Sunday, March 23, 2025

 *భగవంతుని సహాయం ఎలా లభిస్తుంది?!*

*"భగవంతుడా! నాకు శక్తిని ఇవ్వు!" అని అడగకూడదు. భగవంతుని నుండి శక్తిని తీసుకోవాలి.*

*"నాకు శక్తినివ్వు, కాంతినివ్వు" అని సూర్యున్ని అడుగుతామా? లేదు కదా?! సూర్యకాంతిలో లేదా ఎండలో కూర్చుంటే, సహజంగానే మనం వాటిని గ్రహిస్తాము.*

*శాంతి సాగరుడైన పరమాత్మ శాంతి యొక్క వైబ్రేషన్స్ ని స్థిరంగా రేడియేట్ చేస్తున్నారు. మనం వాటిని ఎంతగా గ్రహించి స్వయంలో ధారణ చేసుకుంటూ ఉంటే అంతలా మనకు అనుభవం అవుతూ ఉంటుంది.*

*అలా కాక, రోజుకి పది సార్లు.. "భగవంతుడా! శక్తినివ్వు" అని ఆడిగితే అది జరిగే పని కాదు.*

*ఎవరినైతే మనం స్మృతి చేస్తామో, వారి ఫ్రీక్వెన్సీతో మనం కనెక్ట్ అయిపోతాము. ఎంత సమయం మనం ఒకరి గురించి ఆలోచిస్తే, అంత సమయం ఆ వ్యక్తి యొక్క వైబ్రేషన్స్ తో కనెక్ట్ అవుతాము.*

*ఇప్పుడు మనం రోజూ... ఒక్క ఆలోచన క్రియేట్ చేద్దాం.*

*"నేను శక్తిశాలి ఆత్మను, శక్తి సాగరుడైన పరమాత్ముని ముందు కూర్చున్నాను. పరమాత్మ సర్వ శక్తివంతుడు, ఆత్మనైన నాలో అతని సర్వశక్తులు  నిండుతున్నాయి." అనే సంకల్పం చేస్తూ, దానిని విజువలైజ్ చేసుకోవాలి.*

*భగవంతుడు అనంతమైన ప్రేమ, శక్తి మరియు శాంతి యొక్క మూలం. మనం అడిగినప్పుడే తాను రేడియేట్ చేయరు. తాను స్థిరంగా రేడియేట్ చేస్తూనే ఉంటారు. మనం ఎప్పటి వరకైతే ఆత్మిక స్థితిలో కూర్చుని, తన నుండి శక్తులను తీసుకొని స్వయంలో నింపుకోమో... అంతవరకు మనం తీసుకునేందుకు పాత్రులుగా అవ్వము. భగవంతుడు సదా ఇస్తూనే ఉన్నారు.* 

*ఓం...*
*ప్రతిరోజు 10 నిమిషాలు పరమాత్ముని మీద ప్రేమతో ఓంకారం, ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఆనందంగా శక్తివంతంగా ఉందాం*

*┈┉┅━❀꧁జై శ్రీకృష్ణ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌺🌹🌺 🙏🕉️🙏 🌺🌹🌺

No comments:

Post a Comment