గుణము తీర్చిదిద్దు గురుదేవ కైమోడ్పు
రుణము దీర్చలేము రుద్రమూర్తి
దేవదూత నీవు దీవించు మమ్ముల
వసుధ మార్గదర్శి వందనమ్ము
గురువు బోధ దారి గొప్పగా జూపిoచ
రుజువు నడత తోడ రూఢికెక్కి
దేవ దేవ యనుచు దివ్యుని కొనియాడి
వందనంబు లిడుదు పాదములకు
గులకరాయినైన మలచుచు రవ్వగ
రుజువుజేసి జూపు లోకమునకు
దేవళమ్ము లేని దేవుడె గురువౌను
వందనమ్ములిడుదు వారి కెపుడు!
గుసగుసలు క్లాసునందున గోలలవగ
రుసరుస బుసబుసలు లేక రోజురోజు
పూసగ్రుచ్చుచు పాఠము బోధజేసి
జరుగుబాటుకు బ్రతికెడి గురువు గొలుతు!
@SRK
No comments:
Post a Comment