Sunday, March 30, 2025

 *🌺 ఆదిత్యుని విశిష్టత - శ్రీ ఆదిత్య కవచం🌺*

సూర్యుడు సమస్త సృష్టికి వెలుగును ప్రసాదించేదైవం.  
ఆదిత్యహృదయం, సౌరసూక్తం, సూర్యనమసన్మారములు 
ద్వారా రోగములు నివారింపబడతాయన్నది పురాణఉవాచ.
 
రుగ్మతలతో పాటు దారిద్రము తీర్చగలిగే శక్తిమంతుడు శ్రీ 
సూర్యనాయకుడు. దారిద్యమునకు ములకారకుడైన శనిమవాదేవుడు ఈ సూర్యనారాయణుని సుపుత్రుడు కనుక, సూర్యారాధన  దారిద్యమును నిర్మూలింపగలదు.

పురాణ ఇతిహాసములందు శ్రీ సూర్యనారాయణుని మహిమకు ఎన్నో తార్కణములు కనిపిస్తాయి.

1) వశ్వామిత్ర మహర్షిచె సృష్టింపబడినటువంటి గాయత్రి మంత్రము సూర్యనారాయణుడికే అర్పితం చేయబడింది.
 
2) అరణ్యవాస మందు ధర్మరాజు సూర్యోపాసన చేసి అక్షయపాత్ర 
పొందాడు.

3) యజ్ఞవల్కనుకి, ఆంజనేయునికి వేదశాస్తములు నేర్పింది సూర్యుడే.
 
4) శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడిని కుష్టురోగమునుండి 
విముక్తి  కల్పించారు సూర్యుడే 
 
5) సూర్యభగవానుడి వ్రభాత కిరణములు సంజ్ఞాకిరణములు 
గృహమునందు క్రమం తప్పకండా నిత్యము ప్రసరించినచో ఆ ఇంట నున్న వాస్తు దోషములు తొలగిపోవును. భూత ప్రేత పిశాచములు చేరవు.

*🌹🙏  శ్రీ ఆదిత్య కవచం*

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతి కరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్||

అస్య శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామన్త్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానం :–🌹🙏

జపా కుసుమ సంకాశం ద్విభుజం పద్మహస్తకమ్|

సిన్దూరాంబర మాల్యం చ రక్తగంధానులేపనమ్ |

మాణిక్యరత్నఖచిత-సర్వాభరణభూషితమ్|

సప్తాశ్వరథవాహం తు మేరుం చైవ ప్రదక్షిణమ్ ||

దేవాసురవరైర్వన్ద్యం ఘృణిభిః పరిసేవితమ్ |

ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ||

🌷కవచం :–🌷

ఘృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్ |
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు దివాకరః ||

ణం పాతు సదా భానుః ముఖం పాతు సదారవిః |

జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః ||

స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః |

కరావబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః ||

ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ |

ఊరూ పాతు సురశ్రేష్టో జానునీ పాతు భాస్కరః ||

జంఘే మే పాతు మార్తాణ్డో గుల్ఫౌ పాతు త్విషాంపతిః |

*పాదౌ దినమణిః పాతు పాతు మిత్రోఽఖిలం వపుః ||

ఆదిత్యకవచం పుణ్యమభేద్యం వజ్రసన్నిభమ్ |

సర్వరోగభయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః ||

సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యపదవీం లభేత్ |

అశేషరోగశాంత్యర్థం ధ్యాయేదాదిత్యమండలమ్ ||

🌷ఆదిత్య మండల స్తుతిః :–🌷

అనేకరత్నసంయుక్తం స్వర్ణమాణిక్యభూషణమ్ |

కల్పవృక్షసమాకీర్ణం కదంబకుసుమప్రియమ్ ||

సిందూరవర్ణాయ సుమండలాయ సువర్ణ రత్నాభరణాయ తుభ్యమ్ |

పద్మాదినేత్రే చ సుపంకజాయ బ్రహ్మేన్ద్ర-నారాయణ-శంకరాయ ||

సంరక్త చూర్ణం ససువర్ణతోయం సకుంకుమాభం సకుశం సపుష్పమ్ |

ప్రదత్తమాదాయ చ హేమపాత్రే ప్రశస్తనాదం భగవన్ ప్రసీద ||

ఇతి ఆదిత్యకవచమ్ ||

ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతి కరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్||🙏🌹

No comments:

Post a Comment