🍁రమణ మహర్షి బోధనలు🍁
📚✍️ మురళీ మోహన్
👉1) ఆత్మ శరీరంలో ఎదురు రొమ్ముకు కుడివైపున ఉంది.
2) ‘‘నేను’’ అనేది ఒక మహా మంత్రం. ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది. ఇది భగవంతుని మొదటి నామం.
3) హృదయమే శక్తి కేంద్రం. హృదయం నుండి సహస్రారానికి అమ్రత నాడి ఉంది. ఇది అజ్ఞానిలో మూతపడి ఉంటుంది. జ్ఞానిలో తెరుచుకుని ఉంటుంది. ఇది తెరుచుకోవడమే జ్ఞానం. ఇది తెరుచుకోవడమే మోక్షం.
4) ధ్యానం అంటే ఏమిటి? మనల్ని నిరంతరం వెంటాడే శతకోటి అలోచనల దృష్టి మరల్చి ఒక్క ఆలోచనపై దృష్టి పెట్టడమే ధ్యానం. ఇలా అభ్యాసం చేయగా చేయగా మనస్సుకు శక్తి కలుగుతుంది.
రమణ మహర్షి చెప్పే ధ్యానంలో ప్రత్యేకత ఏమంటే ధ్యానించే వాడినే ధ్యానించాలి. అంటే ధ్యానించేవాడు... ఎవరికి వారే ‘‘నేను’’ కనుక ఆ ‘‘నేను’’ ను పట్టుకోవాలి. ఆ నేను ఎక్కడుందో ఆ మూలాన్ని పట్టుకోవాలి.
5) ఆత్మ విచారణకు సాంప్రదాయకంగా అనేక మార్గాలు ఉన్నాయి. ఈ విచారణలో ఆత్మను, అనాత్మను గురించి విచారించడం జరుగుతుంది. ఈ సాంప్రదాయ మార్గాలకు మనసు ఒక పరికరం. అసలు దోషి అయిన ‘‘నేను’’ ఈ విచారణలో భద్రంగా ఉండి ఎటూ తేలదు...
రమణులు చెప్పిన విచారణ అయిన ‘‘నేనెవరు’’ ఇందుకు పూర్తిగా విభిన్నమైనది. ‘‘నేనెవరు’’ అని తనను తాను వేసుకునే సూటి ప్రశ్న సకల దోషాలకు మూలమైన ‘‘నేను’’ పైనే గురిపెడుతుంది. ఇక్కడ ఇక ‘‘నేను’’ తప్పించుకోవడానికి వీలులేదు.అంటే ‘‘నేనెవరు’’ అనే సూటి ప్రశ్న నేను పైనే నిలబడుతుంది. దాంతో ఇక్కడ అసలు దోషి ‘‘నేను’’ దొరికిపోతాడు.
6) ‘‘నేనెవరు’’ అనే విచారణతో మనస్సు అణుగుతుంది. ఈ ‘‘నేను’’ అనే ఆలోచన మనసులో విచారించే ఇతర ఆలోచనల అన్నింటిని అణగదొక్కి చివరకు మనసే తన ఉనికిని కూడా కోల్పోయి అణిగిపోతుంది. ‘‘నేను’’ అనే ఆలోచన అన్ని ఆలోచనలను నశింపచేసి, తాను నశించును.
7) ‘‘నిజమైన నేను’ ’ఆది అంతంలేని అనంతసాగరం లాంటిది. ఈ అనంత సాగరంలో ‘‘మాయా నేను’’ నీటి బుడగలా ఏర్పడుతుంది.ఈ నీటి బుడగనే జీవుడు(మొదటి ఆలోచన)లేదా వ్యక్తిగత ఆత్మ అంటారు. నిజానికి ఈ బుడగకూడ నీరే,నీరులో బాగమే. ఇది బద్దలైనపుడు పూర్ణసాగరంలో కలిసిపోతుంది. ఈ జీవుడు బుడగగా ఉన్నప్పుడు కూడ సాగరంలో ఒక భాగంగానే ఉన్నది. ఈ సరళ సత్యాన్ని విస్మరించి - ఎన్నో సిద్ధాంతాలు రూపుదిద్దుకున్నాయి.
8) ఆత్మజ్ఞాన అన్వేషికి ‘‘నేను’’ ను విచారించుటే సూటి అయిన మార్గం. అన్నింటికి కారణమైన ‘‘నేను’’ ను విచారించకుండా మనసు, బుద్ధి, ఇంద్రియాలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తే లాభం లేదు. ‘‘నేను’’ పోయిందా, "నేను’’ ను ఆధారం చేసుకుని బతుకుతున్న ఇవన్నీ ఎగిరిపోతాయి. ‘‘నేను’’ అనేది మహా మంత్రం. ‘‘నేను’'అనేది దేవుడి మొదటి పేరు. ఇది ‘‘ఓంకారం కన్నా మహా శక్తి వంతమైనది.
9) ‘‘నేను’’ అనే ఆలోచన పుట్టిన తరువాతే, క్షణం, క్షణం మారే వేలకొద్ది ఆలోచనలు పుడుతున్నాయి. ఇన్ని ఆలోచనలకు మూలమైన, ఇన్ని ఆలోచనలను ఆలోచిస్తున్న ఈ ‘‘నేనెవరు’’ ను నిరంతరం ఆలోచిస్తే ఆ నిజమైన ‘‘నేను’’ అనుభవమవుతుంది.
10) నిద్రపోయే ముందు, నిద్రనుండి మేల్కొన్నవెంటనే ‘‘నేనెవరు’’ను ప్రశ్నించుకోవాలి. ఈ రెండు సమాయాల్లో అఖండ విశుద్ధ ప్రజ్ఞ ఒక్క తృటి కాలం పాటు ఉంటుంది. ఇవి ధ్యానానికి ఉత్తమ సమాయాలు. మనస్సు అప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది.🤘
Source - Whatsapp Message

No comments:
Post a Comment