Sunday, April 20, 2025

 🙏 *రమణోదయం* 🙏

*వెలుగు ప్రసరించిన చోటనే వస్తువులున్నట్లు కనబడతాయి తప్ప, వెలుగుకతీతంగా ఏవీ కనిపించవు. అట్లాగే హృదయంలో ఆత్మ ప్రతిబింబంగా ఉదయించి, స్మృతి విస్మృతుల రూపంలో చలించే మనస్సుకి తెలిసేవే యీ దృశ్యమాన జగత్ బింబాలు.*

వివరణ : *మనస్సు లేక యీ ప్రాపంచిక దృశ్యాలు లేవు. ఆత్మజ్ఞానంలో సృష్ట్యాది అన్య దృశ్య ప్రపంచం లేదని భావం.*

ఎలా వచ్చావో తెలియదు
ఎలా పోవాలో తెలుసుకో...

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏

 సత్యాన్ని విన్నప్పుడు లేదా తెలుసుకున్నప్పుడు
హృదయం అంగీకరిస్తుంది
కానీ మనసే నిరాకరిస్తుంది.

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

 *భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.636)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🪷🪷🦚🦚🪷🪷🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment