Saturday, March 29, 2025

****అంతరాలోచన

 🌷 అంతరాలోచన 🌷

నాతో సహా సకలము నాలో 'ఉన్నట్లు' ఉన్నది., కానీ లేనే లేదు అని గ్రహించినవారే కాలకాలుడు (శివుడు).

మనిషికి అస్సలు బొత్తిగా లేని మూడు అనుభవాలు:-
✳ జన్మానుభవం
✳ మరణానుభవం
✳ ఆత్మానుభవం

👉 నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యం
-- దాని పేరు ధ్యానం.

👉 మాటలోని ఎరుక, మాటలోని సత్యం 
-- దానిపేరు జ్ఞానం.

👉 ఆత్మలోని శాంతం, ఆత్మలోని అభయం 
-- దాని పేరు మోక్షం.

👉 చేతలోని న్యాయం, చేతలోని వినయం 
-- దాని పేరు ధర్మం.

మనలో మనం పొందేది - భోగం.
ఇతరుల దగ్గర మనం పొందేది -  వైభోగం.

 ధ్యానమే భోగం, జ్ఞానమే వైభోగం.

దైవానుభవం అంటే తాను ఉండి, దైవాన్ని అనుభవించడం కాదు.
దైవమే తానై పోవడం. అప్పుడు 'అనుభవం' అంటూ ఏమీ ఉండదక్కడ.

సకల ప్రాణి కోటి తో అనురక్తి - దానిపేరే మైత్రి.
 కార్యకారణ సంబంధం విజ్ఞానము - దానిపేరే బుద్ధి.

 మైత్రి, బుద్ధి రెండూ కలిస్తే మైత్రేయ బుద్ధుళ్లు అవుతారు.

శిష్యుడు:- మాయ అంటే?

గురువు:- "ఉన్నది ఒక్కటే - అది నేనే" అన్న స్వస్థితిలో తనను ఉండనీయకుండా చలింప చేసే శక్తి ఏదైతే ఉన్నదో అదే "మాయ".

👉 తపస్సు(ధ్యానం) వలన నీ చుట్టూ ఆరా(దివ్య శక్తి) ఏర్పడుతుంది.
👉 ఆ ఆరాను దాటి ఏ దుష్టశక్తి(కరోనా లాంటి వైరస్సులు, చేతబడులు etc) నీ దరి చేరవు.

ఏ దుష్టశక్తి అయినా
➡ బహిర్ముఖుణ్ణే నాశనం చేస్తుంది.
➡ అంతర్ముఖుణ్ణి నమస్కరించి వైదొలగుతుంది.

నోరు - ప్రాపంచిక ద్వారం.

ముక్కు - ఆధ్యాత్మిక ద్వారం.

ఆత్మ జీవితంలో 'అనుభవాలే' ఉంటాయి;
 విజయాలు, అపజయాలు అనేవి ఏమీ ఉండవు.
ఇది అర్థం అయినప్పుడు జీవితం అందంగా ఉంటుంది.

'నేను' అనే బిందువు నశిస్తే,
'మహా మూల చైతన్యం' అనే సాగరం లభిస్తుంది.

మెలకువ రాక మునుపు, నిద్రపోయిన తర్వాత ఉన్న స్వస్థితిని--
 ఇప్పుడు మెలకువ లో పొందటమే 'స్వస్వరూపానుభవము' అంటే.

అందరిలో తాను ఒకడుగా ఉండుట - కర్మ.

 అందరి గా తాను ఉండుట - భక్తి.

 ఏమీ కాకుండా తాను ఉండుట - జ్ఞానం.

నేను అనేది మేనులో ఉన్నప్పుడు
 - శివం

నేను అనేది మేను నుండి తొలగినప్పుడు 
- శవం

No comments:

Post a Comment