_*🫵 సాధన ? దేనికి సాధన ?*_
*_ఏముంది సాధన చేయడానికి !?_*
➖➖➖➖➖➖✍️
*_✨ -(భగవాన్ శ్రీరమణ మహర్షి)_*
*_✳️ ఒకసారి ఒక భక్తుడు భగవానుని సాధన గురించి ప్రశ్నింపగా భగవాన్ ఇట్లా అన్నారు. సాధన ? దేనికి సాధన ? ఏముంది సాధన చేయడానికి ? ఇలా కూర్చోవడమే సాధన. ఎల్లప్పుడూ ఇలాగే కూర్చొని ఉండేవాణ్ణి. అప్పటికి ఇప్పటికీ తేడా ఒక్కటే. అప్పుడు కళ్ళు మూసుకునే వాడిని. కాకపోతే ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను. నేను తప్ప వేరొకటి ఉంటే కదా సాధన. తనను తాను చూడక అశాశ్వతమైన శరీరాన్ని చూసి భ్రమించేవాడికి అటువంటి భ్రమను వీడుటకు సాధన అవసరమని భగవాన్ చెప్తారు._*
*_జ్ఞాని అయిన పిదప అనగా ఆత్మజ్ఞానము పొందిన వారు ఆత్మగానే ఉండేవారికి ఏ సాధనతో పనిలేదని గ్రహించవలెను. ఊరికే ఉన్న చోటున కూర్చొని ఆత్మను ఎరుకతో ఉంటే చాలు. సాధన శరీర వ్యామోహం కలిగిన వారికి ఆ అవిధను తొలగించుటకు ఉపయోగపడేది._*
*_భగవాన్ ఒక్క నేను తప్ప మరొకటి లేదు అనే దృఢ నమ్మకంతో ఉన్నారు. కాబట్టే వారు నేను తప్ప వేరొకటి ఉంటే కదా సాధన అని అన్నారు. మరియొక సందర్భంలో భగవాను వారికి గురువులేరని చెప్పారు. కానీ సాధన చేసే వారికి గురువు ఎంతో అవసరం అని, శరీరమే తానని అనుకున్న వారికి మనో వ్యాపారాల బ్రాంతిలో ఉన్నవారికి, ఆ భ్రమనీ తొలగించడానికి గురువు అవసరం అని భగవాన్ చెప్పారు._*
*_భగవాన్ శ్రీరమణ మహర్షి సాక్షాత్తు కుమారస్వామి అవతారం అని ముందుగానే చెప్పుకున్నాము. దీనికి నిదర్శనంగా ఒక భక్తుడు ఎన్నో యేళ్ల నుండి సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని జపిస్తున్నప్పటికీ ఆ స్వామి సాక్షాత్కరించలేదని నిరుత్సాహముతో భగవానుకి చెప్పగా భగవాన్ పక్కనున్న మరియొక భక్తుడు ఇలా అన్నారు.. మీ ఎదుట ఉన్న వారు ఎవరనుకుంటున్నారు ? అని అనగా ఆ భక్తుడు తదేకముగా స్వామిని చూసి ఆనందముతో పొంగిపోయినారు._*
*_త్రివేణి గిరి స్వామి అనే మరియొక సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు తిరుచందూర్ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఉంటూ కాలం గడిపే రోజులలో వారు ధ్యానములో ఉండగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఇట్లనెను. నేను ఇక్కడ మాట్లాడని దేవుడిగా ఉన్నాను. తిరువన్నామలైలో మాట్లాడే, నడిచే దేవుడిగా ఉన్నాను అక్కడికి వెళ్ళు అని అన్నారు._*
*_భగవాన్ ధ్యానం గురించి చెప్తూ తలంపులను ఎప్పుడైతే తీసివేస్తామో అదే ధ్యానం అని తలంపులు ఎప్పుడు ఉంటాయని వాటిని తొలగించడానికి ఒక సంకల్పంపైన దృష్టిని ఉంచటమే ధ్యానమని అటువంటి అభ్యాసము చేయగా చేయగా మనసుకు శక్తి కలుగుతుంది అని చెప్తూ భగవాన్ తన ధ్యాన మార్గము దీనికి భిన్నమైనదని ధ్యానించే వాడినే ధ్యానించాలని అనగా ఆ నేనును పట్టుకొని దాని మూలాన్ని కనుక్కోవాలని ఇలా చేయగా నిజమైన నేను అనగా ఆత్మ స్వరూపముగా మిగులుతుందని చెప్పారు._*
*_అసలు నేను అను తలంపు పుట్టిన తరువాతే ఈ నేనును ఆశ్రయించుకొనే మరెన్నో తలంపులు పుడతాయని కావుననే ఈ నేను ఎవరు అని నిరంతరము ప్రశ్నిస్తే ఈ నేను అదృశ్యమై నిజమైన నేను తెలుస్తుందని భగవాన్ చెప్పినారు._*
*_భగవాన్ దీనికొక ఉపాయాన్ని కూడా చెప్పి. నిద్రపోయే ముందు, మేల్కొనిన తర్వాత నేనెవడనని ప్రశ్నించుకోమన్నారు. ఈ నేను అనునది ఆత్మనుండి పుట్టుకు వస్తుంది. కనుక నేను పై ధ్యాస ఉంచి నేను పట్టుకుంటే ఆత్మలోకానికి వెళ్తామని భగవాన్ రహస్యాన్ని చెప్పినారు._*
*_అసలు ఆత్మను తెలుసుకున్న వాడే నిజమైన పుట్టినవాడని ఆ రోజే పుట్టినరోజు అని చెప్పారు. కావున భగవాన్ సూచించినది ఏమనగా ప్రతి మనిషిలో రెండు నేనులు ఉంటాయని ఒకటి మిధ్యా నేను మరొకటి సత్య నేను. తన్ను తాను విచారించగా మిద్యా నేను అదృశ్యమై నిజమైన నేను మిగులుతుందని ఇదే ముక్తి మరియు మోక్షం అని భగవాన్ చెప్పారు._*
*_కావున ముక్తి, మోక్షం అంటే అవేవో మనము మరణించిన తర్వాత మరేదో లోకంలో పొందుతామని కాదు. ప్రతివారు ఆ రెండు నేనులలో ఉన్న మిధ్యా నేను తొలగించుకొని అసలైన నేను పట్టుకుంటే ఆ పట్టుకున్నవాడు తాను జీవించి ఉండగానే ముక్తుడు అవుతాడు. అనగా అతడే జీవన్ముక్తుడు. అతనికి మోక్షం కలిగినట్లే. మరి ఈ మిధ్య నేను వదులుటకు మరియు అసలైన నేను పట్టుకొనుటకు కావలసిన శక్తిని భగవానుని మనమందరము వేడుకుందాం. మనము జీవించి ఉండగానే జీవన్ముక్తులం అవుదాం. మోక్షమును పొందుదాము. కావున భగవానుని పరిపూర్ణముగా సర్వశ శరణాగతి అంటూ వేడుతూ ఓ భగవాన్ నీవే మాకు శరణాగతి అరుణాచల శివ.*
No comments:
Post a Comment