Tuesday, March 25, 2025

 🙏 *రమణోదయం* 🙏

*అల్పమైన మనస్సు జ్ఞప్తి, విస్మృతిలాగ వికారం చెందటమే, జనన మరణమనే సంసారం. జ్ఞప్తి విస్మృతిలనే చేష్టలుడిగితే ఆ హృదయమే జన్మరాహిత్యం. శుద్ధముక్తి ఆత్మస్వరూపం అవుతుంది.*

వివరణ : *తలపే జన్మం, మరుపే మరణం, మనో వ్యాపారాలే సంసారబంధం అంటే. ఈ జ్ఞప్తి, మరపు రూపమైన దాని మాలిన్య స్థితి పోయి, స్వరూపాన్నే ప్రతిఫలించి యుండటమే మనోనాశనం. అదే ముక్తి అని తెలుస్తుంది.*

పంచభూతాలు ఈశ్వరుని పంచముఖాలు.
మరి మనకు
ఈశ్వర దర్శనం కానిదెప్పుడు??🙏

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.613)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?

No comments:

Post a Comment