పూర్వం ఒక కుమ్మరి కుటుంబం ఉండేది.వారికి ఇద్దరు కొడుకులు ఉండేవారు, తల్లిదండ్రులు ఇద్దరు కొడుకులకు అందమైన అమ్మాయిలును చూసి పెళ్లి చేశారు.
ముసలి వాళ్ళిద్దరూ మట్టి తెచ్చి కుండలు తయారు చేసేవారు, కొడుకులు ఇద్దరు
ఆ కుండలను తీసుకెళ్లి అమ్ముకొని తినడానికి గింజలు తీసుకొని వచ్చేవారు.వీరితో పాటు ఆ కుటుంబంలో రెండు పాడి ఆవులు ఉండేవి. అత్తా మామ కుండలు తయారుచేయడం లో నిమగ్నమై ఉండేవారు.కోడల్ని పిలిచి ఆవులకు గడ్డి వేయమని,అలాగే వాటికి తాగడానికి నీటిని పెట్టమని చెప్పేవారు.
అలాగే అత్తయ్య అలాగే మామయ్య అంటూ ఇద్దరు కోడలు కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ, ఏ పని చెప్పకుండా సోమరిపోతు లై ఇంటి లోనే వుంటు ఆవులకు గడ్డి తినడానికి వీలు లేకుండా దూరంగా విసారి వేసేవారు.ఇలాగే నీటిని కూడా వాటికి తాగడానికి వీలు లేకుండా దూరంగా పెట్టేవారు.
వీరు చేస్తున్నా పనులను అత్త మామ లు ఇద్దరు గమనించారు. మందలిస్తు,
ఏంటమ్మా ఇలా చేస్తున్నారని అడిగితే, మేం వాటికి గడివేస్తున్న తినడం లేదు, నీళ్లు పెడుతున్న తాగడం లేదు అని సమాధానం చెప్పేవారు.
పాపం ఈ విషయాలన్నీ కుండలు అమ్ముకోడానికి
పోయి వచ్చే కొడుకులకి తెలిసేది కాదు. వారి భర్తలకు ఆ విషయాలు వారికి చెబితే,ఎక్కడ కొడుకులు కోడళ్లు గొడవలు పడి విడిపోతారో అని భయపడి చెప్పేవారు కాదు.
వారు చేసేదేమీలేక పాపం బాధపడుతూ భగవంతుడా ఈ కర్మ కు తరుణోపాయం నువ్వు ఏదో ఆలోచించు స్వామి అని అనునిత్యం వేడుకునే వారు.ఆవులు గడ్డి, నీరు లేక బక్క చిక్కి కొన్నిరోజులకు చనిపోయాయి.
ఆ తర్వాత కొంత కాలానికి అత్తామామలు చనిపోయారు,
మరి కొంత కాలానికి వారి భర్తలు కూడా చనిపోయారు,ఇంకా కొంత కాలానికి ఆ ఇద్దరూ కోడలు కూడా చనిపోయారు.అలా అందరూ చనిపోయిన తరువాత వీరందరికీ వారి వారి కర్మలను బట్టి మరలా జన్మలు వచ్చాయి.
చనిపోయిన వారి భర్తలు ఆవుల యజమానులు గాను,ఆ రెండు ఆవులు పశువుల కాపర్లు గాను, ఈ కోడలు ఇద్దరూ ఆవుల గాను జన్మించారు. ఆ పశువుల కాపరులు, పశువులను రోజు మేపడానికి అడవికి తోలుకుని వెళ్లేవారు.
పచ్చని గడ్డి కనిపిస్తే ఆవులు తినడానికి,అలాగే పారే నీరు కనిపిస్తే వాటిని తాగడానికి ప్రయత్నించేవి,కానీ వాటి దురదృష్టం గడ్డి తినడానికి నీళ్ళు తాగడానికి తల ఎంత వంచినా వంగేది కాదు.
పాపం పశువుల కాపరులకు ఏమీ అర్థం కావడం లేదు, ఎందుకు అలా జరుగుతుంది అని బాధపడేవాడు ఒకరోజు ఆ దారి వెంబడి భార్య తో కలిపి నడిచి వెళుతున్న ఒక మహాముని కనిపించారు. ఆ మహామునికి నమస్కరించి స్వామి మేం ఏమో రోజు ఈ పశువులను ఇక్కడికి మేపడానికి తోలుకొని వస్తాం. కానీ అవి ఎంత ప్రయత్నించినా ఆ గడ్డిని మేడం కానీ, నీరు తాగడం కానీ చేయలే కున్నాయి మాకు ఏమీ పాలుపోవడం లేదు స్వామి.
స్వామి ఈ విషయాలు మా యజమానులకు తెలిస్తే మమ్మల్ని పనుల నుండి తొలగిస్తారు. మాకు పని లేకుండా పోతుందని భయంగా ఉంది స్వామి మీరే ఏదో ఒకటి చేయండి స్వామి అని దీనంగా వేడుకున్నారు.
మునీశ్వరుడు తన దివ్య దృష్టితో గమనించి చూడగా అవి పూర్వ జన్మలో చేసిన పాపం గురించి ఆవగతమైనది, ఆ విషయాని వివరంగా వారి కి చెప్పడం జరిగింది.అది విని వారు ఆశ్చర్యపోయారు.
స్వామి తెలిసో తెలియకో వారు మా పట్ల ఆభాద్యత గా ప్రవర్తించారు, ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు పాపం నివారణ ఉపాయం ఉంటే ఏదైనా చెప్పండి స్వామి,ప్రాధేయపడ్డారు.
ఆ మునీంద్రుడు వారి మాటలకు తల ఊపి తన తపశ్శక్తితో వాటిని నేమిరాడు.
వాటికి పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది, మీరు చేసిన పాపం మిమ్మల్ని ఈ విధంగా బాధిస్తుందని అని అనగానే
సిగ్గుతో తలవంచుకుని కన్నీటిని కారుస్తూ నిలబడ్డాయి.
పశువుల కాపరులరా కార్తీక పౌర్ణమి రోజు .ించిన ప్రసాదాన్ని తెచ్చి విటికి తినిపించండి పాప నివారణ జరిగి ఈ జన్మ యధావిధిగా సాగిపోతుంది అని దీవించి వెళ్ళిపోయారు.
ఆ మునీశ్వరులు ఇద్దరూ ముందు జన్మ లోని
వారి అత్త మామలు.పశువుల కాపరులు ఇద్దరు
కార్తీక పౌర్ణమి రోజు భగవంతుడికి నివేదించిన ప్రసాదం తేచ్చి వాటికి ఆహారంగా పెట్టడం జరిగింది.
ఆ రోజు నుంచి అవి అన్ని ఆవుల మాదిరిగానే మామూలు గా గడ్డి తినడం నీరు తాగడం చేసేవి,
హమ్మయ్య యజమాని మనలను ఏమి అనడు అని
పశువుల కాపరు లు ఇద్దరు ఇద్దరు సంతోషించారు.
ఈ కథలోని నీతి ఏంటంటే ఈ జన్మలో భగవంతుడు మనకు ఏదైనా అధికారం, ఐశ్వర్యం ఇస్తే వాటిని భగవంతుని ప్రసాదంగా మనం స్వీకరించాలి మన తోటి వారికి కూడా ప్రసాదని మంచి గా పంచి పెట్టాలి అంతేగాని మన కింద పని చేసే ఉద్యోగుల అయినా సరే, మన ఇంట్లో ఉన్న జంతువులు అయినా సరే, ఇంకే ఎవరైనాసరే తెలిసిగాని తెలియకగాని వారి పట్ల మనం ఆ బాధ్యతగా వ్యవహరిస్తే ఆ పాపాన్ని మనం ఖచ్చితంగా ఇదే జన్మలోని అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు కూడా కర్మలను కంప్యూటరీకరణ చేసుకున్నాడు. ఎప్పటి కర్మలను అప్పుడే ఎవరు చేస్తే వారకే అప్పుడే అప్పగిస్తున్నాడు.
తస్మాన్ జాగ్రత్త పాపం ఊరికే పోదు వడ్డీ తో సహ మనం మూల్యం చెల్లించవలసి ఉంటుంది...
No comments:
Post a Comment