. *“నాలుక జారితే నరకమేరా!!!”*
*"చిలుక తనకు చిక్కిన ఫలమును వెంటనే తినదు. ముక్కుతో పొడిచి రుచి చూచి బాగా పండిన ఫలమును మాత్రమే తింటుంది.*
*మానవుడు కూడా మాటలలో చేతలలో తొందరపడకూడదు. ఒక తలంపు రాగానే అది మంచిదా? కాదా? అని ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే వివేకము.*
*మానవుని శరీరంలో అన్నిటికంటే పైభాగంలో ఉండే శిరస్సులోనే పంచేంద్రియాలున్నవి. కానీ, రెండు ఇంద్రియాలను మాత్రం జాగ్రత్తగా వాడుకోమని వాటికి మూతలు పెట్టినాడు భగవంతుడు.*
*కన్నులకు, నోటికి మాత్రమే మూతలున్నవి. కన్నులతో అన్నింటినీ చూడనక్కరలేదు, నోటితో అన్ని మాటలు వదరనక్కర్లేదు. చూడవలసినవి మాత్రమే చూడాలి, పలకవలసినవి మాత్రమే పలకాలి.*
*అనవసరమైనవాటిని చూడకుండా, మాట్లాడకుండా ఈ మూతలు పనికివస్తాయి. చెడ్డచూపులు చెడ్డమాటలు పనికిరావు. ‛కాలు జారితే కలుగదు కష్టం, నాలుక జారితే నరకమేరా!’ అన్నారు.*
*'పశువా’ అని తిట్టేదీ, ‛పశుపతీ’ అని పిలిచేది ఈ నాలుకే. ఈ రెండింటికీ మంచిచెడ్డలు నిర్ణయించేది నీవే. పంచేంద్రియాలను అరికడితే నీవు ధన్యుడవవుతావు."*
*~భగవాన్ శ్రీ సత్యసాయి బాబా.*
*꧁❀❀━❀🙏🕉️🙏❀━❀❀꧂*
No comments:
Post a Comment