*ఒక పని చేసినప్పుడు అది సిద్ధిస్తుంది లేదా సిద్ధించదు...*
*అప్పుడు చేసిన పని వృధా అవుతుంది. ఒక్కోసారి గెలుస్తాము, మరొసారి ఓడిపోతాము. లాభం వస్తుంది, నష్టం వస్తుంది.
పంటకోసి కుప్ప వేయంగానే భోరున నాలుగు రోజులు వాన. పంట నాశనం అవుతుంది. ఇలాంటివి జరుగుతాయి. మరి పంట నాశనం అయితే, నష్టం వస్తే ఏడవకుండా ఎలా ఉండటం అని ప్రశ్నవేయవచ్చు.
ఏడిస్తే పోయిన పంట తిరిగి వస్తుందా!
వచ్చిన నష్టం లాభంగా మారుతుందా!
అలా అయితే నష్ట వచ్చిన ప్రతివాడూ భోరున ఏడుస్తాడు, కాని అలా జరగడం లేదు.
నష్టం ఎందుకు వచ్చిందో తెలుసుకొని అలా రాకుండా చూసుకోవడం బుద్ధి మంతుల లక్షణం. ఏడవడం అవివేకుల లక్షణం.
*బుద్ధిమంతుడు అయిన వాడు లాభం వస్తే పొంగి పోవడం, నష్టం వస్తే కుంగిపోవడం పనికిరాదు.*
డిప్రెషన్లోకి(depression) జారిపోకూడదు. కిందపడ్డా పైకి లేవడానికి ప్రయత్నం చేయాలి.
కాబట్టి మనం చెయ్యవలసిన కర్మ, కర్తవ్యము చేయడమే మన పని.. ఫలితం మనది కాదు. ఫలితం గురించి ఆలోచించకూడదు. ఫలితం మీద ఆసక్తి లేకుండా చెయ్యాల్సిన పనిని శ్రద్ధతో చెయ్యాలి, మంచి ఫలితం దానంతట అదే వస్తుంది. అలా..
*సమత్వబుద్ధితో చేసేదే కర్మయోగం..*
🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏
No comments:
Post a Comment