Wednesday, March 26, 2025

 తల్లిని చంపిన కొడుకు ..
 పిల్లల్ని చంపిన తల్లి ..

 భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన భర్త ..
 భర్తను చంపి ముక్కముక్కలుగా   నరికిన  భార్య ..

టీచర్ ను చంపిన విద్యార్థులు ..
 విద్యార్థిని పై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన టీచర్లు  ..

పిల్లల్ని బకెట్లో ముంచి చంపిన తండ్రి .. 
జూనియర్ విద్యార్ధులపై విచక్షణా రహితంగా దాడి చేసిన హాస్టల్ విద్యార్థి .

 హింస ..
 పొద్దున్న బ్రేక్ఫాస్ట్ .. మధ్యాహ్నం లంచ్ .. రాత్రికి డిన్నర్ .. 
గడియకో
 బ్రేకింగ్ హింసా వార్త !

ఇది నేటి స్థితి .

ఎందుకు ?
1 .     మోర్టల్ కంబాట్ . సూపర్ మారియో .. కెప్టెన్ టోడ్, ట్రెజర్  ట్రాకర్ .. పిల్లలు  ఆడే కొన్ని హింసాత్మక వీడియో గేమ్స్ . 
చంపడం .. నరకడం .. తుపాకీతో కాల్చడం ..  కపాలాన్ని పగలగొట్టడం .. గుండెను చీల్చడం .. రక్తం ఏరులై పారడం .. కండల్ని ముక్కముక్కలుగా నరకడం .. ఇప్పుడు ఆటలు .
 ప్రతి రోజు గంటల కొద్దీ ఇలాంటి ఆటలు ఆడుతున్నారు .

2 అనిమల్ , కిల్ , మార్కో , పుష్ప - 2 . కెజిఫ్ ..  సూపర్ హిట్ అయిన సినిమాలు .
 ఇవన్నీ కబేళాలు .. మటన్ షాప్స్ .. 
నరకడం..  రక్తం .. ఇక్కడ సర్వ సాధారణం ...
అల్లు అర్జున్ యువకుడు ..
 పెద్ద పెద్ద హీరో లు...  బాలకృష్ణ చిరంజీవి చివరాఖరికి రజనీకాంత్    కూడా    హింసనే నమ్ముతున్నారు . .. ఒక్కో సినిమాకు దాని డొసేజ్ పెంచుకొంటూ పోకపోతే  సినిమాలు ఆడవు అని నిర్ణయానికి వచ్చేసినట్టున్నారు . .

 తప్పెవరిది ?
 తాగుబోతుకు   కాలం   గడించే కొద్దీ డోసు పెరగాలి . 
లేకపోతే కిక్   ఎక్కదు.
నేటి సమాజంలో పిల్ల-  జెల్లా.. తల్లి- తండ్రి .. ముసలి - ముతక .. అందరూ... " హింస తాగుబోతులు"  అయిపోయారు  . చిన్న స్క్రీన్ పై .. వెండి తెరపై హింస ను చూసి మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు . సెన్సార్ బోర్డు వాళ్ళు చచ్చి పోయి చాలా కాలం అయ్యింది . 
    దృశ్య రూపంలో చూసే హింస మెదడులోకి వెళ్లి కూర్చుంటోంది . సమయం వచ్చినప్పుడు బయట పడుతోంది .

3. రోడ్ పై హత్య జరిగితే దాన్ని  ఆపే  ప్రయత్నం ఎవరూ చేయరు . కనీసం అరవరు .
  వీడియో తీసి   సోషల్ మీడియా లో పెడుతారు . 
జనాలు సమ్మగా దాన్ని చూస్తున్నారు .
 వైరల్ చేస్తున్నారు .
  సున్నితత్వం చచ్చిపోయింది .
 ప్రతి మనిషిలో ఒక రాక్షసుడు.

4. పిల్లల పెంపకం అటకెక్కింది .
 పిల్లాడి చేతికి మొబైల్ ఇచ్చి తాను ఓటిటీ లో బూతు చూసే తల్లి .. ఇంటిని గాలికి వదిలి వాట్సప్ లో రాజకీయాలు చర్చించే తండ్రి .. ఇప్పుడు సర్వ సాధారణం ..
 కుటుంబ వ్యవస్థ కొనఊపిరితో వుంది .

5. పిల్లలకు ఎమోషనల్ తేలితేటలు ....  అంటే...  తన కోపమే తన శత్రువు ... అని నేర్పాల్సిన పాఠశాలలు .. ఐఐటీ ఫౌండేషన్ పేరుతొ బాల్యాన్ని చంపేసి ... విద్యా వ్యాపార రాక్షసులకు రక్తపు కూడు తినిపిస్తున్నాయి .

6. రాజకీయనాయకులు,  జనాల్లో పెరిగిన హింసా ప్రవృత్తిని చక్కగా వాడుకొంటున్నారు . 
కులం మతం భాషా ప్రాంతం పేరుతొ  రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నారు .

 7   సంఘ   జీవనం చచ్చింది . చివరాఖరికి గ్రామాల్లో కూడా ఆరుకాగానే తలుపులేసుకొని ... టీవీ ముందు ... మొబైల్ ముందు కూలపడుతున్నారు .
 ఇంట్లో నలుగురు    ఉంటే ఎవరి కి వారే ..
 చేతిలో మొబైల్ .. 
మాటల్లేవు ..
 మాట్లాడుకోవడాలు లేవు ..
  మనిషి ఒంటరి అయిపోయాడు . 
సామజిక ఎడం అంటూ ఊదరగొట్టారు . 
ఇప్పుడది నగ్న స్వరూపాన్ని చూపుతోంది .
 ఒంటరి తనం వల్ల...  చిరాకు అసహనం ... వ్యాకులత ... మానసిక కుంగుబాటు పెరిగి హింసా ప్రవృత్తి అలవడుతోంది . 

8. అయ్యలు బార్ లలో .. అమ్మలు పబ్స్ లో .. స్కూల్ పిలల్లు కూడా గంజాయికి ... మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయారు .

9. మొబైల్ వాడకం వల్ల..  నిద్ర రాదు . నిద్రలేమి వల్ల...  చిరాకు ... కోపం సహజం అయిపోతుంది .

10 . తినేది జంక్ ఫుడ్ . ఇది ఉద్రేకాలను రెచ్చగొడుతుంది . D  విటమిన్,  మెగ్నీషియం ఒమేగా త్రీ ఫాటీ ఆసిడ్స్ లోపం .. హింసా ప్రవృత్తికి బీజం వేస్తుంది .

ఇంత జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు జనాలు .
ఏమి చేయలేము అని చేతులు ఎత్తేసారు .

మీరు చెయ్యండి ..
 నలుగురికీ చెప్పండి .

1. పిల్లల చేతినుండి మొబైల్ ఫోన్ తీసేయండి . లేదంటే వాళ్ళు ఒక రోజు మిమ్మల్ని చంపడం ఖాయం .
2. మీరు మొబైల్  వాడకాన్ని తగ్గించండి . రీల్స్ చూడడం .. వాట్సాప్ లో గంటల కొద్దే చాట్టింగ్స్ వద్దు.
3. హింసా సినిమాల్ని బహిష్కరించండి .
 చూడొద్దు . 
ప్లాప్ అయితే ఇక పై తీయరు .
4. పిల్లలకు సంపూర్ణాత్మక విద్య అందించమని మీ పిల్లలు చదువుతున్న స్కూల్ యాజమాన్యానికి చెప్పండి .   
లేకపోతే  టీసీ లు తీసుకొంటామని హెచ్చరించండి. 
దెబ్బకు దిగొస్తారు .
5. సోషల్ మీడియా ఎక్కి రాజకీయ నాయకుల భజన చెయ్యడం కాదు . సెన్సార్ బోర్డు  ను  తిరిగీ ... సమాధి  నుంచి లేపమని .. నీలి చిత్రాలు .. బెట్టింగ్ అప్స్ .. హింసా సినిమాలు .. గంజాయి లాంటి వాటి పై ఉక్కు పాదం మోపకపోతే ఓట్లు వెయ్యము అని చెప్పండి .
 ఒక రాజకీయ నాయకుడు కూడా దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదో  నిలదీసి అడగండి ..
 కడిగెయ్యండి .
 పోస్ట్స్ పెట్టండి . 
ఇవన్నీ చెయ్యాలని రాష్ట్రపతిని ... సుప్రీమ్ కోర్ట్స్ న్యాయమూర్తులను కోరుతూ లేఖలు రాయండి .
 హాష్ టాగ్ సిసిల  కాంపైన్ మొదలెట్టండి .

నేటి బాలల జీవితం అనే వైకుంఠ పాళిలో 98 పాములు . 
రెండే నిచ్చెనలు .
 అదే తల్లితండ్రులు . 
మీ పిల్లలని మీరు కాకుండా ఎవరు రక్షిస్తారు ? 
మన పిల్లలు రేపు భద్రంగా బతకాలంటే ఇవన్నీ చేయండి .

No comments:

Post a Comment