Friday, December 20, 2024

****అందరూ ఆలోచించి తిప్పి కొట్టాల్సిన విషయం* 💥💥🔥🔥🔥💥💥 *సతీసహగమనం, ముడనమ్మకాలు అనే వారి కోసంమే ప్రత్యేకంగా...*

 *అందరూ ఆలోచించి తిప్పి కొట్టాల్సిన విషయం*
💥💥🔥🔥🔥💥💥
*సతీసహగమనం, ముడనమ్మకాలు అనే వారి కోసంమే ప్రత్యేకంగా...* 
☝️☝️☝️☝️☝️☝️☝️                                                                                                                                                             సతీసహగమనం అనే దురాచారం ఈ దేశంలో ఉండేది... భర్త చనిపోతే భార్యను ఆ చితిలోకే తోసి తగులబెట్టేవాళ్లు ...అంతటి క్రూరులీభారతీయులు...

ఇదీ ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు సాంఘిక శాస్త్రం పాఠాల్లో ఊదరగొట్టారు..మన మెదళ్లలోకి ఎక్కించారు కదా..

బ్రిటీష్ పాలకులు ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు అందులో సతీసహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశారూ.....

ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజారామ్మోహన్ రాయ్  అనే ఓ గొప్ప సంస్కర్తలు అందుకు పోరాటం చేశారు ఆ మూఢాచారంపై బ్రిటీష్ వాళ్లతో కలిసి.. ఇదీ మనం చదువుకున్నది...ఇంకా చదువుతున్నదీ.... వీరు బ్రిటిష్ పెంచిన నక్కలు 🤭

ఏదీ ఇళ్లల్లో అమ్మానాన్నల్ని, బామ్మలు, తాతయ్యల్ని ఒక్కసారి అడగండి...వాళ్ల అమ్మల్నో, అమ్మమ్మల్నో, నాన్నమ్మల్నో ఎందరు సతీసహగమనం చేశారు. ఎందరిని భర్త చితిమీద బలవంతంగా వేసి తగులబెట్టారు...

పొరుగురాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో స్నేహితులను అడగండి వాళ్ల కుటుంబాల్లో ఆ రోజుల్లో అలా జరిగిందా అని...
మీకు ఎవరూ అవును అని చెప్పరు...

ఉత్తరాదిలో ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏదీ వాళ్లనీ అడగండి...

బెంగాల్లో ఓ రెండు ఉదంతాలు, అదీ స్థానిక రాజకీయాలు, వ్యక్తిగత కక్షలతో జరిగాయి...అంతే తప్ప  సతి అనే దురాచారం లేదు మనకు..

బాల్యవివాహాలుండేవి...వితంతువివాహాలు కూడా అగ్రవర్ణంగా చెప్పే ఒకట్రెండు కులాల్లో మాత్రమే నిషిద్ధం ఆనాడు...

అదీ విదేశీ దండయాత్రికుల నుంచి తమ ఆడబిడ్డలను కాపాడుకోవడానికి చిన్నతనంలో పెళ్లిళ్లు చేశారు.

కానీ భర్త చనిపోతే భార్యను తగులబెట్టేంత క్రూరత్వం హైందవంలో లేదు..ఈ దేశంలో అస్సలే లేదు..

సనాతన వైదికధర్మంలో ఎక్కడా సతి లేదు...

దశరథుడు చనిపోతే ముగ్గురుభార్యలెవరూ సతికాలేదు...
భారతంలో మాద్రిని కూడా బలవంతంగా సతి చేయలేదు...
రాజపుత్రుల్లో కూడా సతిలేదు...

రాజ్యాన్ని ముస్లింరాజులు స్వాధీనం చేసుకుని, తమను చెరపట్టడానికి వస్తుంటే రాజపుత్రరాణులు ఆత్పార్పణ చేసుకున్నారు..మ్లేచ్చులకు పరాధీనం అవడం ఇష్టం లేక ఆత్మాభిమానాన్ని చంపుకుని బతకలేమని ఆపని చేశారు. అది  జౌహార్...

ఆడవాళ్లకు చదువుచెప్పాడు సతిని ఆపాడు అందుకే గొప్ప సంస్కర్త అని రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్రని  అంటారు... మిషనరీస్కూల్లో చదివారు.., బ్రిటిష్ వాళ్లతో కలిసి పనిచేశారు మరి..

అసలు సతి ఉన్నప్పుడు వితంతులెట్లా ఉన్నరు...వాళ్లకు పునర్వివాహంపై చర్చెక్కడిది?

ఆ వంగభూమిలోనే పుట్టి....విదేశీ మహిళ సోదరినివేదితను బిడ్డలా సాకి ఆమె ద్వారా మహిళాభ్యున్నతికి, స్త్రీవిద్యకు పాటుపడిన వివేకానందుడు మాత్రం సంస్కర్త అని ఎక్కడా చెప్పలేదు...రాయించలేదు వాడి విద్యావిధానంలో లార్డ్ మెకాలె...

సోదరి నివేదిత ప్రత్యేకంగా బాలికలకోసం పాఠశాలలు నడిపింది...వివేకుడు, శారదామాత మార్గదర్శనంలో....

కానీ వాళ్లు మాత్రం సంఘసంస్కర్తలు కారు...

ఎందుకంటే ఆయన కాషాయం ధరించాడు కనుక...ప్రపంచమంతా తిరిగి భారతీయతను చాటాడు కనుక...భారత నారి గొప్పదనాన్ని దశదిశలా చాటాడు కనుక..

వివేకుడిని మించిన సంఘసంస్కర్త ఎవడున్నాడీదేశంలో....

ఆలోచిద్దాం...🤔

No comments:

Post a Comment