం పోసి బతికించలేకపోయాయి. నో వన్ హస్ ఎవర్ బికమ్స్ పూర్ బై గివింగ్ అంటే ఇవ్వటం వల్ల ఎప్పటికీ ఇంతవరకు ఎవరు చరిత్రలో పేదవాళ్ళు కాలేదు. ఇవ్వటం నిన్ను ఎప్పుడూ పేదవాడిని చేయదు పైగా నిన్ను ఒక గొప్ప మనిషిగా నిలబెడుతుంది. మనం ఎంత సంపాదించినా డబ్బున్నోడు అనే అంటారు కానీ ఒక్క మనిషికి సహాయం చేసినా దేవుడు అంటారు.
(13:17) డబ్బున్నోడిని దేవుడిని చేసేది చేసే సహాయం మాత్రమే కాబట్టి బాగా సంపాదించండి. రాత్రింబవులు కష్టపడి నిజాయితీగా సంపాదించండి కానీ సంపాదనలో కొంత లేని వాళ్ళ కోసం పక్కన పెట్టండి. ఎందుకంటే ఆ కొండ గ్రామంలో ఆ రైతు ఇచ్చిన కొన్ని వందల రూపాయల వెనక ఉన్న ఆ నిజమైన తృప్తి శేఖర్ సంపాదించిన 1000 కోట్లలో కూడా దొరకలేదు. ఇలాంటి సంతోషాన్ని మీరు ఎప్పుడైనా అనుభవించి ఉంటే ఆ అనుభవాన్ని కామెంట్స్ లో రాయండి.
(13:42) మరో పవర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం మర్చిపోకండి సంపాదించండి కానీ ఇవ్వటం మర్చిపోకండి ఎందుకంటే నీ చేతి నుంచి ఇచ్చే ప్రతి రూపాయి నీ గుండెకి ఒక ప్రశాంతతను తెస్తుంది. ఉంటారు జై హింద్ జై శ్రీరామ్.

No comments:

Post a Comment