Saturday, September 6, 2025

 *పుస్తకాలే మనిషిని ఎన్నడూ విడిపోని - నిజమైన నేస్తాలు*

 ఓ ఇద్దరు యువతీ యువకులు రోడ్డు మీద  నడుస్తూ వెళుతున్నారు. 

 సెల్ ఫోన్ చూస్తూ నడుస్తున్న యువతి:-  అబ్బా సుజిత్!  ఇది చూడు ఎంత బావుందో?”  అంటుండగానే ఆ యువకుడి దృష్టి రోడ్డు పక్కనున్న ఓ పాత పుస్తకాల దుకాణం మీద పడడంతో అతను గబ గబా షాపు దగ్గరికెళ్ళి పుస్తకాలను పరికించి చూస్తుండగ,  ఆ యువతి కూడా వచ్చి అతని పక్కన నిల్చుంటుంది. 

సుజిత్ :-  “అనుష్కా! ఈ పుస్తకం చూడు!”  అంటాడు.

అనుష్క:- “ఏంటా  పుస్తకాన్ని చూసి అంత ఎగ్క్షైట్ ఐపోతున్నావ్! ?” 

సుజిత్:- “ఇది నేను ఎన్నాళ్లుగానో చదవాలనుకుంటున్న మున్షీ ప్రేమ్ చంద్ ‘గోదాన్’ పుస్తకం తెలుసా? దీనికోసం నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను. ఆ ఖరికీరోజు అనుకోకుండా దొరికింది”  (పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని పేజీలు తిరగేసి చూస్తూ)  “ అన్నా! ఎంతీ పుస్తకం?” (అంటూ షాప్ అతన్ని అడుగుతాడు). 

షాపతను:- “రెండు వందల యాభై రూపాయలు” 

సుజిత్:- “ఏమైనా తగ్గిస్తారా?”  బేరం ఆడుతాడు.

షాపతను:- ఓ ఇరవయ్యో! ముప్పాయ్యో తగ్గించివ్వండి!” 

అనుష్క:- “సుజిత్! అనవసరంగా ఎందుకు డబ్బులు దండగ.దీనికన్నా కంప్యూటర్లో ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకొని చదువుకోవచ్చుగా?” 

షాపతను:- “మేడమ్! అసలు సిసలు పుస్తకాన్ని చదవాల్సిందే”.

అనుష్క:- పిడియఫ్ లో కూడా ఇదే పుస్తకం దొరుకుతుంది కదా?” 

షాపతను:- దొరికినప్పటికీ పిడియఫ్ లో చదివితే ఏం మజావస్తుంది? మేడమ్!”

సుజిత్ :- అన్నా! ఆవిడ చెబుతుంది కూడా నిజమేగదా?” 

షాపతను:- “ఈ పుస్తకం కాకపోతే నాదగ్గర ఇంకా వేరే హిందీ,ఇంగ్లీష్  పుస్తకాలు  చాలామంది రచయితలవి ఎన్నో వున్నాయి.  నాదగ్గర మీకెంతో సాహిత్యం దొరుకుతుంది.”

సుజిత్:- “అన్నా! ఆన్ లైన్లో పుస్తకం ఫ్రీగా దొరుకుతుంటే ఇంకా కొనడమెందుకు?”  
             
అనుష్క:- “విషయం డబ్బులకు సంబంధించింది కాదు. పర్యావరణాన్ని గురించి కూడా ఆలోచించాలిగదా?”

షాపతను:- “మీరనేదేమిటో నాకు అర్ధం కాలేదు”

అనుష్క:- “నాకో మాట చెప్పండన్నా! ఈ పుస్తకాలు తయారు చేయడానికి కావాల్సిన పేపర్ ఎక్కణ్ణుండి వస్తుంది?” 

సుజిత్:- “చెట్ల నుండి కదా!?”   

అనుష్క:- “కరెక్ట్!  పుస్తకాలు తయారు చెయ్యడానికి  ఎన్నెన్ని  చెట్లు నరకాల్సి వస్తుందో? దానివల్ల ఎంత పర్యావరణ విధ్వంసం జరుగుతుందో? ఎంత కాలుష్యం ఏర్పడుతుందో?  ఒక్కసారి ఆలోచించండి!” 

షాపతను:- ఇప్పటి వరకు నేను పుస్తకాలవల్ల జ్ఞానం పెరుగుతుందని విన్నాను. కానీ, పుస్తకాలవల్ల కాలుష్యం  పెరుగుతుందని మొదటిసారి వింటున్నాను కావచ్చు!?. మీరన్నట్టు పుస్తకాల వల్ల ఎంత కాలుష్యం  పెరుగుతుంది? 

మనం బాత్ రూముల్లో టాయ్ లెట్ పేపర్, హోటల్స్ లో టిష్యూ పేపర్ వాడతాము కదా?. ఆ టిష్యూ పేపర్ని తిరిగి  రీ సైక్లింగ్ చెయ్యలేము కదా?  కానీ, మీరు పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు.మీ మిత్రులతో చదివించవచ్చు.పుస్తకాలు జ్ఞానాన్ని ఇస్తాయి. కాలుష్యాన్ని కాదు.మీరు పుస్తకాలు కొనండి! కొనకపొండి!  అది మీ ఇష్టం. అలాగే మీరు ఆన్ లైన్ పుస్తకాలు చదవడాన్ని కూడా నేను తప్పుపట్టడంలేదు.
ముఖ్యంగా చెప్పాలంటే ఆన్ లైన్లో మీరు చదవాలనుకుంటున్న పుస్తకాలు అన్నీ దొరకవు.  ఎటువంటి పరిస్థితిలోనూ వాటిని మీరు తీసుకుని చదవలేరు. 

కానీ మీ ఎదురుగావున్న ఈ షాప్ లోని పుస్తకాలను తీసుకొని చదువుకోవచ్చు. ఎక్కడి కంటే అక్కడికి తీసుకుపోవచ్చు. కాబట్టి పుస్తకాలు కొని చదవండి! 

మీరు నెలకి ఎంతలేదన్నా రెండు,మూడు సార్లు సినిమాలకు వెళ్తుండొచ్చు? వెళ్ళిన ప్రతిసారీ పదిహేనో వందలో ? రెండువేలో ఖర్చు ఔతుండొచ్చు?  ఒక సినిమాని చూడడం మానేసి, ఆ డబ్బుల్తో ఒక పుస్తకం కొనండి! ఎంతో ప్రయోజనముంటుంది”    

అనుష్క:-  “చూడన్నా!మీదగ్గర ఇంత పరిజ్ఞానం వుండి కూడా ఈ రోడ్డు మీద పుస్తకాలమ్ముతున్నారేంటి!?” 

షాపతను:- “ఇంతకు ముందు ఇక్కడో గ్రంధాలయం వుండేది. జనానికి చదివేంత  సమయంలేక అదికాస్తా మూతపడి పోయింది. నేనా గ్రంధాలయంలో లైబ్రేరియన్ గా పనిచేసేది. ఉద్యోగం పోవడంతో నేనా పుస్తకాలు కొనుక్కొని ఇక్కడపెట్టుకొని జనం మధ్య కొచ్చాను. చదవాలనుకున్న వాళ్ళకు అందజేస్తున్నాను.”      

సుజిత్:- “మీరు చాలా మంచిపని చేస్తున్నారన్నా! మీ దగ్గర ఇంకా ఏ ఏ పుస్తకాలున్నాయో చూపించండి!”

అనుష్క:- “సుజిత్! నేనీ ఎండలో వుండలేను. కార్లో కూర్చుంటాను రా..!” 

షాపతను:- ఇంకో మాట భయ్యా! పుస్తకాలు మనిషికి అన్నింటినీ మించిన మంచి నేస్తాలు. అవి మనను విడిచిపెట్టి వెళ్ళవు”

సుజిత్: “వారెవ్వా! ప్రేమ్ చంద్ ‘గబన్’ కూడా వుందా!?”

@వీడియో సంభాషణ తెలుగు అనువాదం :- శిరంశెట్టి కాంతారావు, ప్రముఖ రచయిత

No comments:

Post a Comment