💜*ఒక* *వింత* *ప్రయోగం*!💜
1950వ దశకంలో, కర్ట్ రిక్టర్, ప్రసిద్ధ హార్వర్డ్ గ్రాడ్యుయేట్, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో ఒక శాస్త్రవేత్త, నీటిని, గాజుజాడీలని, ఎలుకలను ఉపయోగించి అసాధారణమైన ప్రయోగాలను చేసాడు, దాని ఫలితంగా ఒక *అద్భుతమైన ఆవిష్కరణ* జరిగింది. ఎలుకలు మునిగిపోయే ముందు ఎంతసేపు ఈదతాయో అతను చూడాలనుకున్నాడు.
తన ప్రయోగంలో, రిక్టర్ ఒక ఎలుకను నీటితో సగం నిండిన గాజుజాడిలో వేసాడు. సహజంగానే, నీరు నిండిన జాడిలో పడేసిన క్షణంనుండి ఎలుక భయంతో, ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించింది.
కొన్ని నిముషాల సంఘర్షణ తర్వాత, ఎలుక జాడిలోంచి బయటకు వచ్చే ప్రయత్నాన్ని విరమించుకుంది. చివరికి నెమ్మదిగా నీటిలో మునిగి చనిపోయింది.
రిక్టర్ ఆ ప్రయోగంలో కొద్దిగా మార్పులు చేసాడు. మరో ఎలుకను తీసుకుని నీళ్లతో నింపిన ఇలాంటి జాడీలోనే వేసాడు. అయితే, అది సరిగ్గా చనిపోయే సమయానికి ముందు, దానిని ఎత్తుకుని, కొంచెం సేపు నిమిరి, మళ్లీ నీటి జాడీలో పడేసాడు.
ఎలుక మరోసారి తన సంఘర్షణ ప్రారంభించింది. అయితే రిక్టర్ చేసిన చిన్నపాటి చర్య ఎలుక ప్రవర్తనలో భారీ మార్పును తీసుకురావడం అతనికి కూడా ఆశ్చర్యం కలిగించింది!
కేవలం 15-20 నిమిషాలు ఈత కొట్టి, ఎలుక మునిగిపోతుందని రిక్టర్ ఊహించాడు.
కానీ ఆశ్చర్యకరంగా, అలా జరగలేదు!
ఎలుక అంత త్వరగా లొంగలేదు, సరికదా జాడిలో అలా ఈదుతూనే ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ సేపు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉంది.
60 గంటలు!
అవును, అరవై గంటలపాటు, ఎలుక నీటి నుండి బయటకురావడం కోసం ఆగకుండా ఈదుతూనే ఉంది.
ఇది చూసి రిక్టర్ ఆశ్చర్యపోయాడు. అంతకుముందు నీటిలో పడేసిన ఎలుక కేవలం 15 నిమిషాల్లోనే చేతులెత్తేసింది. ఇప్పుడు ఈ ఎలుక గత 60 గంటలుగా ఆగకుండా ప్రయత్నిస్తూ, వదిలేయడానికి నిరాకరిస్తోంది!
కర్ట్ రిక్టర్ ఈ ప్రయోగానికి *"ది హోప్ ఎక్స్పరిమెంట్" (ఆశ మీద పరిశోధన)* అని పేరు పెట్టారు....!
*ఏ కారణం చేతనైనా, జీవితం ఇకపై జీవించడానికి విలువైనది కాదని ప్రజలు విశ్వసించిన క్షణం, ఆ నమ్మకం స్వయంగా నెరవేరుతుంది.*
ముందుగా ఆ ఎలుకను దాదాపుగా చంపినది ఏమిటి?
ఆశ లేకపోవడం లేదా నిస్సహాయత అని చెప్పవచ్చు. ఇంతకుముందు, ఎలుక తనకు రక్షణ లేదు అనే పరిస్థితిలో ఉన్నాననే భావనను కలిగి ఉండడం వల్ల, తన ప్రయత్నం ఆపేసి, చనిపోతున్నట్లుగా అనిపించింది
అప్పుడు, ఆ పరిస్థితికి, *ఏది ఎలుక యొక్క ప్రతిచర్యను మార్చింది?*
*ఎలుక నిస్సహాయతను నిర్మూలించటం!*
*ఎలుక మునిగిపోయే ముందు వెంటనే దాన్ని బయటకితీసిన అప్పుడు, అది చనిపొవట్లేదని, పరిస్థితి వాస్తవానికి నిస్సహాయ కరంగా లేదని, సహాయం అందుబాటులో ఉండవచ్చని తెలుసుకుంది*
*సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈత కొట్టడానికి దానికి ఒక కారణం ఉందనిపించినప్పుడు, ఆపకుండా కొడుతూనే ఉంది. అది దాని ప్రయత్నం ఆపలేదు, మునిగిపోలేదు!*
*ఆశ మానవ జీవితంలో ఒక ముఖ్యమైన అంశం.మనుషులు, ఎలుకల మధ్య సహజంగా చాలా తేడాలు ఉన్నాయి. కానీ ఒక సారూప్యత ఉంది: ఈత కొట్టడానికి మనందరికీ ఒక కారణం ఉండాలి*
*ఆశ అనేది హృదయం లోని అంతర్గత విశ్వాసం నుండి ఉద్భవించే ఒక వైఖరి....చారీజీ*
No comments:
Post a Comment