🍃🪷 గెలుపెపుడంటే...
*********
రక్తాలు పారిన ఏ నేలైనా చరిత్రలో వికసించిందా!
ఉన్మాదం రేపే మతమేదైనా తుదకంటా నిలిచిందా!
ఆలోచనని చంపిన ఆవేశం ఏనాడైనా గెలిచిందా!
ఆధునికత విస్తరించిన వేళ ఆటవికత ఏల?
ఆకాశం అంచులు దాటే సమయాన అగాధపు జారుడేల?
భావ వ్యాప్తితో నిలిచి గెలవాల్సిన చోట ఉన్మాదం ఏల?
కలదో లేదో తెలియని పరలోకపు ప్రేలాపనలతో పిచ్చి చేష్టలు ఏల?
మంచు కొండల్లో కుంకుమ పువ్వులు వికసించనీ
సూర్యోదయాలతో గడ్డి మైదానాల్ని మెరవనీ
పర్యాటకులతో కశ్మీరం కళకళ లాడనీ
మనుషుల మధ్య అనుబంధపు పరిమళాలు బలపడనీ
ఆలోచనా ధారలతో హృదయాలు గెలవనీ
జనస్వామ్యపు కాంక్షతో ఆత్మ గౌరవ పతాకను ఎగురనీ
అది కదా గెలుపంటే
అది కదా అసలు సిసలు మలుపంటే
✒️ - వి.ఆర్. తూములూరి గారు
🍃🪷సేకరణ
No comments:
Post a Comment