1. *మాతా నాస్తి, పితా నాస్తి,*
*నాస్తి బంధు సహోదరః |*
*అర్థం నాస్తి, గృహం నాస్తి,*
*తస్మాత్ జాగ్రత జాగ్రత ||*
తా:- *తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.*
2. *జన్మ దుఃఖం, జరా దుఃఖం,*
*జాయా దుఃఖం పునః పునః |*
*సంసార సాగరం దుఃఖం*
*తస్మాత్ జాగ్రత జాగ్రత ||*
తా:- *ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.*
3. *కామః క్రోధశ్చ, లోభశ్చ*
*దేహే తిష్ఠతి తస్కరాః |*
*జ్ఞాన రత్నాపహారాయ*
*తస్మాత్ జాగ్రత జాగ్రత ||*
తా :- *కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.*
4. *ఆశయా బధ్యతే జంతుః*
*కర్మణా బహు చింతయా |*
*ఆయుక్షీణం న జానాతి*
*తస్మాత్ జాగ్రత జాగ్రత ||*
తా:- *ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.*
5. *సంపదః స్వప్న సంకాశాః*
*యౌవనం కుసుమోపమ్ |*
*విధుఛ్చచంచల ఆయుషం*
*తస్మాత్ జాగ్రత జాగ్రత ||*
తా:- *మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు. యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.*
6. *క్షణం విత్తం, క్షణం చిత్తం,*
*క్షణం జీవితమావయోః |*
*యమస్య కరుణా నాస్తి*
*తస్మాత్ జాగ్రత జాగ్రత ||*
తా:- *ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.*
7. *యావత్ కాలం భవేత్ కర్మ*
*తావత్ తిష్ఠతి జంతవః |*
*తస్మిన్ క్షీణే వినశ్యంతి*
*తత్ర కా పరివేదన ||*
తా:- *ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో, అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు.*
8. *ఋణానుబంధ రూపేణ*
*పశుపత్నిసుతాలయః |*
*ఋణక్షయే క్షయం యాంతి*
*తత్ర కా పరివేదన ||*
తా:- *గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు.*
9. *పక్వాని తరుపర్ణాని*
*పతంతి క్రమశో యథా |*
*తథైవ జంతవః కాలే*
*తత్ర కా పరివేదన ||*
తా:- *పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?*
10.*ఏక వృక్ష సమారూఢ*
*నానాజాతి విహంగమాః |*
*ప్రభతే క్రమశో యాంతి*
*తత్ర కా పరివేదన ||*
తా:- *చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ నవసరములేదు.*
🌹🌹🌹 🌺🕉️🌺 🌹🌹🌹
No comments:
Post a Comment