Tuesday, April 22, 2025

 🔔 *ఆణిముత్యాలు* 🔔

*జీవితంలో*
*అతి ప్రమాదకరమైనది దుఃఖం,*
*దాన్ని దిగమింగడం నేర్చుకోవాలి.*
*ఇంకా భయంకరమైనది నిరాశ..*
*దాన్ని అస్సలు పట్టించుకోకూడదు*

*ఇంకా నీచమైనది అసూయ..*
*దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకూడదు.*

🙏🏻🙏🏻🔔🔔🙏🏻🙏🏻

*మనది అని రాసి పెట్టి ఉంటే
ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే......!
అది మనకు దక్కి తీరుతుంది.
  అది వస్తువైనా..
మనిషి అయినా..
           ప్రేమ అయినా సరే...!!

🙏🏻🙏🏻🔔🔔🙏🏻🙏🏻

*ఆవేశపరుడితో మన ఆలోచనలు*
*పంచుకోకూడదు...*
*అసూయాపరుడితో మన అభివృద్ధిని*
*చెప్పుకోకూడదు.....!!*

🙏🏻🙏🏻🔔🔔🙏🏻🙏🏻

*నటన ముందు నిజాయితీ*
*ఎప్పుడూ ఓడిపోతూనే*
*ఉంటుంది.....*
*కానీ, నటనకు నిజాయితీ*
*ఏదో ఒకరోజు ఖచ్చితంగా*
*సమాధానం చెప్తుంది.....!!*

🙏🏻🙏🏻🔔🔔🙏🏻🙏🏻

*తప్పు చేసి కూడా మాటలతో*
*సమర్థించుకునేవారు*
*కొందరైతే.....*
*ఏ తప్పు చేయకుండానే*
*మాట్లాడలేక మౌనంగా*
*ఉండేవారు మరికొందరు....*

*అలా మౌనంగా ఉన్న వాళ్ళని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు*

🙏🏻🙏🏻🙏🏻🔔🔔

No comments:

Post a Comment