CONSUMERISM : Why We Buy Things We Don’t Need || This Is Not Hunger. It Is Emptiness.
Author Name:Think Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WF0_f6hfxyw
Transcript:
(00:04) నేను ఆకలి లేనప్పుడు తింటున్నాను. దాహం లేనప్పుడు తాగుతున్నాను. అవసరం లేనివి కొంటూ పనికవచ్చేవన్నీ పారేస్తున్నాను. నడవాల్సిన అవసరం లేదు కానీ కార్లు కొంటున్నాను. మా ఇంటి పక్కనే ఉన్నా సూపర్ మార్కెట్ లోని జంక్ ఫుడ్ ని డైలీ బ్లింక్ ఇట్ లో ఆర్డర్ పెడుతున్నాను. జంకు తింటూ జంక్ అమ్ముతూ సిధిలా వ్యవస్థలోకి కూరుకుపోతున్నాను.
(00:30) కానీ ఎందుకు మనిషి ఎందుకు అవసరం లేనివి కోరుకుంటాడు ఒక పులికి ఆకలివేస్తే వేటాడుతుంది. కడుపు నిండితే పడుకుంటుంది. కానీ మనిషి అలా కాదు వాడి కడుపు నిండాకే అసలు సమస్య మొదలవుతుంది. నేను మాల్ కి వెళ్ళాను అక్కడ నాకు ఒక విచిత్రమైన విషయం అర్థమయింది. ఆ మాల్లో వస్తువులు అమ్మడం లేదు ఆశలు అమ్ముతున్నారు ఒంటరితనాన్ని అమ్ముతున్నారు.
(00:59) అన్నింటికంటే ముఖ్యంగా గుర్తింపుని అమ్ముతున్నారు. రోలక్స్ వాచ్ కొనేవాడు టైం కొనడం లేదు నైకీ షూ కొనేవాడు షూ కొనడం లేదు లగ్జరీ కార్ కొనేవాడు ఇంజిన్ కొనడం లేదు. వాళ్ళు ఫకింగ్ గౌరవం గుర్తింపు అసూయ ఆకర్షణ మోజుని మెప్పుని కొనుగోలు చేస్తున్నారు. ఇది అవసరం కాదు ఐడెంటిటీ క్రైసిస్ ఆకలి తీరడానికి ఒక ప్లేట్ మీల్ సరిపోతుంది. బట్ ఐడెంటిటీకి అంతం లేదు.
(01:31) అది ఇంకా ఇంకా అని అడుగుతుంది. ఫకింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ దాంతో బ్రాండ్స్ పుడతాయి ఫ్యాషన్ పుడుతుంది స్టేటస్ పుడుతుంది కన్స్ూమరిజం ఎక్కువవుతుంది. జవాబుదారితనం తగ్గిపోతుంది. కానీ గమనించావా ప్రెజెంట్ ఒంటరితనం ఒక మార్కెట్ ఒంటరితనాన్ని మార్కెట్ గుర్తించింది. అందుకే ప్రతి యాప్ నువ్వు ఒంటరిగా ఉన్నావా అయితే నీకు నేనున్నా అంటుంది.
(01:59) ఒకప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మనకు భరోసా ఇచ్చేవారు బట్ ఇప్పుడుఇస్గఅమెజon స్విగీన అండ్ బ్లింక్ఇట్ మనకు భరోసా ఇస్తున్నాయి. దీనికి కారణం ఏంటో తెలుసా మనిషి తన రూమ్లో ఒంటరిగా కూర్చోలేకపోవడమే చాలా సమస్యలకు కారణం. కొన్నిసార్లు అవసరం వల్ల కాదు ఖాళీగా ఉండలేక కొనుగోలు చేస్తున్నాం. దానివల్ల ఒకప్పుడు మనిషి వస్తువుల్ని ఉపయోగించుకునేవాడు బట్ ఇప్పుడు వస్తువులు మనుషుల్ని వాడుకుంటున్నాయి.
(02:32) మనం పూర్ పీపుల్ ని ఎందుకు దూరంగా ఉంచుతామో తెలుసా వాళ్ళు అనవసరమైన వస్తువులని వాడుకోరు కాబట్టి నువ్వు వస్తువుల్ని వాడుకోవడం మానేస్తే జనాలు నిన్ను దూరంగా ఉంచుతారు. ఈ రోజుల్లో నీకు కారు లేకపోతే జనం నిన్ను ఎలా చూస్తారు? పోనీ ఫోన్ లేకపోతే ఎలా చూస్తారు? పూర్ పీపుల్ డబ్బు లేని వినియోగదారులు కన్స్ూమర్స్ ఇది ఎంత అసహ్యకరమైన పదమో ఎప్పుడైనా ఆలోచించావా ఒక మనిషిని అలాంటి పదానికి దిగజార్చడం కేవలం సివిలైజేషన్ మనిషికే చెల్లుతుంది.
(03:07) మనిషి బ్రతకడానికి చాలా తక్కువ చాలు కానీ తనలోని ఖాళీని నింపుకోవడానికి ఈ మొత్తం ప్రపంచం కూడా సరిపోదు.
No comments:
Post a Comment