🕉️
మనిషికి మనసే గొప్ప సాధనా కేంద్రం. మనసు కదలకుండా బంధిస్తుంది. అదే మనసు మార్గం చూపించి, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రసాదిస్తుంది. ఈ మనసును స్వాధీనంలోకి తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉంది అన్నాడు అర్జునుడు. అయినా ప్రయత్నించమన్నాడు శ్రీకృష్ణుడు. సత్యం తెలుసుకున్న తరవాత మన పనులు ఎప్పుడైనా, ఎలాగైనా చేసుకోవచ్చు. సత్యం మరచిపోయి, అసత్యంలో ఈ మనుషులు తింటూ, తిరుగుతూ, ఎలా నిద్రపోగలుగుతున్నారు అంటున్నారు జ్ఞానులు. పరిష్కరించకుండా ఉన్న లెక్కలాంటిది జీవితం. మత్తు వదలాలి. వదిలించుకోవాలి. మనలో ఉన్న దివ్యత్వాన్ని మనమే గుర్తించాలి. మనిషిగా పుట్టిందే అందుకు. ఆ ఆత్మవికాసం కోసం చెయ్యని ప్రయత్నం ఉండకూడదు. ఏ సాధనా మిగలకూడదు!🕉️
No comments:
Post a Comment