"నీ జీవితాన్ని మార్చే గొప్ప రహస్యం... జనాల మధ్య కాదు, ఒంటరితనంలో దాగి ఉంది." @viswam-vishnuhu
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yaqoN_m6uEY
Transcript:
(00:03) [సంగీతం] ఒక విత్తనం నేలలో ఒంటరిగా పడిపోయింది. చీకటి నిశశబ్దం అక్కడ ఎవ్వరూ ఉండరు. కానీ అదే విత్తనం ఒకరోజు మహా వృక్షంగా మారుతుంది. ఎందుకంటే ఎదుగుదల ఎప్పుడూ గుంపులో జరగదు ఒంటరిగా జరుగుతుంది. అలాగే ఒక డైమండ్ ఒక డైమండ్ తయారవ్వడానికి కొన్ని ఇయర్స్ పాటు ఒత్తిడిని భరించాలి. అలాగే గోల్డ్ గోల్డ్ స్వచ్ఛంగా మారాలి అంటే అది ఖచ్చితంగా అగ్నిని తట్టుకోవాల్సిందే.
(00:39) అలాగే మనిషి గొప్పవాడిగా మారాలంటే కొంతకాలం ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకు మనిషి ఒంటరిగా ఉండలేడు. ఎందుకు ఒక మనిషి ఒక గంట ఫోన్ చూడకుండా మొబైల్ స్క్రీన్ వాడకుండా ఫ్రెండ్స్ తో పిచ్చాపాటీ లేకుండా అసలు ఏ డిస్ట్రాక్షన్ లేకుండా నిశ్శబ్దంగా ఒక గంట సేపు నిశశబ్దంలో కూర్చోలేరు ఎందుకు? ఎందుకంటే మనిషి ప్రపంచం మొత్తాన్ని ఎదుర్కోగలడు కానీ తమని తాము ఎదుర్కోలేరు.
(01:12) ఒక్కసారి ఊహించుకో ఈ ప్రపంచంలో అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయారు. ఫోన్ లేదు ఫ్రెండ్స్ లేరు మాట్లాడడానికి ఒక్క మనిషి కూడా లేరు. నువ్వు పూర్తిగా ఒంటరివి భయంగా అనిపిస్తుందా? అందుకే చాలామంది ఒంటరితనానికి భయపడతారు. కానీ ఒక నిజం తెలుసా ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఏదో ఒక సమయంలో ఒంటరిగా నడిచిన వాళ్లే ఎందుకంటే గుంపు నీకు వినోదాన్ని ఇస్తుందేమో కానీ ఒంటరితనం నీ నిజమైన శక్తిని ఏంటో నీకు చూపిస్తుంది.
(01:47) గుంపులో ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని వింటావు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆత్మ నీతో మాట్లాడడం మొదలు పెడుతుంది నీ శక్తి నిన్ను వెతకడం మొదలు పెడుతుంది. నువ్వు నిజంగా ఎవరు నీ జీవిత లక్ష్యం ఏంటి నీలో ఎంత శక్తి దాగి ఉంది ఇవన్నీ ఒంటరితనంలోనే తెలుస్తాయి. అందుకే ఈరోజు నేను చెప్పబోయేది చాలామంది పారిపోతున్న ఒక విషయం గురించి అదే ఒంటరితనం.
(02:15) కానీ ఈ వీడియో పూర్తఅయ్యేసరికి మాత్రం కచ్చితంగా నువ్వు ఒంటరితనానికి భయపడడం కాదు దాన్ని ప్రేమించడం అయితే స్టార్ట్ చేస్తావ్. ఎందుకంటే చాలా మందికి ఒంటరితనం అంటే ఖాళీ ఎంటీ అనిపిస్తుంది. కానీ నిజానికి ఒంటరితనంలోనే అంతా దాగుంది. ఈ ప్రపంచం నీకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. కానీ నీ గురించి నీకు నేర్పేది మాత్రం ఒక్క ఒంటరినం మాత్రమే [సంగీతం] నిజంగా నువ్వు ఎవరు నీ బలహీనతలు ఏంటి అసలు నీ బలాలు ఏంటి? అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావ్? నీ శక్తి ఏంటి? ఇవన్నీ బయట ప్రపంచం ఎప్పుడూ చెప్పదు నిశశబ్దం మాత్రమే నీకు చెప్తుంది.
(02:55) అందుకే చాలామంది ఒంటరితనాన్ని శాపంగా చూశారు. కానీ చరిత్ర ఒక్కసారి చూడు చరిత్రలో గొప్ప వ్యక్తులు దాన్ని వరంగా మార్చుకున్నారు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి ఇతరుల జీవితాలు చూడడం ఆపేస్తాడు. తన లైఫ్ ని నిర్మించడం స్టార్ట్ చేస్తాడు. అందుకే ఇప్పటి నుంచినే ఇతరులతో కంపారిజన్ ఆపేసేయ్ నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడం స్టార్ట్ చెయ్ ఒకసారి గమనించండి నీ జీవితంలో అత్యంత గొప్ప ఆలోచనలు ఎప్పుడు వచ్చాయి పెద్ద గోల మధ్యన కాదు నిశశబ్దంలో ఉన్నప్పుడే అత్యంత గొప్ప గొప్ప నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నావ్ ఒంటరిగా ఆలోచించినప్పుడు ఎందుకంటే ఒంటరితనం మనసులోని శబ్దాన్ని
(03:41) తగ్గిస్తుంది నీ ఇన్నర్ ఇన్నర్ స్వరాన్ని వినిపిస్తుంది. కానీ ఒక ప్రమాదం కూడా ఉంది దీంట్లో. ఒంటరితనం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నిన్ను బలహీనుడిని చేసేది ఇంకోటి నిన్ను శక్తివంతుని చేసేది. మొదటిది కొంతమంది చాలామంది ఒంటరితనంలోనే ఉంటారు ఎందుకో తెలుసా గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ అప్పుడు అలా జరిగింది వాడు నన్ను మోసం చేశాడే ఆ అమ్మాయి నన్ను మోసం చేస్తుందే అని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటారు. అది ఒక రకమైన ఒంటరితనం.
(04:18) రెండవది భవిష్యత్తుని నిర్మించడానికి తన సమయాన్ని ఉపయోగించడం అందుకే ఒంటరిగా ఉండడం అంటే ఒంటరిగా ఉండడం సరిపోదు ఆ [సంగీతం] టైం ని నువ్వు ఎలా యూస్ చేస్తున్నావు అనేదే ఇంపార్టెంట్ డైలీ కొంత సమయం ఫోన్ లేకుండా సోషల్ మీడియా లేకుండా ఎవ్వరి ఫ్రెండ్స్ లేకుండా ఎవ్వరితోను మాట్లాడకుండా నిశశబ్దంగా కూర్చో ఫస్ట్ లో కొంత కంఫర్టబుల్ ఉండదు అసౌకార్యంగానే ఉంటుంది మనసు అటు ఇటు అదేదో ఆలోచిస్తుంది పాత దానిలోకి నిన్ను తీసుకెళ్తుంది కానీ ఇలా నువ్వు డైలీ చేసే కొద్దీ నీలో ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది.
(05:00) నీ ఆలోచనలు చాలా స్పష్టంగా మారుతాయి నీ గోల్ నీకు స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు ఎందుకు పుట్టావు అనేది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రపంచం నీకు చెప్తుంది ఎప్పుడు బిజీగా ఉండు అని కానీ జ్ఞానులు చెప్తారు కొంతసేపు నిశశబ్దంగా ఉండు ఎందుకంటే బిజీగా ఉండడం వల్ల డబ్బు రావచ్చేమో కానీ నిశశబ్దం వల్ల నీకు దిశా నిర్దేశం అనేది జరుగుతుంది.
(05:25) గుర్తుంచుకో ఒంటరితనం అనేది శిక్ష కాదు ఇది ప్రకృతి మనకిఇచ్చిన ఒక గొప్ప అవకాశం. అది వరమా శాపమా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. నీతో నువ్వు మాట్లాడుకునే అవకాశం ఒంటరితనంలోనే నీ జీవితాన్ని మళ్ళీ పరిశీలించే అవకాశం ఒంటరితనంలోనే నీ అస్సలైన శక్తిని కూడా కనుగొనే అవకాశం ఒంటరితనంలోనే సో ఈరోజు నుండి ఒంటరిగా ఉండడానికి అస్సలు భయపడకు ఎందుకంటే నాకు కూడా ఒంటరితనం అంటే చాలా ఇష్టం.
(05:57) గుంపు నీకు వినోదాన్ని ఇస్తుంది కానీ ఒంటరితనం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. గుంపు నీ టయాన్ని వాళ్ళకు తీసుకునేస్తుంది కానీ ఒంటరితనం నీ ఫ్యూచర్ ని నిర్మిస్తుంది. ఒంటరితనం భయంగా అనిపిస్తే అది నువ్వు ఒంటరిగా ఉన్నందుకు కాదు. ఇంకా నిన్ను నువ్వు తెలుసుకోలేకపోవడం వల్ల. ఈరోజు నిన్ను నువ్వు తెలుసుకుంటే ఒంటరితనం ఎప్పుడూ నీ శత్రువు కాదు అది నీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది.
(06:27) నీ లైఫ్ లో అత్యంత గొప్ప గురువు అవుతుంది. ఒంటరితనం నిశబ్దం అనేది ఎందుకంటే చాలా మందికి ఒంటరితనం అంటే ఎంటీ ఎంటీని తట్టుకోలేరు ఏదో ఒక డిస్ట్రాక్షన్ కావాలి ఏదో ఒక నాయిస్ కావాలి. కానీ నీ శక్తిని నువ్వు తెలుసుకోవాలంటే కచ్చితంగా ఒంటరితనాన్ని నువ్వు ఫేస్ చేయాల్సిందే. ఎప్పుడైతే నువ్వు ఒంటరితనాన్ని ఫేస్ చేస్తావో నీ శక్తి తెలుస్తుంది.
(06:51) నిజానికి ఒంటరితనంలోనే అంతా దాగుంది అనే విషయం నీకు అర్థంవుతుంది. ఈ రోజు నుండి ఒంటరితనాన్ని ప్రేమించడం నేర్చుకో ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.
No comments:
Post a Comment