Tuesday, February 4, 2025

 ఓ అందమైన ‘BF' కథ!.....
ఒక పిల్లాడు ఒక అమ్మాయితో 
'నేను నీకు BF' అన్నాడు......
దానికి 'BF' అంటే ఏంటి? అని 
ఆ అమ్మాయి అడిగింది. ....
అబ్బాయి బదులిస్తూ 
'బెస్ట్ ఫ్రెండ్' అన్నాడు.....

వాళ్లు పెరిగి పెద్దయ్యారు.....
అమ్మాయి అందగత్తెగా తయారైంది.....
అప్పుడు కూడా ఆ కుర్రాడు 
'నేను నీకు BF' అన్నాడు.....
అప్పుడు అమ్మాయి సిగ్గు పడుతూ 
"ఇప్పుడు 'BF' అంటే ఏంటి?” 
అని అడిగింది.....
దానికి ఆ కుర్రాడు 'బాయ్ ఫ్రెండ్' అన్నాడు.....,

కొంతకాలానికి వాళ్లిద్దరూ 
పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నారు.....
అప్పుడు మళ్లీ అతడు 
'నేను నీకు BF' అని చెప్పాడు......
అప్పుడు మళ్లీ ఆమె నవ్వుతూ 
'BF అంటే ఏంటి?' అని ప్రశ్నించింది.....
అతడు తన పిల్లలవైపు చూస్తూ 
'బేబీస్ ఫాదర్' అని బదులిచ్చాడు.....

ఇద్దరూ వృద్ధులయ్యారు.....
ఒకరోజు సాయంత్రం 
తన భార్యతో మాట్లాడుతూ 
'ఇంకా నేను నీకు BFనే' అన్నాడు.....
ఆమె నవ్వుతూ 'ఈ BF అంటే ఏంటో?' 
అని ఆసక్తిగా అడిగింది....
దానికి సమాధానంగా 
అతడు చిన్న స్మెల్ ఇచ్చి 
'బీ ఫరెవర్' అని చెప్పాడు.....

ఆ పెద్ద మనిషి చనిపోతూ కన్నీళ్లతో 
తన భార్యతో 'స్టిల్ I aM Your BF' అన్నాడు....
దానికి ఆ వృద్ధురాలు ఏడుస్తూ ఏమిటీ 
'BF' అని అడిగింది....
దానికి 'బై ఫరెవర్' అని వీడ్కోలు పలికాడు....

కొన్నాళ్లకు ఆ పెద్దావిడ కూడా 
కన్నుమూశారు..,. 
వాళ్ల పిల్లలు తమ పేరెంట్స్ ఫొటోపై 
'BF అంటే బిసైడ్ ఫరెవర్ ..,
(ఎప్పటికీ తోడుగా ఉండటం)' అని రాశారు.🫰🏻❤️

No comments:

Post a Comment