ప్రతీ అబ్బాయి తెలుసుకోవల్సిన 10 రహస్యాలు | Part-1 | Anukula Vedam || Telugu Podcast
https://youtu.be/3fP2_agyuU8?si=ZvE4HXskXuDXp6E5
[సంగీతం] ప్రపంచ వ్యాప్తంగా 20 నుండి 40 ఏళ్ల వయసున్న అమ్మాయిలు అబ్బాయిల గురించి ఒక సర్వే జరిగింది అందులో తేలింది ఏంటంటే 90% అమ్మాయిలు బుద్ధిమంతుల్లాగా ఉండే అబ్బాయిల అటెన్షన్ ని మాత్రమే కోరుకుంటారు కానీ అలాంటి వారితో జీవితాంతం మాత్రం ఉండాలనుకోరండి కాబట్టి ఆ బుద్ధిమంతుల్ని తమ వెంట బానిసల్లాగా తిరిగేటట్టు చేసుకొని ఫైనల్ గా డేరింగ్ అండ్ డాషింగ్ గా కొంచెం డామినేటింగ్ గా కూడా ఉంటూ ఫిజికల్ గా కూడా హార్డ్ పర్సనాలిటీ ఉన్న వారిని మాత్రమే పెళ్లి చేసుకుందాం అనుకుంటారట అయితే ఈ విషయం తెలిసిన ఎంతో మంది అబ్బాయిలు బుద్ధిమంతుల్లాగా ఉంటే కుక్కల్లాగా వెంట తిప్పుకుంటూ చివరికి వదిలేస్తారని ఆ బుద్ధిమంతులు కూడా రఫ్ అండ్ టఫ్ గా మారే క్రమంలో బ్యాడ్ బాయ్స్ లాగా మారిపోతున్నారట ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం ఒరిజినల్ గా ఉండే తన మంచితనాన్ని కూడా పక్కన పడేసి ఒక రఫ్ అండ్ టఫ్ గై లాగా మారుతున్నాడు అంటే తన వ్యక్తిత్వాన్ని కూడా అమ్ముకుంటున్నాడు అంటే ఇంతకంటే హీనమైన బానిస ఇంకెవడైనా ఉంటాడా నిజానికి ఇలా వ్యక్తిత్వాన్ని కూడా అమ్ముకునే అబ్బాయిల్ని కొంతకాలం అయ్యాక అమ్మాయిలు కూడా ఒక మగాడి లాగా చూడరు పెద్ద తలనొప్పిలా చూస్తారు మొదటి పాయింట్ సినిమాల్లో మీరు ఇలాంటి సీన్స్ చూసే ఉంటారు అంటే అమ్మాయిలు ఎప్పుడూ కూడా అబ్బాయిల్ని అప్రోచ్ అవ్వరు అబ్బాయిలే అమ్మాయిల్ని అప్రోచ్ అవుతారు నా చిన్నప్పుడు అసలు ఎందుకలా అనేదానికి ఏం చెప్పేవారంటే రామాయణంలో సూర్పనక రాముడిని ఇష్టపడి దగ్గరికి వెళ్తే తన ముక్కుని కోసేసారు అప్పటి నుండి ఏ అమ్మాయి తనకి తాను అబ్బాయి దగ్గరికి వెళ్లే ధైర్యం చేయదు అని ఒక కథ చెప్పేవారు అయితే ఈ కథలన్నీ పక్కన పెట్టి యాక్చువల్ గా అసలు ఎందుకలా అనేదాన్ని ఒక భిన్నమైన కోణంలో చూద్దాం ఫస్ట్ అఫ్ ఆల్ అమ్మాయిల్ని ఎన్నో యుగాల నుండి ఎప్పుడూ సిగ్గుతో మొహం దించుకొని ఉండేలా చేశారు వాళ్ళు ఎప్పుడూ ఏ అబ్బాయితో మాట్లాడకూడదని తమ మానాన్ని మర్యాదని కాపాడుకుంటూ ఉండాలని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా స్ట్రెయిట్ గా ఎవరి వైపు చూడకూడదని కళ్ళు దించుకునే నడవాలని వాళ్ళ బుర్రలోకి ఎక్కించేశారు ఇంకో పక్క అబ్బాయిలకు మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చని ఎలా అయినా మాట్లాడొచ్చని ఏమైనా చేయొచ్చని పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చారు అయితే ఈ ఫ్రీడమ్ ని వాడుకొని ఆ అబ్బాయి ఎలా మారుతాడు అనేది తన చేతుల్లోనే ఉంది సో ఇలా అమ్మాయిల బుర్రల్ని హార్డ్ కండిషనింగ్ చేయడం వల్ల జనరల్ గా అమ్మాయిలు ఎప్పుడూ కూడా అబ్బాయిల్ని అప్రోచ్ అవ్వరు దానివల్ల ఫైనల్ గా అబ్బాయిల బుర్రల్లో కూడా ఒక స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే మనం అప్రోచ్ అవ్వకపోతే ఏ అమ్మాయి మన వైపు కూడా చూడదు అనేది స్టార్ట్ అయింది బట్ ఈ మధ్య సిట్యువేషన్స్ కొంతవరకు మారుతూ వస్తున్నాయి అమ్మాయిలు కూడా తమకు తామే అప్రోచ్ అవుతున్నారు అబ్బాయిలకి బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మే బీ ఒక 10% అమ్మాయిలే తమకి తాము అలా అప్రోచ్ అవుతున్నారు మిగతా 90% అమ్మాయిలు మాత్రం అబ్బాయిలే ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి అనే కేటగిరీ లోనే ఉన్నారు ఇప్పటికి కూడా ఎందుకంటే అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలి అనే నమ్మకాన్ని చిన్నప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఒక సాంప్రదాయం లాగా ఎక్కించేశారు అండ్ దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు కూడా కానీ ఇక్కడే వచ్చింది అసలు చిక్క అంతా ఈ నమ్మకం అబ్బాయిల బుర్రలో ఊహించని ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ ని ఇచ్చింది అదేంటంటే అసలు అమ్మాయిలు మెంటల్ గా చాలా స్ట్రాంగ్ అని వాళ్ళకి అసలు అబ్బాయిల అవసరమే ఉండదని వాళ్ళు అబ్బాయిలను అసలు పట్టించుకోరని అనుకోవడం స్టార్ట్ చేశారు సో మనం ఎప్పటికీ మాట్లాడకపోతే వాళ్ళు కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు అనే ఆలోచన అబ్బాయిల బుర్రలో బలంగా నాటుకుంది సో అప్పటి నుండి ఏమవుతుంది ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడితే లోకువైపోతామేమో అనే ఆలోచన లోపల మనల్ని ఆపుతున్న సరే మన సెల్ఫిష్నెస్ రీసన్స్ కోసం ఆ అమ్మాయిని ఎలా అయినా సొంతం చేసుకోవాలని ప్రేమ ముసుగులో ఉన్న కామం వల్ల చచ్చినట్టు మన ఈగోని పక్కన పెట్టి రిజెక్షన్ వచ్చినా పర్లేదని రెడీ అయ్యి మనమే మాట్లాడతాం ఇంత పంచాయితీ మన బుర్రలో నడుస్తూ ఉండడం వల్ల అమ్మాయిలు అనే సబ్జెక్టు అదేదో ఎవడు సాధించలేని ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా మన బుర్రలో తయారై కూర్చుంటది ఆ అమ్మాయి ఏదో పెద్ద దేవత లాగా ఒక గాడ్లీ ఫిగర్ లాగా మన బుర్రలో మనమే క్రియేట్ చేసుకుంటాం ఇక అప్పటి నుండి మనల్ని మనమే ఆ అమ్మాయి కోసం ఏదైనా చేసేస్తా అనే స్థితికి వచ్చేసి ఆ అమ్మాయి చుట్టూ ఒక బిచ్చగాడి లాగా తిరగడం స్టార్ట్ చేస్తాం కావాలంటే ఒక్కసారి మీరే ఆలోచించండి మీ ముందు ఒక అందమైన అమ్మాయి ఉంది అసలు ఎంత అందంగా ఉందంటే ఏం చేసి అయినా సరే ఆ అమ్మాయిని దక్కించుకోవాలి ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలి దాని కోసం ఏదైనా చేసేస్తా అనే స్టేజ్ లో ఉన్నారు అయితే ఆమె కళ్ళల్లోకి చూసినప్పుడు ఆమె పొగరుతో ఆటిట్యూడ్ తో నీలాగా కొన్ని వేల మంది నా చుట్టూ తిరుగుతున్నారు అసలు నీ లెవెల్ ఏంటి అని ఆమె మిమ్మల్ని అడుగుతున్నట్లు అనిపిస్తది మీ మీద ఎటువంటి ఎమోషన్ కాదు కదా కనీసం మీ వైపు కూడా చూడదు ఇవన్నీ ఒక అబ్బాయి బుర్రలో రన్ అవ్వడం వల్ల ఆమె ఏదో దివి నుండి భూమికి దిగి వచ్చిన ఒక దేవత లాగా ఆ అబ్బాయి బుర్రలో ఒక దేవత స్థానంలో కూర్చుంటది ఎందుకంటే దేవుణ్ణి మనం ఎలా ఫీల్ అవుతాం దేవుడికి మన నుండి ఏమీ అక్కర్లేదు కానీ మనకి మాత్రం దేవుడి నుండి చాలా కావాలి అలా కావాలంటే ఏం చేస్తాం దేవుడి ముందు మోకరిల్లి మరి చేతులు జోడించి ఒక బిచ్చగాడి లాగా అడుక్కుంటాం సేమ్ అలాగే ఒక అబ్బాయి ఆ అమ్మాయి చుట్టూ ఒక బిచ్చగాడి లాగా యాచిస్తూ వెనక వెనకాతలే చుట్టూ తిరుగుతుంటాడు సపోజ్ ఇలా మీరు ఆ అమ్మాయి చుట్టూ రోజులు నెలలు సంవత్సరాలు తిరిగిన తర్వాత ఫర్ సపోజ్ దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిందే అనుకోండి మీ ఆనందానికి ఇక హద్దు పద్దు ఉండదు ఇక అప్పటి నుండి జీవితాంతం ఆమెను అసలు వదులుకోకూడదని జీవితాంతం మీతోనే ఉండాలని అనుకుంటారు దానివల్ల అప్పటి నుండి ఆమెకి కావాలంటే అది కొనివ్వడం ఏం చేస్తే సంతోషంగా ఉంటదో అవన్నీ చేస్తూ ఉండటం ఒకవేళ ఎప్పుడైనా మీ మీద కోపమై మాట్లాడటం ఆపిస్తే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంటే అది తట్టుకోలేక ఏడుస్తూ ఆకలి వేయకపోవడం భోజనం చేయాలనిపించకపోవడం తను మళ్ళీ మీతో నార్మల్ గా ఉండటం కోసం చావు దాకైనా సరే వెళ్తా అనే డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు అసలు ఇదంతా అవసరమా దేని గురించి అయితే ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చాల్సిన అవసరం లేదో దాని కోసం ఇదంతా భరిస్తూ మొత్తం నీ జీవితం సంక నాగిపోయినా పర్లేదు అనే స్థితికి చేరుకోవడం అవసరమా అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి అలాంటి స్థితి నుండి బయటికి ఎలా రావాలి మళ్ళీ అలాంటి స్థితిలోకి వెళ్లకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి అని క్లియర్ గా వన్స్ ఫర్ ఆల్ డీప్ గా అర్థం అవ్వాలంటే ఇక్కడి నుండి నేను చెప్పేది శ్రద్ధగా పూర్తిగా వినండి కింద మీద పడి పోయి ఆరాధించడానికి ఆ అమ్మాయి ఏమి దేవత కాదు దేవుడు కాదు నీకు తెలియకుండా నీ కళ్ళ ముందు ఎన్నో రకాల అబద్ధాల తెరలు కట్టేసి ఉన్నాయి ముందు వాటన్నింటిని చించి స్పష్టంగా నువ్వు చూడాల్సిన నిజం ఏంటంటే ఏ మట్టి నుండి నువ్వు వచ్చావో అదే మట్టి నుండి తను కూడా వచ్చింది తనకి కూడా బాధ దుఃఖం కోపం ఏడుపు ఇవన్నీ చాలా సహజంగా వస్తాయి కానీ అవన్నీ నీ ముందు ఎక్స్ప్రెస్ చేయదు కాబట్టి మనం నార్మల్ గా చూసినప్పుడు ఆ అమ్మాయి ఫేస్ లో బాడీలో వచ్చే ఎక్స్ప్రెస్ అన్ని మన కళ్ళని అట్రాక్ట్ చేస్తాయి అండ్ తనని మనం కోరుకుంటున్నంత డీప్ గా తను మనల్ని కోరుకోవట్లేదు అనేది తన ఎక్స్ప్రెషన్స్ వల్ల మనం అనుకుంటాం కానీ అది అబద్ధం ఆ అమ్మాయి కూడా ఒక అబ్బాయిని చూసి అట్రాక్ట్ అవుతుంది మనలో కలిగిన సిమిలర్ ఫీలింగ్స్ తనలో కూడా కలుగుతాయి కానీ ఒక అమ్మాయి ఎలా ఉండాలో ఈ సమాజం తను పెరిగిన వాతావరణం ఆల్రెడీ ఫిక్స్ చేసి కండిషనింగ్ చేసేసాయి కాబట్టి ఆ బిడియం సిగ్గు వల్ల వాటిని ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయదు కానీ అని మనం ఏమనుకుంటాం అసలు ఆ అమ్మాయికి నేనేం పెద్ద విషయమే కాదు తనకు నచ్చింది నాలో ఒక్కటి కూడా లేదు అందుకే నన్ను అసలు పట్టించుకోవట్లేదు అని ఈ ఒక్క కారణం వల్ల మన కళ్ళకి ఆ అమ్మాయి ఏదో పెద్ద దేవత లాగా పెద్దగా కనపడటం స్టార్ట్ అవుద్ది తను పెద్దగా కనపడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి మనం తన ముందు చిన్నగా తక్కువగా ఫీల్ అయిపోతుంటాం దీనివల్ల ఆ అట్రాక్షన్ అనేది ఇంకా పెరిగిపోతుంటది ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా మన లెవెల్ కంటే గొప్పదే కావాలనిపిస్తది కదా మరి బట్ ఎప్పటి నుండి నేను చెప్పేది వింటే ఆ అట్రాక్షనే పోతుంది ఫస్ట్ దేశం మొదటి సినిమాలో హీరోయిన్ ఒక మాట అంటుంది ఇదంతా మట్ట అండి మనం చచ్చిపోతే ఈ ఫ్లెష్ మట్టిలో కలిసిపోతుంది మన బాడీలోని బ్లడ్ యూరిన్ లాంటివి వాటర్ లో కలిసిపోతాయి ఈ ఊపిరి గాలిలో కలిసిపోతుంది వాస్తవానికి అదే నిజం కాబట్టి తను ఏ మట్టి నుండి తయారయిందో నువ్వు కూడా అదే మట్టి నుండి తయారయ్యావన్నది నిజంగా మనస్ఫూర్తిగా నమ్మితే నీ కడుపులో గ్యాస్ ఏర్పడినట్టే తన కడుపులో కూడా గ్యాస్ ఏర్పడుతుంది నువ్వు తిన్నట్టే తను కూడా కూడా తింటుంది ప్రతి జీవి టాయిలెట్ కి వెళ్తుంది నాలుగు రోజులు స్నానం చేయకపోతే నీ ఒళ్ళు ఎలా కంపుకొడతాదో తన ఒళ్ళు కూడా అలానే కంపుకొడతది పొద్దున్నే లేవగానే బ్రష్ చేయకపోతే నీ నోరు ఎలా కంపుకొడతదో తన నోరు కూడా అలానే కంపుకొడతది అరే ఇంకా లోపలికి వెళ్తే అమ్మాయిలకి అబ్బాయిలకి ఒకేలాంటి ఎముకలు కూడా ఉంటది ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే తనేదో దేవలోకం నుండి దిగి వచ్చినట్టు ఫీల్ అయిపోయే నీ ఓన్ ఇమాజినేషన్స్ నీ సొంత ఊహల్లో నుంచి ఫస్ట్ బయటికి రావాలి నువ్వు ఎప్పుడైతే అందరిలాగా అలాగే ఆమె కూడా ఒక సాధారణమైన మనిషి ఇంకా డీప్ గా చెప్పాలంటే సాధారణమైన ఒక ప్రాణిలా చూడడం స్టార్ట్ చేస్తావో అప్పుడు మాత్రమే నువ్వు తనని చూసి భయపడటం తన కోసం ఏమైనా చేసేస్తానని ఫీల్ అయిపోవడం తనతో మాట్లాడడానికి కూడా నువ్వేదో తక్కువ అని ఫీల్ అయిపోవడం తను యాక్సెప్ట్ చేస్తదో లేదో అని అభద్రత భావంతో కృంగిపోవడం ఇన్సెక్యూర్ గా ఫీల్ అయిపోవడం ఇలాంటి ఓవర్ యాక్షన్ అంతా ఒక మనిషిని జస్ట్ ఒక మనిషిగా చూడడం స్టార్ట్ చేసినప్పుడే బంద్ అవుతాయి [సంగీతం] అసలు నువ్వు ఎప్పుడైనా ఒక అమ్మాయిని కలిసినప్పుడు ఇలా ఆలోచించే ప్రయత్నం చేసావా ఒక అమ్మాయిని చూసి ఆకర్షణ కలిగినప్పుడు నువ్వు ఆమెలో దేని పట్ల అట్రాక్ట్ అవుతున్నావ్ నీ ఆకర్షణ ఆమె శరీరం పట్ల ఉందా లేదా ఆమె గుణగణాలు మంచితనం లక్షణాల పట్ల ఎందుకంటే ఓన్లీ బాడీని చూసి అట్రాక్ట్ అయితే మాత్రం ఆ బాడీ సొంతమైన కొద్ది రోజులకే నీకు ఇంకా బోర్ కొట్టడం స్టార్ట్ అవుద్ది అయితే నువ్వు నిజంగా దేనికి అట్రాక్ట్ అయ్యావో నీకు నీకే తెలియాలంటే ఒక సింపుల్ ట్రిక్ ఉంది ఉంది అదేంటంటే ఎప్పుడైతే ఒక అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయితో ఎలా అయినా మాట్లాడాలి ఈ అమ్మాయిని ఎలా అయినా సొంతం చేసుకోవాలి ఈ అమ్మాయి కోసం ఏమైనా సరే చేయాలి అని అనిపిస్తుందో ఆ అమ్మాయి ప్లేస్ లో ఒక అబ్బాయి ఉంటే నేను ఇలానే ఆలోచిస్తానా ఏం చేసి అయినా ఈ అబ్బాయితో ఎలా అయినా సరే మాట్లాడాలి ఎలా అయినా సరే దగ్గర అవ్వాలి అని అనుకుంటానా ఎప్పుడైతే ఇలా ఆలోచించడం స్టార్ట్ చేస్తావో ఆ అమ్మాయిని వాడుకునే ఒక వస్తువులా కాకుండా ఒక మనిషిగా చూడడం స్టార్ట్ చేస్తావ్ ఇలా నీకు నువ్వు క్వశ్చన్ చేసుకున్న వెంటనే సపోజ్ ఆ అమ్మాయి ప్లేస్ లో అవే లక్షణాలు ఉన్న అబ్బాయి ఉంటే ఇంతగా పరితపించను అనేదే నీలో వచ్చే జవాబు అయితే కచ్చితంగా నువ్వు ఆమె శరీరానికి మాత్రమే అట్రాక్ట్ అయ్యావు అనేది ఒప్పుకోవడానికి ఇష్టం లేకపోయినా ఒప్పుకోవలసిన నిజం దీనివల్ల అప్పటివరకు ప్రేమ పేరుతో ములిగి తేలుతున్న ఆ మత్తు ఒక్కసారిగా వదిలేస్తది మీ మొత్తం బాడీ మీద జరుగుతున్న హార్మోన్స్ యొక్క ఆధిపత్యాన్ని ప్రేమ అని అనుకుంటున్నారని నిజాన్ని అర్థం చేసుకోండి ఫస్ట్ ఒకసారి నేను నా బైక్ మీద వెళ్తుంటే ఆకాశంలో ఏదో కనిపించింది అది చూసిన వెంటనే నా బైక్ ఆపి ఫోన్ తీసి వెంటనే ఒక ఫోటో తీశాను ఇప్పుడు మీకు ఈ ఫోటో చూసిన వెంటనే ఏమనిపిస్తుంది ఎవరైతే సనాతన ధర్మం దేవుడు వీటిని నమ్ముతారో వారు చేసే ఫస్ట్ పని చేతులు పైకెత్తి హర హర మహాదేవ ఓం నమఃశివాయ అని దండం పెడతారు ఎందుకంటే వాళ్ళకి అది శివలింగం లా కనబడుతుంది ఇదే ఫోటోని అసలు శివుడి గురించి గాని శివ లింగాన్ని గాని ఒక్కసారి కూడా చూడని వాడు ఏమనుకుంటాడు జస్ట్ ఒక మేఘాన్ని పట్టుకొని వీళ్ళు ఏంటంటే అంటున్నారు ఏంటి అంటాడు ఎందుకు ఎగ్జాంపుల్ ఇచ్చానంటే అది శివలింగం కాదు జస్ట్ ఒక మేఘం అనేదే నిజం కానీ అది మన కళ్ళకి శివలింగం అలా ఎందుకు కనిపించింది అంటే ఆ ఆకారంతో ఉండే దాని గురించి మన మైండ్ లో ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో మన కళ్ళతో చూస్తున్నది జస్ట్ ప్రాణంతో ఉన్న ఒక శరీరం మాత్రమే అనేదే నిజమైన సరే ఆ శరీరం గురించి మనమే ఏవేవో గొప్పగా పెద్దగా ఊహించేసుకుని తెగ ఫీల్ అయిపోతుంటాం నిజానికి ఏ అమ్మాయి అందంగా ఉండదు ఏ అబ్బాయి అందంగా ఉండడు ప్రకృతి వారికి ఇచ్చిన ఆకారంలో ఉంటారు అంతే ఆ ఆకారాలకి మనమే కొన్ని స్టూపిడ్ డెఫినిషన్స్ ఇచ్చేసి ఇలా ఉంటే అందం ఇలా ఉంటే అందం కాదు అని నిర్ణయించడం స్టార్ట్ చేశాం అది జస్ట్ ఒక ఆకారం జంతువులు చెట్లు లోయలు పర్వతాలు వీటన్నిటికీ ఎలా అయితే ఒక ఆకారం ఉందో అలా మనుషులకు కూడా డిఫరెంట్ ఆకారాలు ఉన్నాయి అంతే ఇప్పుడు ఆ ఆకారాల మీద కవితలు రాసేసి పాటలు పాడేసి సినిమాలు తీసేసి కింద మీద పడిపోయి జుట్టు పీక్కోవడం అనేది జరగటానికి ప్రధాన కారణం మనలో రగిలిపోతున్న కామం రూపంలో ఉన్న శారీరక అవసరం ఆ శారీరక అవసరమే ఒకరిని చూడగానే అందంగా ఉన్నట్టు మన కళ్ళకి అనిపించేలా చేస్తుంది ఒక గాడిద గాని కుక్క గాని పిల్లి గాని పంది గాని కప్ప గాని సింహం గాని ఏనుగు గాని ఒక అమ్మాయినో అబ్బాయినో చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నారు అని అనుకోవు కదా ఎందుకంటే జస్ట్ వాటితో పాటు బ్రతుకుతున్న ఇంకో ప్రాణం అనుకుంటే అంతే అందుకే ఒక సింహం ఎంత అందంగా ఉన్న అమ్మాయిని చూసినా అబ్బాయిని చూసినా దానికి కావలసిందే అది చూస్తది అంటే ఆహారం సో నువ్వు ఎంత అప్సరసవైనా ఇంద్రుడి లాగా ఉన్న ఏ ప్రాణికి ఫరక్కే పడదు కానీ మనం మాత్రం ఆమె నల్లగా ఉంది ఈమె తెల్లగా ఉంది ఆమె అందంగా ఉంది ఈమె చండాలంగా ఉంది వాడు పొట్టిగా ఉన్నాడు వీడు పొడుగ్గా ఉన్నాడు ఆమె బండగా ఉంది ఈమె పక్కగా ఉంది వాడు మంచోడు వీడు చెడ్డోడు అని అందరిని అదేదో మనమే క్రియేట్ చేసేసినాం జడ్జిమెంట్లు మాత్రం ఇచ్చేస్తుంటాం అరే వాళ్ళకి ప్రకృతి ఎలాంటి బాడీ ఇచ్చిందో వాళ్ళు అలా ఉంటారు నువ్వు ఎవడి మధ్యలో వాళ్ళందరినీ గురించి జడ్జిమెంట్లు ఇవ్వడానికి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే అందంగా ఉన్నారా లేదా అనేది ఆ వ్యక్తిలో లేదు నువ్వు చూసే కళ్ళలో నువ్వు చూసే విధానంలో మాత్రమే ఉంది సో ఎప్పుడైనా సరే ఒకరిని చూసిన వెంటనే మీ బుర్రలో గుండెలో కోటి వీణలు మోగిస్తున్నాయి అంటే ఆల్రెడీ మీ బుర్ర ఈ సమాజం సినిమాలు ఎక్కించిన చెత్తతో అవసరమైన దానికంటే ఎక్కువగా ఒక కండిషన్డ్ ప్రోగ్రాం అయిపోయి ఒక అబద్ధాల ముసుగులో బ్రతుకుతున్నదని అర్థం ఒక జైల్లో నుంచి బయటికి రావాలంటే ముందు అసలు జైల్లో ఉన్నాననే విషయం అయితే అర్థం అవ్వాలి కదా నువ్వు మానసికంగా పూర్తిగా డిస్టర్బ్ అయిపోవాలంటే ఏం చేయాలో తెలుసా ఏ అమ్మాయినైతే నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేస్తున్నావ్ అని ఫీల్ అయిపోతున్నావో ఆ అమ్మాయి గురించి మొత్తం అంటే మొత్తం తెలుసుకో ఆమె ఎక్కడ ఉంటది ఏం చేస్తది ఆమెకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అందులో ఎవరిని ఎక్కువ కలుస్తుంటారు ఒకవేళ ఆ అమ్మాయి ఆల్రెడీ నీ ఫ్రెండ్ అయితే ఆమె instagram facebook whatsapp telegram మొత్తం తనకి ఎన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో వాటన్నిటి పాస్వర్డ్స్ తీసుకొని ప్రతి రోజు చెక్ చేస్తుంది ఈ ప్రాసెస్ లో నీకు తెలియకుండా మానసికంగా నువ్వు ఎంత పిచ్చోడిలా తయారవుతావో నువ్వే చూస్తావ్ చీటికి మాటికి కోపం అయిపోతుంటావు ఏ పని సరిగ్గా చేయలేవు రాత్రులు సరిగ్గా నిద్ర లేక కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా రావడం స్టార్ట్ అవుతాయి ఎందుకంటే నువ్వు ఒకవేళ సింగిల్ అయ్యి ఉండి ఒక అమ్మాయికి దగ్గర అవ్వాలనుకుంటే ధైర్యంగా అందరితో తో మాట్లాడేటట్టు ఆ అమ్మాయి ముందుకెళ్లి స్ట్రెయిట్ గా మాట్లాడలేవు కాబట్టి ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడానికి వేరే దారులు ఏంటని ఆలోచించడం స్టార్ట్ చేస్తావ్ ఇలా రోజుల తరబడి ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుండడం వల్ల ఆ అమ్మాయి గురించి మాత్రమే నీ బుర్రలో రన్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ అమ్మాయి నీ ప్రపంచం లాగా నీ బుర్రలో రన్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆ అమ్మాయిని ఎలా అయినా దక్కించుకోవాలనే తపన రోజు రోజుకి ఎక్కువైపోతుంటది ఆ తపన ఎంత ఎక్కువైపోతుంటదో అది దక్కకపోవడం వల్ల కలిగే దుఃఖం అంతకంటే ఎక్కువైపోతుంటది సపోజ్ ఆ ఆ అమ్మాయి ఒప్పుకుంది అనుకో ఇక అప్పటి నుండి ఆ అమ్మాయి దక్కదనే దుఃఖం పోతుంది కానీ ఇంకో కొత్త దుఃఖం పుట్టుకొస్తది అదేంటంటే నిన్ను వదిలి వెళ్ళిపోతుందేమో అని భయం ఆ భయంతో ఆమె instagram facebook whatsapp టెలిగ్రామ్ అన్ని చూస్తుంటాం ఎందుకు నీతో కాకుండా ఇంకెవరితో అయినా క్లోజ్ గా ఉందేమో ఒకవేళ ఇంకెవరైనా నచ్చితే మోసం చేసి నిన్ను వదిలేస్తదేమో అని భయం ఆ అమ్మాయికి మోసం చేసే ఉద్దేశం లేకపోయినా సరే నీకు నువ్వే ఆ భయంతో కూడిన కళ్ళతో చూస్తుండడం వల్ల ఎవరు కొంచెం క్లోజ్ గా మాట్లాడిన వాడితో అలా ఎందుకు మాట్లాడుతున్నావ్ వాడు నీకు ఇలా ఎందుకు అడుగుతున్నాడు దానికి నువ్వు సీరియస్ గా సమాధానం ఎందుకు చెప్పలేదు instagram లో వాడిని ఎందుకు ఫాలో అవుతున్నావ్ వీడి పోస్ట్ ని ఎందుకు లైక్ చేసావు అని సతాయించడం స్టార్ట్ చేస్తావ్ ఈ ప్రశ్నలు ఆలోచనలు అన్నీ కూడా రేయిం బవలువు నీ బుర్రలో రన్ అవుతుండడం వల్ల సరిగ్గా తినవు సరిగ్గా పడుకోవు సరిగ్గా మాట్లాడవు కూడా అన్నిటికీ కోపం అయిపోతూ ఇలా అన్ని కలిసి నీ జీవితం సర్వనాశనం అయిపోయి మానసికంగా ఒక టాక్సిక్ మనిషి లాగా తయారవుతావు జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో నిజంగా నీతో ఉండాలనుకునే వారు ఏం జరిగినా సరే నీతో ఉండడానికే నీ జీవితంలోకి వస్తారు అలాగే నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోయే ఉద్దేశంతోనే నీ జీవితంలోకి వస్తారు కాబట్టి ఎవరు నీ జీవితంలోకి వచ్చారు ఎవరు నీ జీవితం నుంచి వెళ్ళిపోయారు అనే దానిపై నీ జీవితం ఆధారపడకూడదు ఎవరు నాతో ఉన్నా లేకపోయినా నా జీవితానికి వచ్చే లాభము లేదు పోయే నష్టము లేదు నాకెట్టు వంటి ఫరక్ పడదు అనే స్టేట్ లో ఉండగలగాలి కాబట్టి ఒక ముష్టుడి లాగా వాళ్ళ వెంబడిపడి నీ ఆత్మ గౌరవాన్ని తగ్గించుకోకు
No comments:
Post a Comment